» »రోజు...రోజుకీ క్షీణించిపోయే గోవర్థన గిరినే కలియుగాంతానికి కారణమా.... ?

రోజు...రోజుకీ క్షీణించిపోయే గోవర్థన గిరినే కలియుగాంతానికి కారణమా.... ?

Written By: Venkatakarunasri

మథురకు సమీపంలో ఉన్న గోవర్ధన గిరి హిందువులకు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము.ఒక పురాణం ప్రకారం ఈ గోవర్ధన గిరి కృష్ణుడు యొక్క దైవలీలలో భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు వచ్చినది అని నమ్ముతారు. అంతేకాక ఈ ప్రదేశముతో కృష్ణుడుకి సంబంధం ఉందని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం ఒకసారి కుండపోత వర్షాలు పడుతున్న సమయంలో కృష్ణుడు పర్వతంను ఎత్తి వరుసగా ఏడు రోజుల పాటు తన చేతులతో పట్టుకోవడం ద్వారా ప్రజలను కాపాడెను. పైన చెప్పిన విధంగా,గోవర్ధన గిరి హిందువులకు ప్రధాన యాత్రా ప్రదేశాలలో ఒకటిగా ఉన్నది. అంతే కాకుండా గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారు కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకము.

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

ఇక్కడ ఉన్న దేవుని యొక్క ఒక భారీ విగ్రహం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ఆధ్యాత్మికతను పెంచుతుంది. గోవర్ధనలో చూడవలసినవి కృష్ణుడుకి అంకితం చేసిన హర దేవాజి దేవాలయం ప్రధాన ఆకర్షణగా ఉన్నది. ఈ ఆలయంలో రాధా మరియు కృష్ణ అందమైన విగ్రహాలు మరియు ఆయన జీవితానికి సంబంధించిన సంఘటనలను చూడవచ్చు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

కృష్ణుడు,రాధా మరియు గోపికలను కలిసే రాధా కుండ్ లేదా సరస్సును చూడవచ్చు. తరువాత గోపికలు కృష్ణుడు కోసం ఎదురుచూసే కుసుం సరోవర్ అనే పవిత్ర ట్యాంక్ ఉంది. మన్సి గంగా ట్యాంక్ దేవునితో సంబంధం కలిగిన మరొక ఆనవాలుగా ఉంది.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

ఇక కృష్ణుడుఎత్తిన గోవర్దనగిరిగురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపరయుగంలో రాక్షస మాయ కారణంగా భారీవర్షానికి తుఫానుకు గోకులమంతా అతలాకుతలంఅవుతుంటే వారిని రక్షించేందుకువచ్చిన శ్రీ కృష్ణుడు తన చిటికినవేలుపైగోవర్ధనగిరినిఎత్తి వారికి ఆశ్రయంఇచ్చారు.ప్రస్తుతం గోవర్ధన పర్వతం ఉత్తరప్రదేశ్లోని మధుర ప్రాంతంలో వుంది.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

ఈ పర్వతం ప్రతి యేటఆవగింజంత పరిమాణంఆకారంలో తగ్గుతూ వస్తుందట.అలా తరిగిపోతున్న గోవర్దనగిరి ఎప్పుడైతే నేలకు సమాంతరంగా మారుతుందోఅప్పుడే కలియుగం కూడా అంతమౌతుందని పురాణాలు చెబుతున్నాయి.పర్వత రాజు ద్రోణకల్ అనేఅతనికి గోవర్ధనుడు,యమునఅనే ఇద్దరు జన్మించారట. గోవర్దునుడుగోవర్ధన పర్వతంగా మారగా,యముననదిగా మారి ప్రవహించింది.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

బ్రహ్మదేవుని మనవడు గొప్పఋషిఐన పులస్త్యుడు ద్రోణకలుడితో గోవర్ధనపర్వతం కాశీలో వుండాలని,అక్కడ వుంటే పూజాదికార్యక్రమాలకు బాగాఅనువుగా వుంటుందనిచెబుతాడు.దీనికి ద్రోణకలుడు అంగీకరించి గోవర్దునినిపులస్తునితో వెళ్ళమని చెప్పగా దానికి గోవర్దునుడు మొదట సరేఅని తరవాత ఒక చిన్నమెలికెపెడతాడు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

