• Follow NativePlanet
Share
» »మీ పిల్లలు చదువులో టాప్ కావాలంటే ఈ టెంపుల్ కి వెళ్ళండి

మీ పిల్లలు చదువులో టాప్ కావాలంటే ఈ టెంపుల్ కి వెళ్ళండి

తల్లిదండ్రులకు తమ పిల్లలు విద్యావంతులు అని చెప్పుకోవటానికి గర్వపడతారు. అందరిముందూ తమ బిడ్డ చాలా చురుకు, తీక్షణ బుద్ధికలవాడు అని చెప్తున్నప్పుడు ఏదో ఒకవిధమైన సంతోషం. అదే తమ బిడ్డ ఏమీ చదవడు అని తల్లిదండ్రులు బాధపడటం కూడా జరుగుతుంది.

చదువు బాగా రావాలంటే ముఖ్యంగా ఆ చదువుల తల్లి సరస్వతి యొక్క ఆశీర్వాదం ఉండాలి. కొంతమంది పిల్లలు పుస్తకం మీద దృష్టి పెట్టరు. వారికి ఎంత చదివినా విద్య మాత్రం రాదు. అలాంటివారికి ఈ వ్యాసం మూలంగా తెలపబోయే దేవాలయానికి పిల్లలతో ఒక్క సారి వెళ్లి రండి. ఈ సరస్వతీ దేవాలయంలో పౌర్ణమి రాత్రులలో పిల్లలకు "ఓం" అనే పదాన్ని నాలిక మీద రాస్తారు. ఈవిధంగా రాయించుకున్న పిల్లలు ఏమవుతారో తలుసా?

ప్రస్తుత వ్యాసంలో విద్యను ప్రసాదించే ఆ మహిమాన్విత దేవాలయానికి ఒక్కసారి దర్శించుకుని వద్దాము.

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

విద్యను వరంగా ఇచ్చే ఈ దేవాలయం వుండేది తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలోని కూతనూర్ లో. ఇక్కడ చదువుల తల్లి సరస్వతీ అమ్మవారు వెలసియున్నది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే తమిళనాడులో సరస్వతీ దేవాలయం వుండేది ఇదొక్కటే.

1000 సంల చరిత్ర

1000 సంల చరిత్ర

ఈ దేవాలయం అత్యంత మహిమాన్వితమైన దేవాలయం. ఈ దేవాలయం ఒక పురాతనమైన దేవాలయం. సుమారు 500 లేదా 1000 సంల చరిత్ర కలిగివుంది అని చెప్తారు.

దసరా పండగ ఉత్సవాలు

దసరా పండగ ఉత్సవాలు

ఈ పురాతన దేవాలయాన్ని నిర్మించినది చోళులు. ఈ దేవాలయం అత్యంత అందమైన దేవాలయం. అనేక విశేషాలను కలిగివున్నది. దసరా పండగ సంబరాలు కనుక ఉత్సవాలను ఇక్కడ ఆచరిస్తారు.

సరస్వతీదేవికి సంబంధించిన దేవాలయాలు

సరస్వతీదేవికి సంబంధించిన దేవాలయాలు

సరస్వతీదేవికి సంబంధించిన దేవాలయాలు భారతదేశంలో అపురూపంగా కనిపిస్తాయి. ఇతర దేవాలయాలలో వేరే దేవతలతో పాటు వెలసివుండవచ్చును. అయితే సరస్వతీదేవి ఆలయాలు చాలాతక్కువగా వున్నాయి.

ఒక పురాణకథ

ఒక పురాణకథ

ఒక పురాణ కథ కూడా వున్నది. అదేమిటంటే బ్రహ్మతో ఘర్షణ పడిన సరస్వతీ దేవి భూలోకంలో నివాసముంటుంది. తదనంతరం బ్రహ్మ మరియు సరస్వతి ఇద్దరూ విముక్తి కోసం మహాశివుడిని పూజిస్తారు. తదనంతరం సరస్వతిదేవి విద్యామాతగా ఇక్కడ వెలుస్తుంది.

పురాణం ప్రకారం

పురాణం ప్రకారం

పురాణం ప్రకారం వేరే కథ వుంది. అది రెండవ రాజరాజ చోళుని ఆస్థానపండితుడు ఒట్టక్కూత్తన్ కూతనూర్ అనే గ్రామానికి విచ్చేస్తారు. ఇక్కడ సరస్వతీ దేవాలయాన్ని నిర్మించటం జరుతుంది. ఇది తమిళనాడులోని ఏకైక సరస్వతీదేవాలయం.

విద్య మీద ఆసక్తి

విద్య మీద ఆసక్తి

అందువల్ల ఈ దేవాలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఇక్కడ తల్లితండ్రులు తమ పిల్లల విద్యకోసం విశేషంగా ప్రార్థనలు చేస్తారు. ఈ విధంగా చేయటం వలన పిల్లలకు విద్య మీద ఆసక్తి పెరుగుతుంది.

తెల్ల తామర మీద కూర్చునియున్న సరస్వతీదేవి

తెల్ల తామర మీద కూర్చునియున్న సరస్వతీదేవి

ఇక్కడ వున్న సరస్వతీదేవి పద్మాసనంలో తెల్ల తామర మీద కూర్చుని, ఎడమ చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని, కుడి చేతిలో వీణ, కరుణను కురిపిస్తున్న కనులతో మరియు జ్ఞానాన్ని
ప్రసాదిస్తూ మూడవ కన్నుతో దర్శనభాగ్యాన్ని కలిగిస్తుంది.

ఒట్టకూత్తర్

ఒట్టకూత్తర్

కూతనూర్ తమిళనాడులోని దేవాలయాలలో హృదయభాగంలో వుంది. పూందోట్టం అనే ఒక చిన్నగ్రామంలో వుంది. ఈ గ్రామంలో సరస్వతిదేవాలయానికి విశేషంగా ప్రసిద్ధ తమిళకని ఒట్టకూత్తర్ వల్ల కూడా పేరుప్రఖ్యాతిగాంచినది.

 పౌర్ణమి రాత్రులలో

పౌర్ణమి రాత్రులలో

పౌర్ణమి రాత్రులలో పిల్లలకు ఇక్కడ "ఓం" అనే పదాన్ని నాలిక మీద రాయటం జరుగుతుంది. ఓం అనే పదాన్ని నెయ్యి కలిపిన తేనెతో రాయటంజరుగుతుంది. ఈవిధంగా రాయించుకున్న పిల్లలు సున్నితంగా మాట్లాడేవారు, కవులు మరియు సంగీతకారులు అవుతారని నమ్ముతారు.

దేవాలయం తెరచు వేళలు

దేవాలయం తెరచు వేళలు

ఈ దేవాలయం ఉదయం 9:30 నుండి రాత్రి 8:30 వరకు తెరిచివుంచుతారు. ఈ దేవాలయంలో వలంపురి వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, స్వాన్ మరియు నర్తాన్ వినాయకుడు (స్వయం భూ) దేవతా మూర్తులు కలవు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

పూంతోట్టం నాగపట్టణం జిల్లాలో తిరువరూర్ వెళ్ళే దారిలో మైలాడుతురై నగరం నుంచి సుమారు 22 కి.మీ ల దూరంలో వుంది. ఇక్కడి నుంచి కేవలం 5నిమిషాలలో కాలినడక ద్వారా వెళ్ళవచ్చును. తిరువూరి నుంచి మైలాడుత్తురై ప్రయాణికులు రోడ్డుమార్గం ద్వారా కేవలం 25 కి.మీ దూరం ప్రయాణించాలి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి