Search
  • Follow NativePlanet
Share
» »విదేశాలకు వెళ్లాలా? ఈ మాత మందిరాన్ని సందర్శించండి

విదేశాలకు వెళ్లాలా? ఈ మాత మందిరాన్ని సందర్శించండి

భారత దేశంలో అనేక ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. ఏ ఆలయంలోనైనా సరే అక్కడ హిందూ పురాణాలకు సంబంధించిన దేవతామూర్తులు కొలువై ఉంటారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా ఒక ఆలయంలో ముస్లీం మహిళను దేవతా మూర్తిగా కొలువుదీర్చి పూజిస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్లాలనుకొనేవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే త్వరగా వారి కోరిక నెరవేరుతుంది స్థానికుల నమ్మకం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం మీ కోసం...

ఎక్కడ ఉంది ఈ ఆలయం

ఎక్కడ ఉంది ఈ ఆలయం

P.C: You tube

ఈ విశేషమైన దేవాలయం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జులాసన్ కుగ్రామంలో ఈ ఆలయయం ఉంది. ఈ ఆలయాన్ని డోలామాత మందిరంగా స్థానికులు పిలుచుకొంటారు.

హిందువుల ధార్మిక కేంద్రం

హిందువుల ధార్మిక కేంద్రం

P.C: You tube

ఈ మందిరంలోని మాతను అనేక ఏళ్ల నుంచి వేలాది మంది హిందూ భక్తులు పూజిస్తూ వస్తున్నారు. వేల సంఖ్యలో తరలి వచ్చే భక్తులు తమ కోర్కెలను నెరవేర్చాల్సిందిగా మాతను వేడుకొంటారు. ఇప్పటికీ నవరాత్రి సందర్భాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

గ్రామ రక్షణ కోసం బలిదానం

గ్రామ రక్షణ కోసం బలిదానం

P.C: You tube

ఈ మందిరానికి సంబంధించి స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. దాదాపు 250 ఏళ్ల కిందట ఈ గ్రామంలో డోలా పేరుతో ఒక ముస్లీం మహిళ ఉండేవారు. ఆమె చాలా పరాక్రమవంతురాలు. పొరుగు ఊరికి చెందిన కొంతమంది ఈ ఊరికి వచ్చి ప్రజలను బాధపెట్టే సమయంలో ఆమె ధైర్యంగా ఎదురు నిలిచారు. తన గ్రామ ప్రజలను కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేశారు.

చివరి నిమిషాల్లో జరిగింది చమత్కారం

చివరి నిమిషాల్లో జరిగింది చమత్కారం

P.C: You tube

ఆమె అలా ప్రాణత్యాగం చేయగానే అమె చివరి ఘడియల్లో ఆమె శరీరం పువ్వులాగా మారడం ప్రారంభమయ్యింది. ఈ వింతను గ్రామ ప్రజలు నమ్మలేక సంబ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయారు. ఆ తర్వాత డోలా త్యాగానికి గుర్తుగా ఈ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ఒక రాతిని ఎల్లప్పుడూ చీరతో కప్పిఉంచుతారు. ఈ రాతికి పూజలు నిర్వహిస్తారు.

విదేశాలకు వెళ్లాలంటే

విదేశాలకు వెళ్లాలంటే

P.C: You tube

డోలామాత మందిరాన్ని డాలర్ మాత మందిరంగా ఇక్కడి ప్రజలు పిలుచుకొంటారు. ఎందుకంటే ఈ గ్రామానికి చెందిన చాలా మంది ప్రజలు అమెరికాలోనే స్థిరపడ్డారు. వీరంతా చిన్న పనుల కోసం అమెరికా వెళ్లి వారి దశ తిరిగి అక్కడే ఉండిపోయినట్లు స్థానికులు చెబుతారు. అందుకే విదేశాలకు వెళ్లాలనుకొనేవారు ఎక్కువగా ఈ గుడిని సందర్శించి తమ కోర్కెను నెరవేర్చమని వేడుకొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X