• Follow NativePlanet
Share
» »ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Written By: Venkatakarunasri

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి. మన జీవితమే ఒక దీపావళి. దీపావళి అంటే అర్థమేమిటో తెలుసా?దీపాల వరుస అని. కానీ దీపావళి అర్థాన్ని కాదు,పండుగల పరమార్ధాన్ని మార్చేస్తున్నాం మనం. ఎన్ని టపాసులు, ఎంత పెద్ద బాంబులు కాలిస్తే,అదే దీపావళి.మనం చేసుకునే పండగ వల్ల ఎవరికి నష్టం జరిగితే మనకేంటి? పండుగ మాత్రం ధూంధాంగా చేయాల్సిందే. మనం చేస్తున్న దానివలన మన పర్యావరణానికి ముప్పు అని తెలిసినా,ఏడాదికి ఒక సారేగాఅని సమర్ధించుకుంటాం.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

అలా సమర్ధించుకునే వాళ్ళంతా ఒకసారి తమిళనాడులోని ఈరోడ్ జిల్లాగురించి తెలుసుకోవలసిందే. ఒకటిరెండేళ్ళు కాదు ఏకంగా 17ఏళ్ళు నిశ్శబ్దదీపావళిని జరుపుకుంటున్నారు అక్కడి ప్రజలు. దేని గురించో తెలుసా?కొన్ని మూగ జీవాల గురించి.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

అది కూడా అక్కడ వారు పెంచుకునే జంతువులో, పశువులగురించో కాదు. ఏటా వలస వచ్చే పక్షుల గురించి అక్కడ ఒక చిన్న మతాబు పేల్చక ఎన్నో ఏళ్లయింది.కాకరపువ్వొత్తులు కూడా వెలిగించరు.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఇప్పుడిప్పుడే పిల్లల సరదా కాదనలేక చిన్నచిన్న టపాసులు ఇస్తున్నారు.తమిళడు ప్రాంతంలో వున్న ఈ జిల్లాలో తమిళం, తెలుగుతో కలిపి 8భాషలు మాట్లాడతారు. భిన్నభాషలసమ్మేళనంగా వున్న ఈ జిల్లా ప్రజలమనసు బంగారం.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

అందునా ప్రత్యేకంగా వేలూర్ బర్డ్స్ చివర వున్న 8గ్రామాల ప్రజలహృదయమైతే వెన్నకన్నా మెత్తటిది.ఇక్కడ మొత్తం 770గడపలుంటాయి.వారంతా సుమారు 80హెక్టార్లలో పరుచుకున్న పక్షుల సంరక్షణాకేంద్రం చుట్టూ ఆవాసాలు ఏర్పాటుచేసుకున్నారు. అక్కడికి వలస పక్షులు సీజన్లవారీగా వస్తూవుంటాయి.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ముఖ్యంగా ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ నుంచి పెద్దఎత్తున వస్తూ వుంటాయి.అక్కడే గూడు కట్టుకుని గుడ్లుపెట్టి పొదిగి సొంతదేశానికి ఎగిరిపోతాయి.అవన్నీ మూడునెలల పాటు వుంటాయి.దీపావళినాడు పెద్ద పెద్ద టపాసులు కాలిస్తే అవి బెదిరిపోతాయేమో అనే భయంతో నిశ్శబ్దదీపావళి జరుపుకుంటున్నారు.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఇతరులకోసం మన సంతోషాలను ఎందుకు కాదనుకోవాలి అనుకునే మనుషులున్నమన సమాజంలో నోరు లేని పక్షులకోసం తమ ఆనందాన్ని త్యాగం చేస్తున్న వీళ్ళు నిజంగా గొప్పవాళ్ళు కదా.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఈరోడ్ వాతావరణం

సాధారణంగా ఈరోడ్ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది, వర్షపాతం సంతృప్తికర౦గా ఉండదు. ఫిబ్రవరి, మార్చి నెలలలో ఈ ప్రాంత వాతావరణం ప్రత్యేకంగా కావేరి నది పక్కన సాధారణంగా చాలా తేమతో కూడా ఉంటుంది. ఏప్రిల్ నెలలో వాతావరణం మరింత వేడిగా మారి, గరిష్ట తేమను కల్గి ఉంటుంది.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

జూన్, జూలై, ఆగష్టు నెలలలో పాల్ఘాట్ అంతరం గుండా చల్లటి గాలి వీస్తుంది, ఈరోడ్ ప్రాంతానికి వచ్చేసరికి కాని ఈ చల్లటి ప్రభావం తగ్గిపోయి వాతావరణం వెచ్చగా, దుమ్ముగా ఉంటుంది.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

భవాని

తమిళనాడు లోని ఈరోడ్ జిల్లలో ఉన్న భవాని జిల్లా మొత్తం మీద రెండవ అతి పెద్ద మునిసిపల్ పట్టణ౦. ఇది భవాని, కావేరి నదులు సంగమించే చోట ఉన్నందున స్థానికులు దీనిని ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో యాభై వేల కంటే ఎక్కువ జనాభా ఉంది. ప్రాధమికంగా ద్వీపకల్పద్వీపమైన ఈ పట్టణం ఈరోడ్ పట్టణానికి ఉత్తరాన ఉంది. చాలామంది ఈ ప్రాంతాన్ని దక్షిణాది త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ పట్టణం శివునికి చెందిన సంగమేశ్వర ఆలయానికి ప్రసిద్ధి చెందింది.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఈ ప్రాంతం చుట్టూ వేదగిరి, తిరుచేనగోడ్, మంగళగిరి, సంకగిర్, పద్మగిరి ఉన్నాయి. రాష్ట్రంలో ఈ పట్టణం తివాచి పరిశ్రమకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలోని తివాచీలు జాతీయ జయనినాదాన్ని కల్గించడమే కాక ఈ రాష్ట్ర ప్రజలు దీనిని తివాచి నగరంగా పిలుస్తారు.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

మహిమలిశ్వర్ ఆలయం

మహిమలిశ్వర్ ఆలయం ఈరోడ్ టెంపుల్ టౌన్ కి దగ్గరలో ఉంది. ఇది ఈ పట్టణంలోని సెంట్రల్ బస్ స్టాండ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుని విగ్రహం ఉన్న ఈ ఆలయం గొప్ప చారిత్రిక విలువ కలిగినది. శివుడు ఉన్న మాలివరార్ శుభప్రదమైన వాటిలో ఒకటిగా భావిస్తారు.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఈ ఆలయంలో శివుడు ప్రధాన విగ్రహం, కానీ ఇక్కడ మా శక్తి విగ్రహం కూడా ఉంది. ఈమెను మరగదంబిగై గా ప్రస్తావిస్తారు. ఈ ఆలయంలో వినాయకుడు, బ్రహ్మ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ దైవత్వాన్ని ఈ ప్రాంతపు అతిపెద్ద ఆకర్షణగా పరిగణిస్తారు. స్థానిక ప్రజలు ఈ ఆలయ౦ గురించి అనేక కధలను చెప్తారు. అంతేకాకుండా, వారి భద్రత, రక్షణ శివుని చేతిలో ఉందని, ఆ దేవుని ఆశీర్వాదం వల్ల అన్నిరకాల కష్టాలను జయిస్తున్నారని నమ్ముతారు.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

మొహమూదియా మసీదు

మొహమూదియ మసీదు భారతదేశంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటిగా భావిస్తారు. ఈ మసీదుకి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది. ఇది ముస్లిం లకు భారీ గుర్తింపుని తెచ్చే నిజమైన గుర్తు, ఈ గుర్తింపు ఖచ్చితంగా వ్యక్తిగత గుర్తింపు. ఈ మసీదుని కేవలం ముస్లిమ్స్ మాత్రమె కాకుండా, అనేకమంది హిందువులు, ఇతర మతాలకు చెందినవారు కూడా ఈ మసీదుని సందర్శిస్తారు.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఈ మసీదు నిర్మాణశైలి చాలా నైపుణ్యంతో ఉంటుంది, దాని నాణ్యతా నిర్మాణశైలి ముగల్ నిర్మాణశైలిని ప్రతిబింబిస్తుంది. ఈ మసీదు లోపల పెద్ద ప్రైవేటు నివాసగృహం ఉంది. ఇది చాలా పెద్ద మసీదు, ఇది నగరానికి చెందిన సాధారణ ప్రజలకు అనేక సదుపాయాలను అందిస్తుంది. తమిళనాడు ఈరోడ్ పట్టణంలోని ఈ మసీదు పురాతన సంప్రదాయంలో ఉంటుంది. ఇది తనదైన వారసత్వాన్ని కలిగిఉంది. ఇది దేశం మొత్త౦లో పూజించదగిన పవిత్రమైన స్థలాలలో ఒకటి.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఈరోడ్ చేరడం ఎలా

ఈ నగరానికి కోయంబత్తూరు విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. ఈ నగరం అద్భుతమైన రోడ్లతో ముఖ్య నగరాలకు మార్గాన్ని కల్గి ఉంది. నగరానికి దగ్గరగా ఈరోడ్ జంక్షన్ రైలు స్టేషన్ ఉంది. ఈరోడ్ నగర బస్ స్టేషన్ నుండి అన్ని పర్యాటక గమ్యస్థానాలకు బస్సు సౌకర్యం ఉంది. పర్యాటకులకు అందుబాటులో ఉన్న ఆటో రిక్షాలు, టాక్సీలు, సైకిల్ రిక్షాల ద్వారా నగరంలో ప్రయాణించవచ్చు.

pc:youtube

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

రోడ్డు ద్వారా

బెంగుళూర్, కోయంబత్తూర్, చెన్నై, కొచ్చి, త్రివేండ్రం వంటి భారతదేశంలోని వివిధ ప్రధాన పట్టణాల నుండి ఈరోడ్ కి రోడ్డుమార్గం ద్వారా తేలికగా చేరుకోవచ్చు. ఈరోడ్ లో ప్రైవేట్ బస్సులు, టాక్సీలు తేలికగా అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు ట్రావెల్ ఏజెంట్ల సహాయంతో ఈరోడ్ లోనూ, నగరం బైట అద్దె టాక్సీలలో ప్రయాణం చేయవచ్చు.

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

రైలుమార్గం ద్వారా

భారతదేశం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులు ఈరోడ్ నగరాన్ని రైలు ద్వారా చేరుకోవచ్చు. రైల్వే వ్యవస్థ అద్భుతంగా ఉంది, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ళు రెండూ భారతదేశంలోని అనేక ప్రధాన పట్టణాల నుండి నడుస్తున్నాయి.

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

ఆ 8గ్రామాల్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసా?

వాయుమార్గం ద్వారా

ఈరోడ్ నగరం నుండి దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయంబత్తూర్ ఈ ప్రాంతానికి సమీప విమానాశ్రయం.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి