» »గుంటుపల్లి బౌద్ధారామాలు, పశ్చిమ గోదావరి జిల్లా !!

గుంటుపల్లి బౌద్ధారామాలు, పశ్చిమ గోదావరి జిల్లా !!

Written By:

చారిత్రక ప్రదేశం : గుంటుపల్లె లేదా గుంటుపల్లి

జిల్లా : పశ్చిమ గోదావరి

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్ (ఆ.ప్ర)

ప్రసిద్ధి : బౌద్ధ స్తూప, చైత్యాలు, విహారాలు

గుంటుపల్లె లేదా గుంటుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. పురాతనమైన బౌద్ధరామ స్థానంగా మరియు చారిత్రకంగా ప్రసిద్ధి చెందినది ఈ గ్రామము. ఈ బౌద్ద గుహలు గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధికెక్కినా అవి నిజానికి జీలకర్రగూడెం ఊర్ని ఆనుకొనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి : నాగార్జున కొండ - ప్రపంచంలో అతిపెద్ద ద్వీపపు మ్యూజియం !!

ఆంధ్ర దేశంలో బుద్ధుని కాలంనుండి బౌద్ధమతం జనప్రియమైన జీవనవిధానంగా విలసిల్లింది. ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్ట స్థానానికి నిదర్శనాలు. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలానికి చెందినది. అంటే క్రీ.పూ.3 వ శతాబ్దికే ఇవి ముఖ్యమైన బౌద్ధక్షేత్రాలు.

గుహాలయం

గుహాలయం

క్రీ.పూ. 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపము, చుట్టూరా ప్రదక్షిణా మార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహారులోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలున్నాయి.

చిత్రకృప : కాసుబాబు

పెద్ద బౌద్ధ విహారము / ఆరామము

పెద్ద బౌద్ధ విహారము / ఆరామము

ఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయము. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానము. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహలలోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.

చిత్రకృప : కాసుబాబు

మొక్కుబడి స్తూపములు

మొక్కుబడి స్తూపములు

కొండపైని వివిధ ఆకృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమారు అరవై మొక్కుబడి స్తూపాలున్నాయి. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠములపై నిర్మింపబడినవి. వీటిమధ్య మొక్కుబడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి.

చిత్రకృప : కాసుబాబు

రాతి స్తూపములు

రాతి స్తూపములు

క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. క్రీ.పూ.19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికేవారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీ.

చిత్రకృప : కాసుబాబు

శిథిల మంటపం

శిథిల మంటపం

ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో క్రీ.పూ. 1 నుండి క్రీ.శ.5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.

చిత్రకృప : కాసుబాబు

చైత్య గృహము

చైత్య గృహము

ఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తువరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంకృత అధిష్టానము నాసిక్, కార్లే గుహలను పోలి ఉంది.

చిత్రకృప : కాసుబాబు

ఇటుకల స్తూప చైత్యము

ఇటుకల స్తూప చైత్యము

ఇది కూడా క్రీ.పూ.3-2వ శతాబ్దానికు చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎత్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీ.పూ.2-1వ శతాబ్దమునకు చెందిన ఒక ఉపాసిక కట్టించెనని తెలియవస్తున్నది. ఈ చైత్య గృహము 11మీ. వ్యాసం కలిగి ఉంది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపధం ఉంది.

చిత్రకృప : కాసుబాబు

ఇటీవల లభ్యమైనవి

ఇటీవల లభ్యమైనవి

ఇటీవల ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభమునకు చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమయినది. ఈశాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూసాయి. ప్రసిద్ధ బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యాసి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసినట్లు ఈ శిలా ఫలకంలో ప్రాకృత భాషలో ఉంది.

చిత్రకృప : కాసుబాబు

గుంటుపల్లి ఎలా చేరుకోవాలి ?

గుంటుపల్లి ఎలా చేరుకోవాలి ?

మొదటి మార్గం : జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి గుంటుపల్లికి బస్సు సౌకర్యం ఉంది. సుమారు 30 కిలోమీటర్ల దూరం.

రెండవ మార్గం : ఏలూరు నుండి కామవరపుకోట వెళ్ళవచ్చును. అక్కడినుండి జీలకర్రగూడేనికి సుమారు 5 కిలోమీటర్లు దూరం. ఏలూరు పాత బస్సు స్టాండులోనూ, సోమవరప్పాడు దగ్గరా "గుంటుపల్లి బౌద్ధారామాలను దర్శించండి" అనే చిన్న బోర్డులు పెట్టారు.

చిత్రకృప : Svabhiman

Please Wait while comments are loading...