Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ వినాయకుడి వాహనం మూషికం కాదు?

ఇక్కడ వినాయకుడి వాహనం మూషికం కాదు?

మోర్గాన్ గణేష దేవాలయాన్ని మయూరేశ్వర్ మందిర్ అని కూడా అంటారు. ఈ దేవాలయం చరిత్రను తెలుసుకోండి

వినాయకుడి వాహనం ఏమిటంటే చాలా మంది ఎలుక అని చెబుతారు. అందుకే వినాయకుడిని మూషిక వాహన అని పిలుస్తారు. అయితే దేశంలో ఒకేఒక చోట ఆయన తన సోదరుడైన కుమారస్వామి వాహనం నెమలిని వినియోగించాడు. ఆ మయూర వాహనం ఎక్కి ప్రజలను హింసిస్తున్న ఓ రాక్షసుడిని సంహరించాడు. అక్కడే ఆయకు బ్రహ్మ దేవాలయాన్ని కూడా కట్టించి ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఆ క్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం...

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

మోర్గావ్ గణేష దేవాలయాన్ని శ్రీ మమూరేశ్వర్ దేవాలయం అని కూడా పిలుస్తారు. మోర్గావ్ లో ఉన్న ఈ దేవాలయం పూనే నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అష్టగణపతి యాత్ర ఈ దేవాలయంతోనే మొదలయ్యి ఈ దేవాలయంతోనే ముగుస్తుంది.

 మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారన్న విషయానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు మాత్రం దొరకడం లేదు. స్థలపురాణం ప్రకారం సింధూ అనే రాక్షసుడు బ్రహ్మగురించి తపస్సు చేసి అత్యంత బలసంపన్నుడిగా మారుతాడు.

 మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

అమ`త బిందువులు పడిన ఓ పర్వతాన్ని అమాంతం మింగి చావులేకుండా వరం పొందుతాడు. అయితే ఒక్క బాణంతో సింధూ రాక్షసుడిని చీల్చి అతని శరీరం నుంచి ఆ పర్వతాన్ని బయటికి తీస్తారో అప్పుడే అతనికి చావు.

 మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

ఈ నేపథ్యంలో బ్రహ్మ నుంచి పొందిన వరం వల్ల ఈ ఆ రాక్షసుడు ప్రజలందరినీ హింసిస్తూ ఉంటాడు. దీంతో ప్రజలు, మునులు ఆ వినాయకుడిని వేడుకొంటారు. దీంతో వినాయకుడు తన సోదరుడైన కుమారస్వామి వాహనమైన నెమలిని ఎక్కి ఆ సింధూ రాక్షసుడితో యుద్ధానికి తలపడుతాడు.

 మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

వినాయకుడికి ఉన్న అతీత శక్తులతో ఒకే బాణంతో ఆరాక్షసుడి శరీరాన్ని రెండుగా ఖండించి శరీరంలోపల ఉన్న పర్వతాన్ని బయటికి లాగేస్తాడు. అటు పై తిరిగి మమూర వాహనాన్ని తన సోదరుడైన కుమారేశ్వరుడికి అప్పగిస్తాడు.

 మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

కాగా, బ్రహ్మ ఇక్కడ వినాయకుడికి గుడి కట్టించడమే కాకుండా సిద్ధి, బుద్ధిని ఇచ్చి వివాహం చేసినట్లు కూడా చెబుతారు. మయూర వాహనంలో వచ్చి ఇక్కడ యుద్ధం చేయడం వల్ల ఈ స్వామిని మయూరేశ్వర అని అంటారని చెబుతారు.

 మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

ఈ దేవాలయంలో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉండటం గమనార్హం. ఇవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకలని చెబుతారు. అంతేకాకుండా నాలుగు ద్వారాలు నాలుగు దిక్కులకు ప్రతీకలు. ప్రతి ద్వారం పై భాగంలో మనకు వినాయకుడు దర్శనమిస్తాడు.

 మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

తూర్పు దిక్కులో ఉన్న వినాయకుడిని బళ్లాల్ వినాయకుడని పిలుస్తారు. పశ్చిమ దిక్కులో ఉన్న గణపతిని చింతామణి అని పిలుస్తారు. ఉత్తర దిక్కులో ఉన్న వినాయకుడిని మహాగణపతి అని, దక్షిణ దిక్కులో ఉన్న గణపతిని విఘ్నేశ్వర అని పిలుస్తారు.

 మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

మోర్గావ్ గణేష దేవాలయం, పూనే

P.C: You Tube

వినాయక చవితితో పాటు గణేశ జయంతిని కూడా ఇక్కడ ప్రధానంగా జరుపుకొంటారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకొంటూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X