Search
  • Follow NativePlanet
Share
» »స్వయంగా యముడు నిర్మించిన సరస్సులో స్నానం చేస్తే మృత్యుభయం దూరం

స్వయంగా యముడు నిర్మించిన సరస్సులో స్నానం చేస్తే మృత్యుభయం దూరం

తిరువైకావూర్ లోని యముడు స్వయంగా నిర్మించిన సరస్సు గురించి కథనం

యముడు, మన ప్రాణాలను తీసే దేవుడిగా పేరు. అయితే యముడు కేవలం నిమిత్రమాత్రుడు మాత్రమే. లయకారకుడైన ఆ పరమశివుడు చెప్పినట్లు మాత్రమే నడుచుకొంటూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఆ పరమశివుడిని మనం పూజిస్తాం. అందుకే పురాణ కాలం నుంచి భారత దేశంలో ఆయనకు ఎన్నో గుళ్లు, గోపురాలు నిర్మించారు.

అయితే కేవలం ఆయన చెప్పినట్లు నడుచుకొనే యముడికి మాత్రం భారత దేశంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆయాలు లేవు. ఒక వేళ ఉన్నా అవి అన్ని శివాలయంలో అంతర్భాగంగానే ఉన్నాయి. అయితే కేవలం ఒకే ఒక చోట మాత్రం యముడు స్వయంగా నిర్మించిన సరస్సును యముడితో సమానంగా భావించి పూజిస్తారు. భక్తితో స్నానం చేస్తారు. దీని వల్ల మృత్యుభయం దూరమవుతుందని నమ్ముతారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం....

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయంలో ప్రధాన దైవం పరమశివుడు. ఏడవ శతాబ్దంలో తమిళనాడులో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కవిగా పేరుతెచ్చుకునక్న తిరుజ్జాన సంబంధార్ తన రచనల్లో కూడా ఈ దేవాలయం గురించి తన రచనల్లో పేర్కొన్నారు. అదే తిరువైకావూర్ దేవాలయం.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువైకావూర్ అనే చిన్న గ్రామంలో ఈ దేవాలయం ఉంది. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం కుంభకోణం నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఈ మహిమాన్వితమైన దేవాలయం ఉంది.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

అదే విధంగా స్వామిమలై నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో తిరువైకావూర్ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని యమధర్మరాజుకు ప్రతీకగా భావిస్తారు. ఈ దేవాలయం నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు ఉంటాయి.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

పూర్వం ఇక్కడ ఓ సాధువు తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. ఒకానొక రోజున ఓ వేటగాడు చింకను తరుముతూ ఈ ప్రాంతానికి వస్తాడు. దీంతో ఆ జింక ప్రాణ భయంతో ముని వద్దకు వచ్చి రక్షణ కోరుతుంది. ఆ సాధుజంతువు దీన స్థితికి చలించిపోయిన రాజు ఓ పులిలా మారిపోతాడు.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

అంతేకాకుండా ఆ వేటగాడిని అక్కడి నుంచి దూరంగా తరమడానికి వీలుగా గట్టిగా గాండ్రిస్తాడు. వెంటనే వేటగాడు దగ్గర్లో ఉన్న బిల్వ చెట్టు పై భాగంలోకి చేరుకొంటాడు. ఎంత సేపైనా పులి ఆ చెట్టు నుంచి దూరంగా వెళ్లదు.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

దీంతో ఆ వేటగాడు ఈ చెట్టు చిటారు కొమ్ముకు చేరుకొంటాడు. సూర్యోదయం అయినా కూడా ఆ పులి అక్కడి నుంచి కదలదు. ఇక వేటగాడు రాత్రికి ఆ చెట్టు పైనే ఉండిపోవాలని నిర్ణయించుకొంటాడు.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

అయితే నిద్రపోయి ఆ మత్తులో కిందికి పడిపోతే పులి తనను తినేస్తుందని భయపడుతాడు. నిద్ర రాకుండా ఉండటం కోసం ఒక్కొక్క బిల్వ పత్రాన్ని తుంచి కిందికి వేస్తాడు. ఆ పత్రాలు ఆ చెట్టు కింద ఉన్న శివలింగాన్ని తాకుతాయి.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube


అదే రోజు శివరాత్రి దీంతో రాత్రి మొత్తం ఆ వేటగాడు ఆ చెట్టు పైనే జాగారణ చేస్తూ శివలింగం పై ఆ పత్రాలను వేస్తూనే ఉంటాడు. దీంతో శివుడు అతని పూజకు మెచ్చుకొని అక్కడ ప్రత్యక్షమవుతాడు. శివుడిని చూసి పులి రూపంలో ఉన్న సాధువు, ఆ బోయవాడు స్తుతిస్తారు.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

దీంతో మరింత ఆనందబరితుడైన పరమేశ్వరుడు వారికి మోక్షం అనుగ్రహిస్తాడు. శివుడి క`పకు పాత్రులైన ఆ ఇద్దరి ప్రాణాలను తీసుకెళ్లడానికి యముడు స్వయంగా ఇక్కడికి వస్తాడు. అంతేకాకుండా పరమేశ్వరుడి వారి ఇద్దరి పేరు పై ఇక్కడ ఓ పెద్ద సరస్సును యముడు స్వయంగా నిర్మిస్తాడు.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

యముడు నిర్మించిన ఈ సరస్సులో స్నానం చేస్తే మృత్యుభయం దూరమవుతుందని శివుడు అనుగ్రహమిస్తాడు. దీంతో అప్పటి నుంచి భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తుంటారు.

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

తిరువైకావూర్ లోని యమధర్మరాజు దేవాలయం

P.C: You Tube

కాగా విష్ణువు కూడా తనకు అంటిన ఓ శాప నివ`్తి కోసం ఇక్కడ ఈ సరస్సులో స్నానం చేశాడని పురాణ కథనం. అందువల్లే ఈ దేవాలయంలోని సరస్సులో స్నానం చేయడానికి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X