Search
  • Follow NativePlanet
Share
» »పెట్టేలోని అమ్మవారు, వారానికి మూడు సార్లే దర్శనం దీనివల్ల....

పెట్టేలోని అమ్మవారు, వారానికి మూడు సార్లే దర్శనం దీనివల్ల....

పెట్టి కాని అమ్మ దేవాలయం గురించి కథనం.

ఇక్కడ అమ్మవారిని రాజా విక్రమాదిత్యుడు ఆరాధించాడు. అయితే ఆ అమ్మవారు కావేరి నదిలో పెట్టెలో వచ్చి ప్రస్తుతం కుంభకోణానానికి దగ్గరగా ఉన్న తిరుపడల వనం వద్ద కావేరి ఒడ్డుకు చేరుకొంది. ప్రజలంతా కలిసి అమ్మవారిని అక్కడికి దగ్గర్లో ఉన్న ఈశ్వరుడి ఆలయంలో ప్రతిష్టించి పూజిస్తున్నారు.

పెట్టెలో అమ్మవారు ఉండటం వల్లే ఆమెను పెట్టికాళి అమ్మ అని పిలుస్తారు. వారానికి మూడు రోజులు మాత్రమే అమ్మవారి దర్శనానికి వీలవుతుంది.

ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ఈశ్వరుడిని సుందరేశ్వరుడని పిలుస్తారు. ఈయన దర్శనానికి ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంద్రుడు ఐరావతం మీద ఇక్కడకు వస్తాడని చెబుతారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

విక్రమాదిత్యుడు

విక్రమాదిత్యుడు

P.C: You Tube

రాజా విక్రమాదిత్యుని ఆరాధ్య దైవం ఉజ్జయినీలోని కాళీ మాతా అమ్మవారు. అయితే ఆ రాజు చివరి రోజుల్లో ఆ మాత రెండుగా చీలిపోయిందని చెబుతారు. అలా చీలిపోయిన విగ్రహాన్ని ఒక పెట్టెలో పెట్టి కొంతమంది బ్రాహ్మణులు దక్షిణ దిశగా సాగిపోతూ ఉంటారు.

కావేరి నదిలో

కావేరి నదిలో

P.C: You Tube

ఇలా వెలుతున్నవారికి కావేరి నది అడ్డం వస్తుంది. అదే సమయంలో ఆ బ్రాహ్మణుల చేతిలో ఉన్న పెట్టే కావేరి నదిలోకి పడిపోతుంది. అలా నదిలో కొట్టుకొచ్చిన పెట్టే ప్రస్తుతం కుంభకోణానికి దగ్గరగా ఉన్నా తిరుపడలవనం అనే ప్రాంతం వద్ద ఒడ్డకు చేరింది.

చిన్న పాప ద్వారా

చిన్న పాప ద్వారా

P.C: You Tube

ఈ ఈ విషయం గ్రామస్తులకు తెలిసి తండోపతండాలుగా అక్కడికి చేరుకొన్నారు. అయితే ఆ పెట్టెలో నుంచి కాంతిపుంజాలు వస్తుండటంతో మొదట్లో ఎవరూ ఆ పెట్టేను తెరవడానికి సాహసించలేదు. అటు పై ఒక అశీరవాణి సూచన మేరకు ఒక చిన్న పాప ద్వారా ఆల పెట్టెను తెరిపించారు.

కాళీ రూపంలో

కాళీ రూపంలో

P.C: You Tube

అప్పుడు ఆ చిన్నపిల్లతో పాటు మిగిలిన వారికి అమ్మవారు కాళీ రూపంలో దర్శనమిచ్చారు. ఇక ఆ పెట్టను ప్రస్తుతం సుందరీశ్వర్ ఆలయంలో పెట్టి పూజలు చేయసాగారు. ఇదిలా ఉండగా ఆ పెట్టే చాలా పెద్దది. పూర్వం ఇళ్లలో భోషాణాలు ఉన్న పరిమాణంలో అమ్మవారు ఉంటారు.

