• Follow NativePlanet
Share
» »బెజవాడ కనకదుర్గమ్మతల్లి ఆలయ రహస్యం !

బెజవాడ కనకదుర్గమ్మతల్లి ఆలయ రహస్యం !

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ నుండి వచ్చింది.

విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. పాండవులు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేదవ్యాసుడు కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య ఘోరమయిన తపస్సు చేసాడు. శివుడు, అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న శివుడు కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు బాణములు ఒకేసారి తగిలి, ఎలుగుబంటి మరణిస్తుంది.

ఫణిగిరి - తెలంగాణ బౌద్ధ క్షేత్రం !

కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !

భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !

ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగము మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి, సాక్షాత్తూ శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు.

ఇది కూడా చదవండి: కనకదుర్గ గుడి, విజయవాడ !!

1. ఇంద్రకీలాద్రి

1. ఇంద్రకీలాద్రి

దక్షిణభారతదేశంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రాలలో ఒకటిగా, అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు కోరిందే తడవుగా వారికోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మతల్లి.

ఇది కూడా చదవండి:నవరాత్రి స్పెషల్: కనకదుర్గమ్మ గుడి, విజయవాడ !

PC:Youtube

2. స్త్రీ శక్తి పీఠాలు

2. స్త్రీ శక్తి పీఠాలు

ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలసిందని పురాణాలు చెబుపుతున్నాయి. అంతేగాక స్త్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. ఒకసారి ఈ ఆలయవిశేషాలను తెలుసుకుందాం. పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేసాడు.

PC:Youtube

3. కృష్ణానదీ తీరం

3. కృష్ణానదీ తీరం

దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడుగగా అమ్మా! నువ్వు ఎప్పుడూ నా హృదయస్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే! కీలా! నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వతరూపుడవై వుండు.

ఎపి లో అత్యంత ఎత్తైన గాలిగోపురం మీకు తెలుసా ??

PC:Youtube

4. అసురసంహారం

4. అసురసంహారం

నేను కృతయుగంలో అసురసంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాలను కబళిస్తున్న మహిషుణ్ణి వధించి కీలుడుకిచ్చిన వరం ప్రకారం మహిశావర్ధిని రూపంలో కీలాద్రిపై వెలసింది.

PC:Youtube

5. కనకవర్ణ శోభితురాలు

5. కనకవర్ణ శోభితురాలు

తదనంతరం ప్రతీరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించటం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై వుండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తర్వాత ఇంద్ర కీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువుంచాలని ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుడ్ని గురించి శతాస్వమేగ యాగం చేసాడు.

కృష్ణా పుష్కరాలు ఎక్కడెక్కడ ? ఎలా ?

PC:Youtube

6. జ్యోతిర్లింగ రూపం

6. జ్యోతిర్లింగ రూపం

దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి,కదంబ పుష్పాలతో పూజించటం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరొచ్చిందని గాధ. మరో గాధ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాసుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పై వుగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించటానికి శివుడు కిరాకుడుగా వచ్చి అర్జునునితో మల్లయుద్ధం చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాసుపతాశ్త్రాన్ని అనుగ్రహించాడు.

PC:Youtube

7. జగద్గురు ఆదిశంకరాచార్యులు

7. జగద్గురు ఆదిశంకరాచార్యులు

స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేసాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా వుండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తరభాగాన మల్లికార్జునిని పునఃప్రతిష్టించారు.

PC:Youtube

8. శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట

8. శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట

మహారౌద్రంగా వున్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేసారు. అప్పట్నుంచీ అమ్మ పరమశాంతస్వరూపిణిగా భక్తులను కనువిందు చేస్తోంది.

PC:Youtube

9. శరన్నవరాత్రులు

9. శరన్నవరాత్రులు

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువైవున్నారు. కనకదుర్గ అమ్మవారికి అతిప్రీతిపాత్రమైనవి శరన్నవరాత్రులు.

విజయవాడ కు 100KM లోపు పర్యాటక ప్రదేశాలు !

PC:Youtube

10. సకల శుభాలు

10. సకల శుభాలు

ఈ రోజుల్లో గనక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ దసర తొమ్మిది రోజులు వివిధరకాల అలంకారాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు.

విజయవాడ - చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు !

PC:Youtube

11. రోడ్డు మార్గం

11. రోడ్డు మార్గం

విజయవాడ నుండి ఇతర ముఖ్య పట్టణాలకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి బస్సులు నడపబడుచున్నవి. వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి.

PC:Youtube

12. వందలాది ప్రైవేటు బస్సులు

12. వందలాది ప్రైవేటు బస్సులు

విజయవాడలోని పండిత నెహ్రూ ప్రయాణ ప్రాంగణము దేశంలో అతి పెద్ద బస్సు స్టాండులలో ఒకటి. నగరం లోపలి ప్రయాణాలకు సిటీ బస్సులు, ఆటోలు, రిక్షాలు ఇంకా ప్రైవేటు వాహనాలు అధికంగా వాడుతారు.

కృష్ణా నది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాలు !!

PC:Youtube

13. రైలు మార్గం

13. రైలు మార్గం

చెన్నై-హౌరా, చెన్నై-ఢిల్లీ రైలు మార్గాల కూడలిగా ఉన్న ఉన్నాయి. విజయవాడ జంక్షన్ దేశంలో అధికంగా రద్దీగా ఉండే రైలు స్టేషనులలో ఒకటి.

PC:Youtube

14. విమానాశ్రయము

14. విమానాశ్రయము

విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) నుండి ఇతర ప్రధాన నగరాలకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై, ముంబై, జైపూర్, వైజాగ్, తిరుపతి మరియు ఢిల్లీ నగరములకు విమాన సౌకర్యము ఉంది.

విజయవాడ ... ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !!

PC:Youtube

15. విమానాశ్రయం

15. విమానాశ్రయం

విజయవాడ విమానాశ్రయం స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ కోస్టా,ట్రూ జెట్ మరియు ఎయిర్ ఇండియా సంస్థల ద్వారా సేవలు అందిస్తుంది.

విజయవాడ వెళ్ళారా ... హాయ్ లాండ్ చూసారా ?

PC:Youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి