Search
  • Follow NativePlanet
Share
» »సానాసర్ - సుందర దృశ్యభరిత ప్రదేశం !

సానాసర్ - సుందర దృశ్యభరిత ప్రదేశం !

By Mohammad

సానాసర్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అత్యంత అందమైన మరియు సుందర దృశ్య భరిత ప్రదేశంగా భావిస్తారు. ఈ ప్రదేశం చూడటానికి కప్పు ఆకారం వలె అగుపిస్తుంది. పట్నితోప్ కి 20 కి.మీ ల పశ్చిమాన ఉన్న సానా మరియు సార్ అనే రెండు చిన్న సరస్సులు వల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది.

"చిన్నిగుల్మార్గ్" గా ప్రసిద్ధి చెందిన సానాసర్, సముద్ర మట్టానికి 2079 మీటర్ల ఎత్తులో ఉంది. మైదానాలు మరియు పర్వత భూభాగం ఉండటం వల్ల సానాసార్ స్కీయింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్, గుర్రపు స్వారి, రాతి అధిరోహణ, పర్వతారోహణలకు ఆదర్శవంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. సానాసార్ లోని అన్ని సాహస కార్యకలాపాలను జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి : మంత్ర ముగ్ధులను చేసే పహల్గాం పర్యటన !

మీరు ఇక్కడ సాహస క్రీడలను ఆడటానికే సమయం సరిపోదు. అయినా, ఒకవేళ టైం దొరికితే చేరువలో ఉన్న నాగ్ ఆలయం, జలపాతాలు, నదులు చూడవచ్చు. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు ఒకేసారి గమనిస్తే ...

శంకర్ పాల్ ఆలయం

శంకర్ పాల్ ఆలయం

సముద్రమట్టానికి 2800 మీటర్ల ఎత్తున పర్వత పంక్తి పై శంకర్ పాల్ ఆలయం కలదు. ఇక్కడికి చేరుకోవటానికి అటు ఇటు 5 గంటల సమయం పట్టవచ్చు. ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. ఆలయ ప్రధాన దేవత నాగ్ శంక్ పాల్. సున్నం లేకుండా నిర్మించటం ఈ ఆలయ ప్రత్యేకత.

చిత్ర కృప : Bharat Singh Bhadwal

లాడూ లాడి

లాడూ లాడి

లాడూ లాడి అంటే 'అబ్బాయి అమ్మాయి' అని అర్థం. ఇదొక పర్వత శిఖరం పేరు. పర్వతారోహణ మార్గం ద్వారా పర్యాటకులు ప్రసిద్ధి చెందిన మధ్య తోప్ నుండి ప్రారంభమయ్యే 4 కి. మీ ల పొడవైన దారి గుండా ఇక్కడికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : sandeepachetan.com travel photography

శాంతా గాలా శిఖరం

శాంతా గాలా శిఖరం

శాంతా శిఖరం పై న ఉన్న శాంతా గాలా, పంచారి లోయ యొక్క విస్తృత దృశ్యం గల కనుమ. శాంతా గాలా కనుమ లాండర్ ప్రదేశానికి దారితీస్తుంది. మీరు ఇక్కడికి చేరుకోవటానికి 5 గంటల సమయం పడుతుంది.

చిత్ర కృప : Mohd Junaid Ali

సుర్ని కుండ్

సుర్ని కుండ్

సుర్ని కుండ్ అనేది ఒక చెరువు పేరు. ఇది శంకర్ పాల్ ఆలయానికి 2 కి.మీ ల దూరంలో, శంకర్ పాల్ పర్వత పంక్తి పై కలదు. సానాసార్ నుండి కష్టతరమైన పర్వతారోహణ మార్గం గుండా సుర్ని కుండ్ చేరుకోవటానికి 7 గంటల సమయం పట్టవచ్చు.

చిత్ర కృప : Jammu Redefining

పర్వతారోహణ

పర్వతారోహణ

పర్వతారోహణకు సానాసార్ అనువైన ప్రదేశం. ప్రయాణ సమయంలో యాత్రికులు, జమ్మూ కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సంస్థ (జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్- జె.కె.టి.డి.సి) నుండి పర్వతారోహణ కరపత్రం తీసుకోవాలి. పర్యాటకులు ఎంపిక చేసుకున్న మార్గా లను బట్టి, పర్వతారోహణకు 3 గంటల నుంచి 7 గంటల సమయం పట్టవచ్చు.

చిత్ర కృప : Extremehimalayan

పర్వతారోహణ

పర్వతారోహణ

ఒకవేళ యాత్రికులు అలిసిపోయినట్టు భావిస్తే, సహాయకుడు వద్ద అందుబాటులో ఉన్న గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. అవసరమైన పర్వతారోహణ పరికరాలు పర్యాటక శాఖ వారి దుకాణాలు అందిస్తాయి. ఈ దుకాణాలలో డబ్బు కట్టి పర్యాటకులు పర్వతారోహణ పరికరాలు అద్దెకు తీసుకోవచ్చు.

చిత్ర కృప : Extremehimalayan

సానాసర్ ఎలా చేరుకోవాలి ?

సానాసర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం : జమ్మూ నుండి మరియు సమీప ప్రాంతాల నుండి సానాసార్ కు పలు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

రైలు మార్గం : జమ్మూ తావీ సమీప రైల్వే స్టేషన్. ఇది 125 కిలోమీటర్ల దూరంలో కలదు. సానాసర్ చేరుకోవటానికి పర్యాటకులు స్టేషన్ బయట బస్సులు, టాక్సీ లలో ప్రయాణించవచ్చు.

విమాన మార్గం : జమ్మూ విమానాశ్రయం సానాసర్ 122 km ల దూరంలో కలదు. ఢిల్లీ, ముంబై, చండీఘర్, జైపూర్ నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో సానాసార్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : 10 Year Itch (Madhu Nair)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X