ఎనిమిది చేతులతో

ఎనిమిది చేతులతో

P.C: You Tube

ఎర్రని మొహం, నొసటన వీభూతి, తిలకం, నోట్లో రెండు కోరలు, ఎనిమిది చేతులు ఉన్నాయి. కుడివైపు చేతుల్లో శూలం, డమరుకం, కొక్కెం తదితర ఆయుధాలతో పాటు చిలుక కూడా ఉంది. అదే విధంగా ఎడమ వైపు చేతుల్లో పాశం, డాలు, గంట, పెర్రె ఉంటాయి.

పెట్టెలో దొరకడం వల్ల

పెట్టెలో దొరకడం వల్ల

P.C: You Tube

ఇక పెట్టెలో దొరకడం వల్ల అమ్మవారిని పెట్టి కాళి అమ్మాన్ అని చాలా అందంగా కనిపించడం వల్ల సుందర మహాకాళి అమ్మన్ అని కూడా అంటారు. గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ పెట్టే మూతను తీసి ప్రజల సందర్శనార్థం ఉంచేవారు.

వారానికి మూడు సార్లు

వారానికి మూడు సార్లు

P.C: You Tube

అయితే ప్రస్తుతం వారానికి మూడు రోజులు అమ్మవారి దర్శనానికి అవకాశం ఉంది. పెట్టే తెరిచిన తర్వాత ఒక గంట సేపు అమ్మవారిని సందర్శించడానికి అవకాశం కల్పిస్తారు.

మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటగలకు

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు

ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక పూజల తర్వాత పెట్టెను తెరుస్తారు.

పరమేశ్వరుడు లింగ రూపంలో

పరమేశ్వరుడు లింగ రూపంలో

P.C: You Tube

ఇక ఇక్కడ ఉన్న ప్రధాన దైవం పరమేశ్వరుడు ఆయన లింగ రూపంలో ఉంటారు. పూర్వం ఇక్కడ బ్రహ్మ దేవుడు ఒక శివలింగాన్ని ప్రతిష్టించి రోజూ ఆయనకు పూజలు చేసేవాడు. ఆయన పూజలకు మెచ్చిన పరమశివుడు బ్రహ్మ దేవుడికి జ్జానోపదేశం చేశాడని చెబుతారు.

 ప్రతి పౌర్ణమికి

ప్రతి పౌర్ణమికి

P.C: You Tube

దీంతో ఆయన మంచి మనస్సును గుర్తించిన దేవతలు ఆయన్ను సుందరుడు, లోక సుందరుడని కొనియాడారు. అందువల్లే స్వామి పేరు సుందరేశ్వరుడు అయ్యింది. ఇక ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఇంద్రుడు ఐరావతం మీద వచ్చి ఇక్కడ శివుడిని పూజించి పోతాడని స్థలపురాణం చెబుతుంది.

 అభిరామి

అభిరామి

P.C: You Tube

ఇక ఇక్కడ ఉన్న అమ్మవారిని అభిరామి అని అంటారు. ఆమె దక్షిణ ముఖంగా ఉంటుంది. నాలుగు చేతులతో దర్శనమిచ్చే ఈ తల్లి కుడివైపు పై చేతిలో జపమాల ఎడమవైపు పై చేతిలో తామర పుష్పం ఉంటుంది. ఇక కింది చేతుల్లో అభయ, వరద ముద్రికలు ఉంటాయి.

చాలా పురాతనమైనది.

చాలా పురాతనమైనది.

P.C: You Tube

ఇక ఆలయం చాలా పురాతనమైంది. చోళుల సమయంలో నిర్మించబడిందని చెబుతారు. ఐదు అంతస్తుల రాజ గోపురం తూర్పు ముఖంగా ఉంటుంది. ఇక్కడ శిల్పలు భారతీయ శిల్ప కళకు అద్దం పడుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X