• Follow NativePlanet
Share
» »శిధిలాల మీదుగా ప్రయాణం !!

శిధిలాల మీదుగా ప్రయాణం !!

హళేబీడు బేలూర్ రెండుకూడా ఒకదానికొకటి 15 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఇక వీటి విషయానికొస్తే.. హళేబీడు అంటే " ప్రాచీన నగరం " అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో ప్రదర్శించారు. పురాతనకాలంలో దానిని " ద్వారసముద్రం " అంటే సముద్రానికి ప్రవేశం అనే అర్ధంలో పిలిచేవారు. హళేబీడు కర్నాటక రాజధాని బెంగుళూరుకు 184 కి.మీ. దూరంలో హాసన్ జిల్లాలో ఉంది. సాంస్కృతిక రాజధాని మైసూరు పట్టణానికి 118 కి.మీ. ల దూరంలో ఉంది. హళేబీడు, బేలూరుల మధ్య దూరంలో సుమారు ఇరవెై నిమిషాలు వుంటుంది. కన్నడ భాషలో 'హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం.

ఈ రెండు ప్రదేశాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు. ఈ రెండు ప్రాంతాలని కలిపి " దక్షిణ వారణాసి " గా అభివర్ణిస్తారు. ఇక ఆలస్యం ఎందుకు ఇక్కడున్న ఆలయాలు, చూడవలసిన ప్రదేశాల గురించి ఒక ట్రిప్ వేద్దాం పదండి!!

శిధిలాల మీదుగా ప్రయాణం !!

శిధిలాల మీదుగా ప్రయాణం !!

హళేబీడు - హొయసలేశ్వర దేవాలయం

హళేబీడు వచ్చే పర్యాటకులు హొయసలేశ్వర దేవాలయం తప్పక చూడాలి. ఇక్కడ శివభగవానుడే హొయసలేశ్వరుడుగా అవతరించాడు. ఈ దేవాలయ నిర్మాణం 12 శతాబ్దంలో మొదలైంది. ఆలయం మొత్తం అరవెైనాలుగు కోణాలు కలిగి ఉంటుంది. గోడల కింద చుట్టూ వరసగా వివిధ రకాల జంతువులు నాట్యం చేస్తున్న గణేశుడు, తాండవం చేస్తున్న శివుడు, కైలాస పర్వతాన్ని పెైకి ఎత్తాలనుకుంటున్న రావణుడు, ఐరావతం మీద స్వారీ చేస్తూవున్న దేవేంద్రుడు, హంసవాహనం మీద వున్న బ్రహ్మదేవుడు, నాట్య సరస్వతి, దశావతారాలకు సంబంధించిన ఘట్టాలు, శ్రీరాముడు ఒకే బాణంతో ఏడుతాటిచెట్లను పడగొట్టడం, తన తలపెైగా విల్లు ఎక్కుపెట్టి వున్న అర్జనుడు, చిన్ని కృష్ణుని అల్లరి పనులు కనిపిస్తాయి.

Photo Courtesy: Soham Banerjee

శిధిలాల మీదుగా ప్రయాణం !!

శిధిలాల మీదుగా ప్రయాణం !!

హళేబీడు - కేదారేశ్వర దేవాలయం

ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించాలి. ఇది చాళుక్యుల శిల్పకళలతో కనపడుతుంది. దీనిలో రెండు హొయసలుల చిహ్నాలు కనపడతాయి. ఈ రకంగా చాళుక్యుల మరియు హొయసలుల శిల్ప నైపుణ్యం కలిసి ప్రదర్శించబడుతుంది. అందంగా చెక్కబడిన గోడలు, సీలింగ్ మాత్రమే కాక, కేదారేశ్వర దేవాలయంలో మహాభారతం, భగవద్గీత, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాల చిత్రాలు సైతం కిందిభాగంలో చెక్కబడి కన్పిస్తాయి. పర్యాటకులు క్రిష్ణశిలతో నిర్మించిన కేదారేశ్వర శివ లింగాన్ని దేవాలయంలో చూస్తారు. పర్యాటకులు దేవాలయంపై పర్యాటకులు మూడు శిఖరాలు చూస్తారు. పెద్దది మధ్యన, చిన్నవి దానికి ఇరుపక్కలా ఉంటాయి. ఉమా మహేశ్వర, భైరవ, వరాహ, తాండవేశ్వర మరికొన్ని ఇతర దేవుళ్ళ విగ్రహాలు శిఖరాలను వివరిస్తాయి. . ‘‘శిల్ప నిర్మాణంలోని ఊహాశక్తికి, నేర్పరితనానికి చాతుర్యానికి హోళేబీడు ఆలయానికి సాటి మరొకటి లేదు''. ఇది విదేశీ శిల్ప పండితుల అభిప్రాయం. భారతీయ శిల్పుల ఔన్నత్యం నెైపుణ్యం ఎంత అద్వితీయమైనవో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు. ఈ ఆలయాన్ని తప్పక చూడవలసిందే.

