Search
  • Follow NativePlanet
Share
» »రాజ‌స్థాన్‌లోని ఈ ప్ర‌దేశాల్లో దీపావ‌ళి వెలుగులు చూడాల్సిందే!

రాజ‌స్థాన్‌లోని ఈ ప్ర‌దేశాల్లో దీపావ‌ళి వెలుగులు చూడాల్సిందే!

రాజ‌స్థాన్‌లోని ఈ ప్ర‌దేశాల్లో దీపావ‌ళి వెలుగులు చూడాల్సిందే!

దీపావళి భారతదేశంలో చాలా ముఖ్యమైన పండగ. దీపాల పండుగను దేశంలోని నలుమూలల్లో ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఈ రోజున భారతదేశంలోని దాదాపు ప్రతి ఇల్లు దీపపు కాంతితో ప్రకాశిస్తూనే ఉంటుంది. దీనికి కొన్ని ప్రదేశాలలో ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అయోధ్య నుండి వారణాసి వరకు మరియు వారణాసి నుండి రాజస్థాన్ వరకు దీపావళిని భిన్నంగా జరుపుతారు.

అలా దీపావళి యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూడాలనుకుంటే మీరు తప్పకుండా ఒక్క‌సారైనా రాజస్థాన్‌లోని ఈ ప్రదేశాలను సందర్శించాలి. కథనంలో, రాజస్థాన్‌లోని దీపావ‌ళి స‌మ‌యంలో పేరొందిన‌ ప్రదేశాల గురించి తెలుసుకోవ‌చ్చు. ఇక్క‌డి దీపావళి వైభవాన్ని తెలుసుకున్న‌ తర్వాత ఇక్క‌డికి దీపావళి రోజున ఒక్క‌సారైనా వెళ్లాల‌నే నిర్ణ‌యానికి వ‌స్తారు.

పుష్కర్‌

పుష్కర్‌

రాజస్థాన్‌లోని పుష్కర్ నగరం నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రదేశం. దీపావళి రోజున ఈ నగరం యొక్క అందాలను చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు.

దీపావళి సమయంలో నగరపు అందాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్క‌డి పుష్కర్ సరస్సు చుట్టూ దీపాలు వెలిగిస్తారు. వాటిని చూసిన తర్వాత మనస్సు సంతృప్తి చెందుతుంది. పిల్ల‌గాలుల‌కు ఊగిస‌లాడే కృత్రిమ వెలుగుల అందాలు చూప‌రుల మ‌న‌సును క‌ట్టిప‌డేస్తాయి. దీపావళి సందర్భంగా ఇక్కడ ఐదు రోజుల పండుగ కూడా నిర్వహించబడుతుంది. అంతేకాదు, ఒంటెల ప్రదర్శన కూడా జరుగుతుంది. దీపావ‌ళిలో ఇది కూడా ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది.

జైపూర్

జైపూర్

రాజస్థాన్‌లోని జైపూర్ నగరం కూడా దీపావళికి కొన్ని రోజుల ముందు పెళ్లికూతురులా అలంకరించబడుతుంది. ముఖ్యంగా హవామహల్‌ను లైట్లతో అలంకరించిన త‌ర్వాత అక్క‌డి అందాలు మాట‌ల‌కు అంద‌నివిగా ఉంటాయి. క‌నుచూపు మేర వెలుగులు చిమ్మే కాంతుల సుంద‌ర దృశ్యాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల‌నుంచి సంద‌ర్శ‌కులు వ‌స్తూ ఉంటారు. రాజధాని జైపూర్‌లోని ఇతర నగరాలతో పోల్చితే, దీపావళి అత్యంత వైభవంగా ఇక్క‌డ‌ జరుపుతారు. అందుకే ఈ స‌మ‌యంలో పర్యాటకులతో జైపూర్ రద్దీగా ఉంటుంది. ఇక్కడి మార్కెట్‌ను కూడా అందంగా అలంకరిస్తారు. పుష్కర్ లాగానే ఇక్కడ కూడా దీపావళి రోజున పెద్ద‌ జాతర నిర్వహిస్తారు.

జైసల్మేర్

జైసల్మేర్

దీపావళి పండుగను పుష్కర్ మరియు జైపూర్‌లలో వైభవంగా జరుపుతార‌ని మ‌న‌కి తెలుసు. అలాగ‌ని, జైసల్మేర్ ఈ రెండు నగరాల కంటే తక్కువ కాదు. దీపావళి శుభ సందర్భంగా ఈ నగరం మొత్తం పెళ్లికూతురులా ముస్తాబ‌వుతుంది. ఈ అందమైన నగరంలో దాదాపు ప్రతి ఇల్లు మరియు కోటను మట్టి దీపాలు, కృత్రిమ దీపాలు మరియు పూలతో పెళ్లి కూతురులా అలంకరిస్తారు. ఈ సంతోషకరమైన సందర్భంలో ప్రతి వీధి మరియు కూడలిలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. దీపావళి రోజున స్థానిక ప్రజల కొత్త బట్టలతో కూడా అందంగా త‌యార‌వుతారు.

ఈ ప్రదేశాలను కూడా సంద‌ర్శించండి

ఈ ప్రదేశాలను కూడా సంద‌ర్శించండి

జైపూర్, పుష్కర్ మరియు జైసల్మేర్ కాకుండా రాజస్థాన్‌లోని అనేక ఇతర ప్రదేశాలలోనూ దీపావళి ఘ‌నంగా జరుపుకొంటారు. బికనీర్, జోధ్‌పూర్, ఉదయపూర్ మరియు కోటాతో పాటు అన్ని న‌గ‌రాల్లోనూ స‌రికొత్త దీపావ‌ళిని ఆస్వాదించేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకే ప్ర‌త్యేకించి రాజ‌స్థాన్‌ను దీపావ‌ళి పండ‌గ‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా చెబుతారు.

Read more about: rajasthan pushkar jaipur jaisalmer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X