Search
  • Follow NativePlanet
Share
» »నాగార్జునకొండ - ప్రపంచపు అతిపెద్ద ద్వీపపు మ్యూజియం !

నాగార్జునకొండ - ప్రపంచపు అతిపెద్ద ద్వీపపు మ్యూజియం !

నాగార్జునకొండ హైదరాబాద్ నగరానికి 160 కి. మీ ల దూరంలో ఉన్నది. మాచర్ల రైల్వే స్టేషన్ లో దిగి కూడా మ్యూజియాన్ని చేరుకోవచ్చు. నాగార్జునకొండ ద్వీపం చుట్టూ నాలుగువైపులా నీళ్లు ఉన్నాయి.

By Mohammad

భారతదేశంలోని చారిత్రక కట్టడాలలో ఒకటి నాగార్జునకొండ మ్యూజియం. బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేరిట ఈ కొండకు ఆ పేరుపెట్టడం జరిగినది. యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతం పై నాగార్జునుడు కొరకు మహా చైతన్య విహారాలను నిర్మించాడని ప్రతీతి. నాగార్జునుడు ఈ కొండపైనే తన శిష్యులకు నీతి బోధనలు చేసాడని చెబుతారు.

మ్యూజియానికి ఎలా చేరుకోవాలి ?

నాగార్జునకొండ హైదరాబాద్ నగరానికి 160 కి. మీ ల దూరంలో ఉన్నది. మాచర్ల రైల్వే స్టేషన్ లో దిగి కూడా మ్యూజియాన్ని చేరుకోవచ్చు. నాగార్జునకొండ చుట్టూ నాలుగువైపులా నీళ్లు ఉన్నాయి. ఇదొక ద్వీపం. కృష్ణా నది జలాలపై నాగార్జునసాగర్ నుండి 14 కి. మీ ల దూరం లాంచీ లో ప్రయాణించి కొండ వద్దకు చేరుకోవచ్చు. 'శ్రీపర్వతం' కు గల మరొక పేరు 'విజయపురి'. జర్నీ సమయం సుమారు 30 - 40 నిమిషాలు పడుతుంది.

నాగార్జునకొండ మ్యూజియం ప్రవేశం

నాగార్జునకొండ మ్యూజియం ప్రవేశం

బోట్ రైడ్ మరియు మ్యూజియం కలిపి టికెట్ 90 రూపాయలుగా ఉంటుంది. సేమ్ టికెట్ ను మరళా రిటర్న్ జర్నీ కి ఉపయోగించవచ్చు. టికెట్ కౌంటర్ వద్ద సిబ్బంది రెండు టికెట్ లను ఇస్తాడు. ఒకటేమో బోట్ రైడ్ కు, మరొకటేమో మ్యూజియానికి.

బోట్ టైమింగ్స్ : ఉదయం 9 : 30 గంటలకు మొదటి బోట్ బయలుదేరుతుంది. కానీ ఇది మ్యూజియం సిబ్బందికి రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఆతరువాత గంటగంట కి నాగార్జున సాగర్ బోటింగ్ పాయింట్ వద్ద నుంచి నాగార్జునకొండ వరకు లాంచీ లు వెళుతుంటాయి. బోట్ పాయింట్ వద్ద నుండి లాస్ట్ బోట్ మధ్యాహ్నం 3 : 30 కు, మ్యూజియం నుండి లాస్ట్ బోట్ 5 : 30 కు ఉంటుంది.

నేషనల్ బుద్ధ మ్యూజియం, న్యూఢిల్లీ !

సందర్శన సమయం : ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ప్రతి శుక్రవారం సెలవు.