Photo Courtesy: ineshkannambadi

శిధిలాల మీదుగా ప్రయాణం !!

శిధిలాల మీదుగా ప్రయాణం !!

బెలవడి - వీరనారాయణ దేవాలయం

హళేబీడు సందర్శించేవారు బేలవాడి తప్పక చూడాలి. ఈ జాతీయ వారసత్వ ప్రదేశం అందాలకు పేరుగాంచినది. పచ్చటి చెట్లు, ప్రదేశాలు కలిగి ఉంటుంది. ఇది జావగల్ - చిక్కమగళూరు మార్గంలో కల ఒక గ్రామం. చరిత్రలో ఎంతో పేరుపడింది. ప్రస్తుతానికి పాత బెలవాడి ఖాళీగా కనపడుతుంది. దీనిలోని నివాసితులందరూ కొత్త బెలవాడిలో స్ధిరపడ్డారు. ఈ గ్రామంలో హొయసల శిల్ప సంపద కల శ్రీ వీరనారాయణ దేవాలయం ఉంటుంది. దేవాలయాన్ని అందమైన శ్రీ వీరనారాయణ, శ్రీ వేణుగోపాల మరియు శ్రీ యోగనరసింహ విగ్రహాలుకల త్రికూట దేవాలయంగా పరిగణిస్తారు. బెలవాడి గ్రామం 17వ శతాబ్దంలో మరాఠా రాజు శివాజీతో తలపడిన బెలవాడి మల్లమ్మ చరిత్రకు కూడా ప్రసిద్ధి.

Photo Courtesy: Dineshkannambadi

శిధిలాల మీదుగా ప్రయాణం !!

శిధిలాల మీదుగా ప్రయాణం !!

బేలూర్ - చెన్నకేశవ ఆలయం

బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినది. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది. ఈ ఆలయం హొయసల కాలమునకు చెందినది. ఈ మహానిర్మాణాన్ని చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల విష్ణువర్ధనుడు కట్టించాడు. పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.

Photo Courtesy: Papa November

శిధిలాల మీదుగా ప్రయాణం !!

శిధిలాల మీదుగా ప్రయాణం !!

బేలూర్ - గ్రావిటీ పిల్లర్

పర్యాటకులు తమ బేలూర్ యాత్రలో సమయం ఉంటె గ్రావిటీ పిల్లర్ తప్పక చూడాలి. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అక్కడ ఈ స్థూపం ఎటువంటి ఆధారం లేకుండా ఒకే రాతితో తయారు చేసిన వేదిక మీద నిలబడి ఉంది. ఈ స్థూపం దాని స్వంత బరువుపై మూడు వైపుల నిలబడి, నాలుగో వైపు నేలకు ఆనకుండ కాగితం ముక్కను దూర్చినా దూరే విధంగా ఖాళీతో నిరాధారంగా నిలబడి ఉంటుంది.

Photo Courtesy: Madhav Pai

శిధిలాల మీదుగా ప్రయాణం !!

శిధిలాల మీదుగా ప్రయాణం !!

బేలూర్ హళేబీడు చేరుకోవడం ఎలా

రోడ్డు మార్గం

బేలూర్ హళేబీడు లకు మీరు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హస్సన్ నుండి బస్సు ద్వారా గాని లేకుంటే మీకు సొంత వాహనం ఉంటే మీరే సొంతంగా డ్రైవ్ చేసుకొని రావచ్చు. హస్సన్ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుంచి, వివిధ నగరాలనుంచి బెంగళూరు, మైసూరు నుంచి కూడా బస్సులు వస్తుంటాయి.

రైలు మార్గం

హస్సన్ రైల్వే స్టేషన్ కు బెంగళూరు, మైసూరు, మంగళూరు ప్రాంతాలనుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

వాయు మార్గం

దేనికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారుగా 223 కి. మీ .దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం కి దేశంలోని ప్రధాన నగరాలనుంచే కాక, వివిధ దేశాల నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

Photo Courtesy: Surajram Kumaravel

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి