• Follow NativePlanet
Share
» »మద్యం, మాంసం, గంజాయి....కాదేదీ ప్రసాదానికి అనర్హం.

మద్యం, మాంసం, గంజాయి....కాదేదీ ప్రసాదానికి అనర్హం.

Written By: Beldaru Sajjendrakishore

ఓవైపు మద్యనిషేధం అంటూ ప్రభుత్వాలు గగ్గోలు పెడుతుంటే .. మరోవైపు ప్రజలే అది ప్రసాదమంటూ స్వీకరిస్తున్నారు. మద్యాన్ని ఇస్తున్నది ఏ బారో, రెస్టారెంటో అయితే అయితే పర్వాలేదు ... కానీ ఏకంగా ఆలయాలే మద్యాన్ని ప్రసాదంగా ఇస్తున్నాయంటే నమ్మ శక్యం కావటం లేదు కదూ ..! అయితే ఈ వ్యాసం చదవండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది.

ఇండియాలో ఆలయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలయాలలో దేవుళ్ళ, దేవతల ప్రతిమలను పూజించడం సాధారణం. కొన్ని చోట్ల బుల్లెట్ బండిని, ఎలుకలను పూజించడం కాస్త ఆశ్చర్యకరమైనదే .. అయినా అలాగే పూజిస్తున్నాం. అదే కోవకు చెందినదే ప్రస్తుతం ఇక్కడ చెప్పుకోబోతున్నది. ఇండియాలో ఏ ఆలయానికి వెళ్ళినా ప్రసాదాలు తప్పక పెడుతుంటారు. కింద పేర్కొన్న ఆలయాలు అన్ని ఆలయాకంటే భిన్నమైనది. ఇక్కడ అందజేసే ప్రసాదమే విచిత్రం. అదేంటో మీరే చదవండి.

1. మంచ్ మురుగన్ ఆలయం,

1. మంచ్ మురుగన్ ఆలయం,

Image source:


కేరళ పేరులోనే ఉంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో ?. ఇక్కడి మురుగన్ దేవుడికి చాక్లెట్ లంటే ఇష్టమట. అందుకే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయానికి వచ్చి మంచ్ చాక్లెట్ లను సమర్పిస్తారట. ఇది తెలిసిన చుట్టుపక్కల వారు కూడా మతాలతో సంబంధం లేకుండా ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఇంకో విషయం 'పుష్పాంజలి' మరియు 'అర్చన' తర్వాత భక్తులకు మంచ్ చాక్లెట్లను ప్రసాదాలుగా ఇస్తారట.

2. చైనీస్ కాళీ ఆలయం

2. చైనీస్ కాళీ ఆలయం

Image source:


కలకత్తా చైనీస్ కాళీ ఆలయం, తంగ్రా ప్రాంతంలోని చైనాటౌన్ (chinatown) లో కలదు. ఇక్కడ కాళీ ఆలయంలో నూడుల్స్, చోప్ సుఎయ్ ని భక్తులకు ప్రసాదాలుగా అందిస్తారు. చైనీస్ కాళీ ఆలయం చైనా మరియు ఇండియా కు మధ్య ఒక వంతెన మాదిరి, రెండు దేశాల సంస్కృతులకు, సంప్రదాయాలకు గట్టి బంధంగా ఉన్నది. పశ్చిమ బెంగాళ్ వంటకాలతో పాటు ఇక్కడ నూడుల్స్ వంటి చైనీస్ వంటకాలను మొదట అమ్మవారికి నైవేద్యంగా పెడుతారు. అటు పై వాటిని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.

3. పరస్సినిక్కడవు ఆలయం,

3. పరస్సినిక్కడవు ఆలయం,

Image source:


కన్నూర్ కేరళ రాష్ట్రంలోని పరస్సినిక్కడవు మదప్పురం ఆలయం అది అందించే ప్రసాదాలకు పెట్టింది పేరు. చేపలు, తాటి చెట్ల నుండి తీయబడిన పుల్లని రసం మరియు అల్కాహాలు(ఫుల్ లేదా ఆఫ్ బాటిల్) ను దేవత ముందు పెట్టి పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత, పూజారులు వీటినే ప్రసాదాలుగా భక్తులకు అందిస్తారు. గ్రీన్ గ్రాం మరియు కొబ్బరి ముక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఇలా మాంసాన్ని ప్రసాదంగా అందజేసే దేవాలయం మరెక్కడా ఉండదేమో.