తననుమోసుకొని వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలోఅసలు క్రిందపెట్టకూడదని అలా పెడితే తాను రానని కాశీవరకు తననుదింపకుండా అలాగే తీసుకువెళ్లాలని గోవర్దనుడు చెబుతాడట. దీనికి పులస్త్యుడుకూడా అంగీకరించి అలాగే అనిఅంటాడు. అయితే పులస్త్యుడు గోవర్ధునిన్నిఅలా తన భుజాలపై మోసుకెల్తూవుండగా గోవర్దునికి దారిలో శ్రీకృష్ణుడుకి చెందిన ఒకనగరంకనిపిస్తుంది.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

ఆ నగరం ప్రకృతిఅందాలతో మహాఅద్భుతంగా వుండటంతో పాటు తన చెల్లెలైన యమున నదికూడా అక్కడి నుంచి ప్రవహిస్తూ వుంటుంది.దీంతో ఆ ప్రకృతిఅందాలకు ముగ్ధుడైన ఆ గోవర్ధునుడు అక్కడకాలం గడపాలని నిశ్చయించుకుని ఎలాగైనా పులస్త్యుడునిమాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

తన శక్తితో గోవర్ధునుడు అమాంతం బరువుపెరుగుతూవుంటాడు. ఇది గమనించిన పులస్త్యుడు గోవర్దునున్నిదించి అతనికి శాపంపెడతాడు. అప్పట్నుంచిగోవర్దునిన్ని ఏడాదికి ఆవగించంతపరిమాణంలోఆకారం తక్కువఅవ్వాలని అలా చివరికి అతను భూమికి సమతలంగా మారగానే అప్పుడుప్రళయంవస్తుందని కలియుగం అంతరిస్తుందని పులస్త్యుడు అతనికి శాపంపెడతాడు.అప్పట్నించి గోవర్ధనగిరి ఆకారం ఆవగింజంతపరిమాణంలో తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే ఇదినేలకు సమాంతరంగా మారుతుందో అప్పుడు కలియుగం తధ్యమనిచెబ్తున్నారు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

ఇక్కడికి సమీపంలో చూడవలసిన ప్రదేశాలు

మానసి గంగా ట్యాంక్, గోవర్ధనగిరి

గోవర్ధన పట్టణం మధ్యలో రాజా భగవాన్ దాస్ మరియు రాజా మాన్ సింగ్ లు మన్సి గంగా ట్యాంక్ అనే రాతి ట్యాంక్ ను నిర్మించెను. 'మన్సి' అనే పదమునకు మనసు అని అర్దము. ఒక పురాణం ప్రకారం,కృష్ణ సంరక్షక తల్లిదండ్రులు అయిన నంద మరియు యశోదలు గంగా పవిత్ర స్నానం చేయాలనీ కోరుకున్నారు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

కానీ గంగ చాలా దూరంగా ఉండుట వల్ల బ్రిజ్ నివాసితులను మరియు బృందావనంను వదిలి అక్కడకు వెళ్ళడం నంద,యశోదలకు ఇష్టం లేదు. కృష్ణుడు వారి కోరిక గురించి విని తన మనస్సు యొక్క శక్తితో గోవర్ధన గిరికి గంగాను తీసుకువచ్చెను. అందుకే ఈ ట్యాంక్ కు మన్సి గంగా అని పేరు వచ్చెను.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

యశోద మరియు బ్రిజ్ నివాసితులు నదిలో స్నానం ఆచరించినప్పుడు వారికీ గంగా మాత మొసలి మీద స్వారీ చేయటం కనిపించెను. ఈ పవిత్రమైన మన్సి గంగా లో స్నానం చేస్తే శ్రీ కృష్ణుడి ప్రేమ రూపంలో మిలియన్ రెట్లు ఎక్కువ ఆధ్యాత్మిక యోగ్యతా వస్తుందని నమ్మకం. గోవర్ధన చుట్టూ ప్రదక్షిణతో ప్రారభమై మన్సి గంగాలో ఒక స్నానంతో ముగుస్తుంది.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

కుసుమ్ సరోవర్, గోవర్ధనగిరి

కుసుం సరోవర్ గోవర్ధన గిరిలో ఒక ప్రముఖ పవిత్రమైన ట్యాంక్. దీనికి ఆ పేరు ట్యాంక్ చుట్టూ విస్తారంగా పెరిగిన కుసుమ పువ్వుల నుండి వచ్చింది. గోపికలు ఈ ప్రదేశం నుంచి పువ్వులను కోసి వారి ప్రియమైన కృష్ణుడు కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి కేవలం అర గంట నడకతో రాధా కుండ్ ను చేరుకోవచ్చు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

కుసుమ్ సరోవర్ 450 అడుగుల పొడవు మరియు 60 అడుగుల లోతు కలిగి ఉంటుంది. కృష్ణుడుకి కదంబ చెట్లు ఇష్టమైన చెట్టు కనుక చెరువు కట్ట అంతటా చెట్లను దట్టంగా ఉండేలా అభివృద్ధి చేసారు. తోటలో ఒక పురాతన రాజ కుటుంబానికి చెందిన ఒక స్మృతి చిహ్నం ఉంది.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

ట్యాంక్ దగ్గరగా అనేక చిన్న ఆలయాలు మరియు ఆశ్రమములు ఉన్నాయి. ఈ ప్రాంతంనకు సాయంత్రంపూట భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. వారు ప్రశాంతమైన పరిసరాల నడుమ ప్రార్ధనలు చేస్తారు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

హర దేవజీ ఆలయం, గోవర్ధనగిరి

కొన్ని గ్రంథాల ప్రకారం, రాధా రాణి, గోపికలతో కలసి ఒకసారి మన్సి గంగా బ్యాంకు వద్ద వారి ప్రియమైన కృష్ణను కలవడానికి నిలబడేను. కానీ సుదీర్ఘ కాలం పాటు కృష్ణుడు రాకపోవుట వలన వారు తమ దేవుడైన కృష్ణుడుని అర్థించడానికి హరిదేవ అనే పేరు పఠించడం ప్రారంభించారు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

అప్పుడు వారి ప్రేమకు చలించి కృష్ణుడ తన ఎడమ చేతిలో గోవర్ధన కొండ మరియు కుడి చేతిలో వేణువుతో ఆహ్లాదకరమైన చక్కని ఏడు సంవత్సరాల బాలుడు రూపంలో వారికి దర్శనమిచ్చెను. ఈ దివ్య సంజ్ఞ ద్వారా తృప్తిపొందిన రాధా రాణి మరియు గోపికలతో గర్వంగా ఈ ప్రదేశమునకు ప్రతి రోజు వచ్చి భక్తి పాటలు పాడటం ప్రారంభించారు.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

వాస్తవంగా హరదేవ ఆలయంను కృష్ణ మనవడు నిర్మించారని ఒక నమ్మకం. ప్రస్తుతం హరదేవ ఆలయంను అక్బర్ చక్రవర్తి పాలనలో పదహారవ శతాబ్దంలో జైపూర్ రాజు భాగందాస్ నిర్మించారు. భక్తులు మన్సి గంగలో స్నానం చేసి లార్డ్ హరిదేవ యొక్క దర్శనం చేసుకుని దీవెనలు కోరుకుంటారు. ఆలయంలోనికి ప్రవేశించటానికి ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి.

pc:youtube

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

ఎలా చేరాలి?

రైలు మార్గం

గోవర్ధన నుండి 26 కిలోమీటర్ల దూరంలో సమీప రైల్వే స్టేషన్ మథురలో ఉంది. ఇక్కడ నుండి ప్రభుత్వ రవాణా బస్సు లేదా ఒక టాక్సీని అద్దెకు తీసుకోని గోవర్ధన గిరిని చేరుకోవచ్చు.

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

గోవర్దనగిరికి యుగాంతానికి సంబంధం ఏమిటి

విమాన మార్గం

గోవర్ధనలో విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయం 30 కిమీ దూరంలో ఉన్న వారణాసి లో ఉన్నది. అక్కడ నుంచి టాక్సీని లేదా ప్రైవేట్ / ప్రజా రవాణా బస్సు ద్వారా గోవర్ధన చేరుకోవచ్చు.