Search
  • Follow NativePlanet
Share
» »మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

By Venkatakarunasri

హైందవధర్మాన్ని పాఠించే మనభారతదేశంలో ఎన్నో దేవాలయాలు ప్రతినిత్యం దైవారాధనలతో విలసిల్లుతూవుంటాయి.ప్రతి నిత్యం భక్తులపూజారాధనలతో,భక్తులతో మారుమ్రోగుతూవుంటాయి.

అయితే వీటిలో అత్యంతప్రసిద్ధిచెందిన కొన్ని దేవాలయాలకు సంబంధించిన కొన్ని రహస్యాలుమాత్రం ఇప్పటికీమిస్టరీగానే వున్నాయి. మరిమిస్టరీవీడని ఆ దేవాలయాలు మన భారతదేశంలో ఎక్కడ వున్నాయి?

అసలు ఆ దేవాలయాలయొక్క చరిత్ర,అలాగే వాటి వెనుక దాగినమిస్టరి ఏంటి అనే విషయాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

బృహదీశ్వరాలయం,తంజావూరు

బృహదీశ్వరాలయం తమిళనాడులోని తంజావూరులో నిర్మించబడ్డది. దీనిని 11వ శతాబ్దంలో చోళులునిర్మించారు. ఇది ఆ పరమేశ్వరునిపూజలు అందుకునే శివాలయం.భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా బృహదీశ్వరాలయానికి పేరువుంది.ఈ ఆలయానికి లక్ష30టన్నుల గ్రానైట్ రాయితో నిర్మించటంజరిగింది.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

సుమారు 66లీ ఎత్తులోవున్న ఈ గ్రానైట్ నిర్మాణం చివరిలో ఒక కుంభంవుంటుంది. అంటే రౌండ్ గా చెక్కబడిన శిలానిర్మాణంవుంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటిఅంటే ఆ కుంభం మొత్తం 80టన్నులబరువువున్న ఒకే గ్రానైట్ రాతితో నిర్మించటంవిశేషం.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

అయితే మరి అంతటి భారీనిర్మాణాన్ని టెంపుల్ టవర్ చివరన 66మీ ల ఎత్తులో ఎలా పైకెత్తిపెట్టగలిగారా?అనేది ఇప్పటికీ మిస్టరీగానే వుంది. ఎందుకంటే 11వ శతాబ్దపు ఆ రోజుల్లో క్రేన్లు కాని మిషన్లుకానీ ఏమి లేవుమరి అంత ఎత్తున ఎలా పెట్టగలిగారు ఇప్పటికీ వీడని మిస్టరీనే.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

వీరభద్రస్వామి ఆలయం, లేపాక్షి

విజయనగరసామ్రాజ్యంలో 16వ శతాబ్దంలో నిర్మించబడింది వీరభద్రస్వామి ఆలయం.ఈ ఆలయం అనంతపురంజిల్లాలేపాక్షిలో కేంద్రీకృతమైవుంది. ఇక్కడ మొదటివిశేషం ఏంటిఅంటే ఆలయంయొక్క వుపరితలభాగంక్రింద 70పిల్లర్లతో నిర్మించబడివుంటుంది.అలాగే ఈ ఆలయం అపురూపశిల్పకళకు నెలవు అని చెప్పవచ్చు.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

ఆలయంలోని మండపాలు శిల్పకళానైపుణ్యంతో భక్తులనుఆకర్షిస్తూ పర్యాటకంగా పెరుగాంచాయి. అయితే ఇక్కడి మిస్టరీ ఏంటి అంటే ఇక్కడ దేవాలయంయొక్క ప్రధాన భాగంలోని ఒక చివరనవున్న పిల్లర్ లలో ఒక పిల్లర్ గాలిలో తేలుతూవుంటుంది. వినటానికే విచిత్రంగా అనిపించినా అది నిజం.ఆ పిల్లర్ కు అలాగే క్రిందభాగానికి మధ్య కొద్దిగా గ్యాప్ వుంటుంది.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

అసలు బేస్మెంట్ లాగా వున్న పిల్లర్ క్రిందభాగంగాల్లో వుండటంఏంటి అనేది చాలామందికి అర్ధంకాని మిస్టరీ.అయితే మన దేశంతోపాటు చాలామంది విదేశీశాస్త్రవేత్తలు దీనికి కారణం కనుగొనేందుకు ప్రయత్నించారు.అయితే విఫలమయ్యారు

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

అలాగే ఇంకో విచిత్రంఏంటి అంటే ఆలయంప్రాంతంలోనే ఒకరాయి మీద పాదముద్ర వుంటుంది. అది సుమారు 3అడుగులువుంటుంది.అయితేఆలయం నిర్మాణం సమయంలో ఈ పాదముద్రలేదు. మరి ఆ తరువాత సుమారు 3అడుగులపాదముద్ర ఆ రాతిమీద ఎలా ఏర్పడిందిఅనేది మరో మిస్టరీ.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

అనంతపద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం

శ్రీమహావిష్ణువు ఆలయాలలో ఒకటి.కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని అనంతపద్మనాభస్వామి ఆలయం. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడునిర్మించారు అనే దానిపై ఎవ్వరికి స్పష్టతలేకపోవటం ఆశ్చర్యంకలిగించేవిషయం.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

రాజకుటుంబీకులలో చివరిరాజు వితీర్తిరునాల్,బలరామవర్మన్ అప్పటిప్రభుత్వం రాజప్రముఖగా ప్రకటించటంతో ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయనిర్వహణట్రస్టీలుగాకొనసాగుతున్నారు.ప్రపంచ దేవాలయాలలో అత్యంతధనిక దేవాలయం అనంతపద్మనాభస్వామి ఆలయం.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

ఇక్కడి ఆలయంలోని ప్రధాన 8గదులలో ఐదింటిని ఓపన్ చేయగా కొన్నివేల కోట్ల రూపాయల విలువ చేసే బంగారువిలువచేసేవజ్రవైడూర్యాలు,దేవుళ్ళవిగ్రహాలు దాంతో అప్పటివరకూ అత్యంతఆదాయంకలిగిన తిరుమల తిరుపతిదేవస్థానాన్ని వెనక్కునెట్టి నెం1స్థానాన్ని చేజేక్కించుకుంది. ఇక్కడ మరొక విచిత్రంఏంటిఅంటే

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

ఆరవగదిని ఓపెన్ చేయటం ఎవ్వరివలనా కావడం లేదు. ఆరవగది మిస్టరీగా మారింది. అన్నిటికీ మించి ఈ ఆరవగదిలో చాలా బంగారం వుండేవుంటుందని అనుకుంటున్నారు. కాని ఆగది తలుపులపై చెక్కబడిన సర్పఆకృతులు అలాగే ఆ గదిలోకి ప్రవేశంనిషిద్దం.అని తెలపటంవలన ఆ గదిని తెరవలేకపోతున్నారు.అసలు ఆ గదిలో ఏముంది అనేది అంతుచిక్కని మిస్టరీగా మారనుంది.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

ఆనాడు పాలించిన ఆ రాజులు ఆ గదిలో బంగారుసంపదను దాచివుండేవుంటారని కొందరంటేమరి కొందరేమో ఆ గది ప్రాణభయంగా భావిస్తున్నారు. మరి ఇంతకూ ఆ గదిఅసలు నిజం ఎవ్వరికీ తెలీకుండా వీడని మిస్టరీగామారింది.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

కైలాసటెంపుల్, ఎల్లోరాగుహ

ఈ ఆలయనిర్మాణమే ఒక మిస్టరీ.ఈ ఆలయం మహారాష్ట్రలోని ఎల్లోరాగుహలో సుమారు 8వ శతాబ్దంలో నిర్మించబడినట్లుశిలాశాసనాలఆధారంగా తెలుస్తోంది ఇది ప్రధానంగా ఆ కైలాసనాథఆలయంఅయితే ఈ ఆలయంలో ఆశ్చర్యం కలిగించే విషయంఏంటంటే ఇది ఒక కొండరాతిని చీల్చుతూ ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

ఆలయం నిర్మాణంఒకే రాయితే జరిపారు అంటే సుమారు 4లక్షలటన్నుల బరువువుండే రాతిని ఈ దేవాలయనిర్మాణానికి వాడారు.మరి ఇంతపెద్ద నిర్మాణంఎటువంటి మిషన్లు లేని కాలంలో కేవలం సుత్తెలు,వులివంటి వస్తువులతో ఎన్ని రోజులు కష్టపడి పూర్తిచేసారోఅనేది ఇప్పటికి ఎవ్వరికి అర్ధంకాని మిస్టరి.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

అయితే ఆలయనిర్మాణం మొట్టమొదట పైభాగంలోచేపట్టి ప్రతీవిషయాన్ని స్పష్టంగా చెక్కటంఎలా సాధ్యంఅయింది అనేది మరోమిస్టరీగా వుంది.అక్కడ ఎల్లోరాశిల్పకళను చూస్తేఎవ్వరికైనా మతిపోవల్సిందే

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

కోణార్క్ సూర్యదేవాలయం, కోణార్క్

ఈ దేవాలయం ఒడిస్సాలోని కోణార్క్ ప్రాంతంలో సుమారు 13వ శతాబ్దంలో నిర్మించబడినట్లు తెలుస్తుంది.గంగవంశానికి చెందిన నరసింహదేవాఈ ఆలయాన్ని నిర్మించాడు.కోణార్క్ దేవాలయంఎత్తు 230అడుగులు.ఆలయం 24రధచక్రాలు, 7గుర్రాలతో చేయబడ్డాయి.

PC:youtube

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

మిస్టరీగా మారిన ఇండియాలోని 5 ప్రదేశాలు

ఒక రథం ఆలయాన్ని మోస్తున్నట్టు వుంటుందన్నమాట. ఇక్కడ మిస్టరీ ఏంటి అంటే ఆలయంలో కనిపించే రథచక్రాలు సమయాన్ని చూపిస్తూవుంటాయి. ఒక గడియారంలాగా పని చేస్తూ మనకు సన్ డయల్స్ లాగా కనిపిస్తూ వుంటుంది.అలాగే కనిపించే సూర్యభగవానుడియొక్క 3విగ్రహాలు సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని సూచిస్తూ వుంటాయి. అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందీఅనేది ఇప్పటికీ మిస్టరీనే.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more