Search
  • Follow NativePlanet
Share
» »కనకదుర్గ గుడి, విజయవాడ !!

కనకదుర్గ గుడి, విజయవాడ !!

By Mohammad

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం (మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం). విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది.

హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

దుర్గ గుడి గాలిగోపురం

దుర్గ గుడి గాలిగోపురం

చిత్రకృప : NAGASREENIVASARAO PUPPALA

పేరువెనుక చరిత్ర

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపసు ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు.

అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపసు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

క్షేత్ర పురాణం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

అమ్మవారి విగ్రహం

అమ్మవారి విగ్రహం

చిత్రకృప : Bhaskaranaidu

కనకదుర్గ అమ్మవారి విగ్రహము

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.

నవరాత్రి ఉత్సవాలు

ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు. మొదటి రోజు బాల త్రిపురసుందరి దేవి, రెండవ రోజు గాయత్రి దేవి, మూడవ రోజు అన్నపూర్ణా దేవి, నాలుగవ రోజు లలితా త్రిపురసుందరి దేవి, ఐదవ రోజు సరస్వతి దేవి, ఆరవ రోజు దుర్గాదేవి, ఎడవ రోజు మహాలక్ష్మిదేవి, ఎనిమిదవ రోజు మహిషాసురమర్దినిదేవి, తొమ్మిదవ రోజు రాజరాజేశ్వారిదేవి.

కనకదుర్గ దేవాలయం లోపలి భాగం

కనకదుర్గ దేవాలయం లోపలి భాగం

చిత్రకృప : Sridhar1000

ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా ములానక్షత్రం గా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు,విద్యార్దులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు,శ్రీరాముల వారు కొలువుతీరి వున్నారు. ఈ దేవాలయంను దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాలు నుండి వస్తారు.

ఇది కూడా చదవండి : ఉండవల్లి గుహలు, గుంటూరు జిల్లా !!

ఆలయ సందర్శన వేళలు : ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 5: 30 వరకు మరియు తిరిగి సాయంత్రం 6:15 నుండి రాత్రి 10:00 గంటల వరకు గుడిని సందర్శించవచ్చు. అంతరాలయం దర్శనానికి ఒక్కొక్కరు 300 రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాలి.

మల్లేశ్వర స్వామి టెంపుల్ దర్శన వేళలు : 4:00 am - 6:30 pm & 6:15 pm - 10:00 pm (ఉచిత దర్శనం).

ఇంద్రకీలాద్రి పర్వతం, ప్రకాశం బ్యారేజ్

ఇంద్రకీలాద్రి పర్వతం, ప్రకాశం బ్యారేజ్

చిత్రకృప : Sarath Kuchi

ఎలా చేరుకోవాలి ?

కొండపైకి చేరుకోవటానికి దేవస్థానం బస్సులు ఉన్నాయి. సిటీ బస్సులు కూడా కొండపైకి వెళుతుంటాయి. విజయవాడ చేరుకోవడం ఎలా ?

ఇది కూడా చదవండి : హాయ్ లాండ్, విజయవాడ !!

విజయవాడ నుండి ఇతర ప్రాంతాలకు దూరం : హైదరాబాద్ - 283 km, బెంగళూరు- 512 km, గుంటూరు -40 km, వైజాగ్ - 347 km, రాజమండ్రి - 157 km, తిరుపతి - 413 km, శ్రీశైలం - 263 km, చెన్నై - 387 km.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X