బౌద్ధ చైత్యం

బౌద్ధ చైత్యం

చిత్రకృప : Ayan Mukherjee

అర్జునుడు - నాగరాజు

ఖండవదహన సమయంలో అర్జునుడు బాణానికి చెట్లు, పుట్టలు, అడవులు అగ్నికి ఆహుతైపోతాయి. ఆ ఆహుతిలో నాగులు కూడా భస్మమైపోతాయట ! ఎక్కడ తమజాతి అంతరించిపోతుందో అని భయపడిన నాగరాజు వాసుకితో కలిసి అర్హునుడి శరణు వేడార. దాంతో అర్జునుడు దూరంగా ఉన్న ఈ కొండ ప్రాంతంలో ఆశ్రయం పొందమని చెప్పాడట. నాగులు ఆశ్రమం పొందిన ఈ స్థలమే నేడు నాగార్జునకొండ గా పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

అవశేషాలు

నాగార్జునకొండ ఐలాండ్ గల మ్యూజియంలో 400 పైవరకు శాశనాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు దానధర్మాలకు సంబంధించినవి. ఇవి ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలో చెక్కినారు.

మ్యూజియంలో అవశేషాలను ప్రధానంగా మూడు భాగాలుగా విడగొట్టవచ్చు. అవి ప్రాచీనకాలం నాటి అవశేషాలు, శాతవాహనకాలం నాటి అవశేషాలు మరియు బౌద్ధ కాలం నాటి అవశేషాలు.

క్రీ.శ. 3 వ శతాబ్దానికి చెందిన బుద్ధుని శిల్పం

క్రీ.శ. 3 వ శతాబ్దానికి చెందిన బుద్ధుని శిల్పం

చిత్రకృప : sailko

ప్రాచీనకాలం నాటి అవశేషాలు : నాగార్జునకొండ తవ్వకాలలో పాచీన కాలం నాటి అవశేషాలు బయటపడ్డాయి. రాతిపనిముట్లు, రాతి గొడ్డలి, రాగి ముక్కలు, కుండ పెంకులు (చనిపోయినవారిని కుండలలో పెట్టి పూడ్చేవారు) మొదలైనవాటితో పాటు ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగానికి చెందిన అనేక వస్తువులు లభించాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో బౌద్ధ మతం ఎలా ఏర్పడింది ?

శాతవాహనకాలం నాటి అవశేషాలు : శాతవాహన కాలం నాటి నాణేలు, ఆభరణాలు, ముత్యాల దండలు మొదలుగునవి ఇక్కడి తవ్వకాలలో లభించాయి. ఇక్ష్వాకుల కాలంలో 'విజయపురి' బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లింది. ఇక్ష్వాకులు వైదిక మతాన్ని ఆచరించినా ... అంతఃపురం లోని స్త్రీలు బౌద్ధమతాన్ని ఆచరించేవారట!

పురావస్తు తవ్వకాలు

పురావస్తు తవ్వకాలు

చిత్రకృప : Michael Gunther

బౌద్ధమతం కాలం నాటి అవశేషాలు : బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం మ్యూజియంలో చూడదగ్గవి. వివిధ భంగిమలలో బుద్ధిని శిల్పాలు, బౌద్ధ స్థూపాలు, చైత్య గృహాలు, మండపాలు మొదలుగునవి తవ్వకాలలో బయటపడ్డాయి.

వైదిక మతాన్ని ఆచరించిన ఇక్ష్వాకులు ఈ ద్వీపంలో దేవాలయాలను నిర్మించారని చెబుతారు. వీటికి ఆధారం అక్కడి తవ్వకాలలో లభించిన భుజ స్వామి, పుష్పభద్ర స్వామి, సర్వదేవ, కార్తికేయ శిల్పాలు.

మ్యూజియం నుండి వెనుతిరిగుతూ ...

మ్యూజియం నుండి వెనుతిరిగుతూ ...

చిత్రకృప : Ayan Mukherjee

వసతి/ ఆహారం

నాగార్జున సాగర్ వద్ద చిన్న చిన్న హోటళ్లు, లాడ్జీలు వసతి సదుపాయాల కొరకు లభిస్తాయి. హైదరాబాద్, తెలంగాణ వంటకాల తో పాటు ఆంధ్రా స్టైల్ ఆహారాలను రుచి చూడవచ్చు.

నాగార్జునకొండ మ్యూజియం ప్రపంచములోని పురావస్తుశాలలన్నింటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శన శాల (ఐలాండ్ మ్యూజియం). సమీపంలోని నాగార్జున సాగర్ డ్యాం, ఎత్తిపోతల జలపాతం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X