4. ఖబీస్ బాబా ఆలయం,

4. ఖబీస్ బాబా ఆలయం,

Image source:


లక్నో ఖబీస్ బాబా ఆలయం, యూపీ లోని లక్నో లో ఉంది. ఖబీస్ అనే సన్యాసి శివున్ని ప్రార్ధిస్తూ చనిపోయాడు. అతని శిష్యులు బాబా చనిపోయిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని కట్టినారు. ఆ ఆలయాన్ని భక్తులు తరచూ సందర్శించి ఆల్కాహాల్ ను నైవేద్యంగా పెడతారు. బాబా ముందు ఉన్న రెండు బీటలలో, ఒకదాంట్లో మద్యాన్ని ధారాళంగా పోస్తారు. చివరగా దాన్ని సేకరించి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. దీన్ని భక్తులు పరమ పవిత్రమైనదిగా భావించి చేవిస్తారు.

5. కర్ణి మాతా ఆలయం

5. కర్ణి మాతా ఆలయం

Image source:


రాజస్థాన్ లోని బికనీర్కు దగ్గరగా ఉన్న కర్ణి మాత ఆలయం బికనేర్ లో క్రీ.శ. 20 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆలయం బయట వెండితో చేయబడిన ప్రధాన గేటు మరియు లోపల మార్బుల్ చెక్కడాలు అనేకం కలవు. కాబాస్ అని పోలువబడుతూ తిరిగే ఇక్కడి ఎలుకను భక్తులు పూజిస్తారు. వాటికి నైవేద్యంగా పాలను పోస్తారు. కాబాస్ ఆ పాలను తాగితే సుభసూచికంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. సదరు పాలను కొంతమంది భక్తులు సేవిస్తారు.

6. యోని స్రావితాన్ని

6. యోని స్రావితాన్ని

Image source:


శక్తి స్వరూపుణి వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో ఉందీ క్షేత్రం. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. ఇక్కడ సచీదేది యోని పడిపోయి పుణ్యక్షేత్రంగా మారిందని పురాణ కథనం. ఈ యోని పడ్డ భాగం నుంచి వెలువడే జలాన్ని భక్తులు తీర్థంగా శ్వీకరిస్తారు.

7. గంజాయి...

7. గంజాయి...

Image source:


వారణాసి కొన్ని స్మశానవాటికల్లో అఘోరాలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆ పూజలు చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడే కాలిన శవం తాలూకు భస్మాన్ని తీసుకువచ్చి అందులో గంజాయిని కలిపి తమ అనుచరులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ అఘోరాల అనుచరుల్లో విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. అదే విధంగా మనాలిలోని కొన్ని హిందూ దేవాలయాల్లో కూడా గంజాయిని స్వల్ప ప్రమాణంలో కొన్ని పదార్థాలతో కలిపి ప్రసాదంగా అందజేస్తారు. ఈ విషయం తెలిసినా పోలీసులు పెద్దగా పట్టించుకోరు.

8. విస్కీ ఇక్కడ ప్రత్యేకం

8. విస్కీ ఇక్కడ ప్రత్యేకం

Image source:


మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిన్ లో కాలభైరవ దేవాలయం ఉంది. పూజలో భాగంగా భక్తులు ఇచ్చిన మద్యాన్ని ఒక సాసర్ లో వేసుకుని గుడిలోని పూజారి కాళీ మాత విగ్రహం దగ్గరకు తీసుకువెళుతాడు. అందులో మూడు వంతుల మద్యం సదరు విగ్రహం తాగుతుందని మిగిలినది భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. దేవాలయం బయట మనకు కొబ్బరి కాయలతో పాటు మద్యాన్ని అందజేస్తారు. ఇందుకు కొంత రుసుం వసూలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసిన మద్యాన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా పెడుతాం.

ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి