Search
  • Follow NativePlanet
Share
» »ఒకప్పుడు ఇంద్రపురి అని పిలవబడిన నిజామాబాద్ లోని పర్యాటక స్థలాలు

ఒకప్పుడు ఇంద్రపురి అని పిలవబడిన నిజామాబాద్ లోని పర్యాటక స్థలాలు

By Venkata Karunasri Nalluru

నిజామాబాద్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. నిజామాబాద్ ను 8వ శతాబ్దములో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడు అనే రాజు పరిపాలించాడు. అందువల్ల ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చింది. ఇందూరుకు కన్నా ముందు ఇంద్రపురి అని పిలిచేవారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద 10వ పట్టణం. నిజామాబాద్ హైదరాబాద్ - ముంబై లైన్ లో ఒక ప్రసిద్ధ రైలు స్టేషన్ కావటం వలన ఆ పేరును నిజామాబాద్ గా మార్చారు. ఉల్ ముల్క్ నిజాం పాలనలో నిజామాబాద్ ఒక స్వర్ణయుగంగా పిలిచేవారు. ఉల్ ముల్క్ ఒక గొప్ప కళాకారుడు. ఇతను అనేక హిందూ దేవాలయాలు, మసీదులను నిర్మించాడు. ఈ జిల్లాలో అనేక పట్టణాలు, మరియు గ్రామాలు కలవు. వాటిలో ఆర్మూరు, బోధన, బాన్స్వాడ, కామారెడ్డి వంటివి పేరు పడిన ప్రదేశాలు. బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కలదు. ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే పెద్దది. నిజామాబాద్ సంస్కృతి చాలా గొప్పది. నీలకంఠేశ్వర పండుగ, రెండురోజుల పాటు జనవరి లేదా ఫిబ్రవరిలలో చేస్తారు.

నిజామాబాద్ ప్రఖ్యాత గాంచిన పర్యాటక ప్రదేశం. ఇక్కడ వేసవికాలంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి నెలలు చూచుటకు అనుకూలం. నిజామాబాద్ దేశంలోని ఇతర విభాగాలకు రోడ్ మరియు రైలు మార్గాలు కలుపబడి వుంది. ప్రభుత్వ బస్సులు , ప్రైవేటు టాక్సీలు పర్యాటకులకు అనుకూలంగా నడపబడుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ మరియు చెన్నై లకు రైలు మార్గం కలదు. వుంది. సుమారు 200 కి. మీ. ల దూరంలోని హైదరాబాద్ లో విమానాశ్రయం కలదు.

ఆర్కేయోలాజికల్ మరియు హెరిటేజ్ మ్యూజియం

ఆర్కేయోలాజికల్ మరియు హెరిటేజ్ మ్యూజియం

కోతి నుండి మానవుడు పుట్టాడు అంటారు. నిజంగా ఆ అభివృద్ది ఎలా జరిగిందనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ వుంటుంది. కాబట్టి పర్యాటకులు ఈ మ్యూజియాన్ని తప్పకుండా చూడాలి. ఈ మ్యూజియం 2001లో స్థాపించారు. దీనిలో మూడు విభాగాలు వుంటాయి. ఆర్కేయోలాజికాల్, స్కల్ప్చురాల్ గేలరీ మరియు బ్రాంజ్ గేలరీ లుగా వుంటాయి.

ఇందులోని ప్రతి విభాగం పురాతన నుండి అధునాతనకు తోడ్పడిన అంశాలను తెలుపుతుంది. ఇక్కడ క్రీ. పూ. 50000 నుండి 5000 వరకు మానవుడు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర వస్తువులు చూడవచ్చును. క్రీ. పూ. 1000 సంవత్సరాలు మరియు క్రీ. శ. 3వ శతాబ్దం నాటి వస్తువులను కూడా చూడవచ్చును. వివిధ పాలనలలోని నాణేల సేకరణ కూడా చూడవచ్చు. వీటిలో శాతవాహన, కాకతీయ, మరియు కుతుబ్ షాహీ, ఇక్ష్వాకులు కాలం నాటివి వున్నాయి.

PC: youtube

దోమకొండ కోట

దోమకొండ కోట

దోమకొండ అనే గ్రామంలో ఈ దోమకొండ కోట వుంది. ఈ కోట నిజామాబాద్ పట్టణానికి 38 కి.మీ.ల దూరంలో మరియు హైదరాబాద్ కు సుమారు 98 కి. మీ.ల దూరంలో వుంది. ఈ కోట తెలంగాణాలోని నిజామాబాద్ లో ప్రసిద్ధి చెందిన కోట. ఈ కోటను కామినేని వంశానికి చెందిన రాజులు సుమారు 400 సంవత్సరాల కిందట నిర్మించారు. కోట యొక్క వెలుపల వైపు కాకతీయ రాజులు కట్టించిన అందమైన శివాలయం వుంది.

ఈనాడు ఈ కోట శిధిలావస్తలో వుంది. అయినప్పటికీ ఆ కాలం నాటి అద్భుత శిల్ప వైభవం చూడవచ్చును. కోట చూచుటకు అందంగా వుంటుంది. ఈ కోట నిర్మాణ శైలిలో మనకు హిందూ మరియు ముస్లిం శిల్ప శైలికి చెందిన వైభవం ఉండటం విశేషం.

PC : Sumanth Garakarajula

నిజాం సాగర్ డాం

నిజాం సాగర్ డాం

నిజామాబాద్ జిల్లాలో వున్న నిజాం సాగర్ డ్యాం మంజీరా నదిపై వున్నది. గోదావరి నది ఉప నదులలో మంజీరా ఒకటి. ఈ డ్యాం హైదరాబాద్ కు వాయువ్యంగా వుంటుంది. సుమారు 145 కి. మీ.ల దూరంలో అచ్చంపేట్ మరియు బంజపల్లెల మధ్య కలదు. రెండు పట్టణాల మధ్యగా సుమారు 3 కి. మీ. ల పొడవున నిజాం సాగర్ డాం నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు దీనిని నిర్మించారు. నేడు ఈ డ్యాం దాని పై గల 14 అడుగుల వెడల్పు ట్రాఫిక్ రోడ్ తో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. రోడ్ నుండి అందమైన ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు.

PC: official website

శ్రీ రఘునాథ దేవాలయం

శ్రీ రఘునాథ దేవాలయం

ఈ దేవాలయం స్థానిక హిందువులకు ప్రసిద్ధి గాంచినది. ఈ దేవాలయం అన్ని రోజులలో తెరచి వుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయంకు తరలివస్తారు ఈ దేవాలయంలో మూల దైవం శ్రీరాముడు, సీతా దేవి మరియు లక్ష్మణుడు. లక్ష్మణుడు అరణ్యవాసం సమయంలో రావణుడిని వధించటంలో శ్రీరాముడుకి సహాయం చేసినందువలన ఆయనను కూడా పూజిస్తారని చెపుతారు. సీతారాముల పరమ భక్తుడైన హనుమంతుడి విగ్రహానికి కూడా ఇక్కడ పూజలు చేస్తారు.

PC: youtube

సారంగాపురం హనుమంతుని దేవాలయం

సారంగాపురం హనుమంతుని దేవాలయం

ఈ దేవస్థానం నిజామాబాద్ కు సమీపంలో కల సారంగపురం అనే గ్రామంలో కలదు. ఇది దేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. కనుక భక్తులు చాలామంది వస్తారు. ఒకే రాతిలో హనుమంతుడి విగ్రహాన్ని మలచారు. ఈ దేవస్థానంను సుమారు 425 సంవత్సరాల కిందట సమర్ధ రామదాస్ మహర్షి దీనిని స్థాపించారు. అప్పటి నుండి ఈ గుడి వేలాది భక్తులను ఆకర్షిస్తోంది. హనుమంతునికి ప్రీతికరమైన మంగళ వారాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తారు. పూజలు నిర్వహిస్తారు.

PC: official website

శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం

శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం

నీలకంఠేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయం. ప్రతిరోజూ ప్రత్యేకించి సోమవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివుని ఆశీస్సులు పొందుతారు. ఇక్కడ శివుడిని నీల కాంతుడు లేదా నీలిరంగు మెడ కలవాడు అంటారు. శివుడు విషం మింగాడని ఆ కారణంగా ఆయన మెడ నీలం అయిందని చెపుతారు. ఈ దేవాలయాన్ని శాతవాహన వంశానికి చెందినా శాతకర్ణి II నిర్మించారు. దేవాలయ శిల్పశైలి కొద్దిగా ఉత్తర భారతదేశ దేవాలయాల శైలిని పోలి వుంటుంది. దీనికి కారణం ఆ కాలంలో ఇక్కడ జైనులు ఉండేవారని వారి కొరకు ఇది నిర్మించారని చెపుతారు.

PC: youtube

అశోక్‌సాగర్‌

అశోక్‌సాగర్‌

అందమైన బండ రాతి గుట్టలు, గార్డెన్‌ మధ్యలో సుందరమైన అశోక్‌సాగర్‌ సరస్సు నెలకొని ఉంది. ఇది హైదరాబాద్‌-బాసర రోడ్‌లో నిజామాబాద్‌ నుండి సుమారు 10 కి.మీ దూరంలో ఉంది. గార్డెన్స్‌ మధ్యలో చక్కగా అమర్చిన విద్యుద్దీపాలతో మెరిసే బండరాళ్లు నడుమ సేదతీరడం ఎప్పటికీ మర్చిపోలేరు. మనసుకు హాయిగొలిపే బోట్‌ ప్రయాణం ఆహ్లాదానిస్తుంది.

PC: official website

అలీసాగర్‌

అలీసాగర్‌

అలీసాగర్‌ నిజామాబాద్‌కు సుమారు 15 కి.మీటర్లు, నిజామాబాద్‌-బాసర రోడ్‌కు 2 కి.మీ. దూరంలో ఉంది. మానవ నిర్మిత రిజర్వాయర్‌ను 1930 దశకంలో నిర్మించారు. నగర రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతతను ఇస్తుంది. సమ్మర్‌ హౌస్‌ పక్కగా పెంచిన గార్డెన్స్‌ ఐలాండ్‌, కొండపై ఉన్న అతిధి గృహం, చుట్టూ విస్తరించిన అడవి సింహద్వార ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సమీపంలో తేళ్లపార్కు ఉంది. ట్రెకింగ్‌, వాటర్‌స్పోర్ట్స్‌ లాంటి ఆటలకు అవసరమైన సదుపాయాలు కూడా పర్యాటకులకు ఆనందం కల్గిస్తాయి.

Photo Courtesy: Ananth Naag Kaveri

మల్లారం అడవి

మల్లారం అడవి

మల్లారం అడవి నిజామాబాద్‌కు 7 కి.మీ దూరంలో ఉంది. పర్యావరణ పరిరక్షణను కోరే పర్యాటకుల కోసమే ఈ ప్రదేశం ఉందా అనిపిస్తుంది. అడవిలో ట్రెక్కింగ్‌, పగోడ టవర్‌ ప్రధాన ఆకర్షణలు. ఇక్కడ 1.45 బిలియన్‌ సంవత్సరాల పురాతన బండరాళ్లు కనువిందు చేస్తాయి. సాహస ప్రయాణానికి, ఆహ్లాదపరిచే పిక్నిక్‌లకు అనువైన ప్రదేశం ఇది.

Photo Courtesy: Telangana tourism

బాసర దేవాలయం

బాసర దేవాలయం

ఆదిలాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ పట్టణానికి 45 కి.మీ. దూరంలో గోదావరి నదీ తీరాన ఉన్న బాసరలో జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. సరస్వతీదేవికి దక్షిణాదిన ఉన్న ఏకైక దేవాలయం ఇది. స్వయంభూ త్రిశక్తి స్వరూపులైన సరస్వతి, లక్ష్మి, కాళికల విగ్రహాలను వ్యాసమహముని ప్రాథమికంగా ఇక్కడే ప్రతిష్టించాడని చెపుతుంటారు. భక్తులు తమ పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తుంటారు. విద్యాభ్యాసం ప్రారంభంలో ఇది అత్యంత శుభప్రదమని భావిస్తారు.

Photo Courtesy: RameshSharma

ఆర్మూర్‌ రాక్‌ ఫార్మేషన్స్‌

ఆర్మూర్‌ రాక్‌ ఫార్మేషన్స్‌

ఆర్మూర్‌ జాతీయ రహదారిలో ఉన్న రాక్‌ ఫార్మేషన్స్‌ సహజ సిద్ధంగా ఏర్పడింది. వేల సంవత్సరాలకు పైగా వాతావరణ స్థితిగతులలో మార్పులకు లోనై ఇలా ఏర్పడ్డాయి. ఇక్కడి ప్రకృతి గొప్పదనం సందర్శకులను ఆకట్టుకుటుంది. నవనాథ సిద్ధేశ్వర దేవాలయం కొండపై ఉంది. వననాధులు లేదా సిద్ధులు, యోగులు ఇంకా ఈ గుహల్లో, కొండ సొరంగాల్లో ఉన్నారని విశ్వసిస్తుంటారు. ఇక్కడి నీరు దీర్ఘకాల వ్యాధులను, అంగవైకల్యాలను నయం చేస్తుందని స్థానికులు నమ్ముతారు.

Photo Courtesy: Telangana Tourism

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

విమానాశ్రయం నిజామాబాద్ కి ఎటువంటి విమానాశ్రయం లేదు. ఇక్కడి నుంచి సుమారుగా 136 కి. మీ. దూరంలో నాందేడ్ దేశీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమ్మాన సదుపాయాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇది కుదరకపోతే నిజామాబాద్ కు 162 కి. మీ. దూరంలో హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడి నుంచి కూడా దేశం లోనే కాక ప్రపంచలోని వివిధ ప్రాంతాలనుంచి కూడా విమానాలు వస్తుంటాయి. రైల్వే స్టేషన్ నిజామాబాద్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు మార్గం నిజామాబాద్ కి రోడ్డు సదుపాయం బాగానే ఉంది. హైదరాబాద్ నుంచి 174 కి. మీ. దూరంలోను, బీదర్ నుంచి 163 కి. మీ. దూరంలోను ఉంది. ఈ ప్రాంతం గుండా జాతీయ రహదారి వెళుతుంది. కనుక రోడ్డు మార్గం గురించి చింత అనవసరం.

Photo Courtesy: Belur Ashok

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X