Search
  • Follow NativePlanet
Share
» »కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాల గురించి తెలుసా

కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాల గురించి తెలుసా

కృష్ణా నదీ తీరంలో ఉన్న కొన్ని ముఖ్యమైన దేవాలయాలకు సంబంధించిన కథనం.

హిందూ మతంలో నదులను పుణ్య జలాలుగా భావిస్తారు. అందువల్లే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, పర్వదినాల్లో, ఉత్సవాల సమయంలో ఆ నదుల్లో పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు. ఈ నదులను పుణ్య జలాలుగా భావించడానికి కారణం లేకపోలేదు. ఈ నదుల ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఉంటాయి. అందువల్లే ఈ నదీజాలల్లో స్నానం వల్ల పాపాలన్నీ పోయి పునీతులమవుతామని హిందూ భక్తులు నమ్ముతుంటారు. ఇందు కోసం సుదూర ప్రాంతాలకు సైతం ప్రయాణం చేసి ఆ పుణ్య నదుల్లో స్నానం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ తీరంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల్లో ముఖ్యమైన ఆలంపురం, బీచుపల్లి, వేదాద్రిల గురించిన క్లుప్త సమాచం మీ కోసం ఈ కథనంలో...

ఆలంపురం

ఆలంపురం

P.C: You Tube

తెలంగాణలోని కృష్ణ నదీ తీరంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపురం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ వెలిసిన క్షేత్రం ఇది. ఇక్కడ అమ్మవారి దవడ పన్ను పడిందని చెబుతారు.

అన్యతమతస్థలు

అన్యతమతస్థలు

P.C: You Tube

అన్యమతస్థుల దాడిని తుంగభద్ర నదీ ఉప్పొంగులను తట్టుకొంటూ నిలబడింది. ఈ ఆలయ పునరుద్ధరణ కోసం రామకృష్ణ శర్మ అనే పండితుడు ఆ ఆలయాన్ని పునరుద్ధరించడానికి, సంరక్షించడానికి శతవిధాల ప్రయత్నించాడు.

పరవళ్లు

పరవళ్లు

P.C: You Tube

అందువల్లే ప్రస్తుతం మనం ఆలయంలో అమ్మవారి దర్శనాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ కృష్ణానది తుంగభద్రల కలయికతో పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతుంది.

బీచుపల్లి

బీచుపల్లి

P.C: You Tube

మహబూబ్ నగర్ జిల్లాలలోని జాతీయ రహదారి పక్కనే ఉణ్న ఈ పుణ్యక్షేత్రంలో ఆంజనేయస్వామి కొలువై ఉన్నాడు.

వ్యాసరాయులు

వ్యాసరాయులు

P.C: You Tube

సాక్షాత్తు వ్యాసరాయుల వారే ఈ ఆంజనేయస్వామిని ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడ హనుమంతుడికి ఇరువైపులా శంఖుచక్రాలు ఉండటం విశేషం.

బోయకులస్తులు

బోయకులస్తులు

P.C: You Tube

ఇక్కడ స్వామివారికి పూజారిగా వ్యాసరాయులు ఓ బోయకులస్తుడిని నియమించారు. అప్పటి నుంచి కులానికి చెందినవారే పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అమరావతి

అమరావతి

P.C: You Tube

ఆంధ్రులకు వేల సంవత్సరాల క్రితమే అమరావతిని రాజధానిగా ఉంది. పంచరామాల్లో ఒకటైన ఇక్కడి అమరేశ్వరాలయంలో అమర లింగేశ్వరుడు చాముండీ సమేతుడై ఉన్నాడు.

పది అడుగులు

పది అడుగులు

P.C: You Tube

సుమారు పది అడుగులకు పై బడిన పాలరాతి శివలింగం ఇక్కడ ప్రత్యేకం. అంతే కాకుండా అనేక బౌద్ధ స్థూపాలు, ఆరామాలు కూడా ఇక్కడ ప్రముఖ పర్యాటక స్థలాలు.

 వేదాద్రి

వేదాద్రి

P.C: You Tube

హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి ఇక్కడ పంచనారసింహుడిగా అంటే అయిదు రూపాల్లో వెలిశాడని స్థలపురాణం.

ఆ ఐదు రూపాలు ఇవే

ఆ ఐదు రూపాలు ఇవే

P.C: You Tube

వారే ఉగ్ర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నారసింహులు. ఇక్కడ స్వామివారి మూల విగ్రహాన్ని సాక్షాత్తు బుుష్యశ`ంగ మహర్షి ప్రతిష్టించాడని ప్రతీతి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X