» »ఉత్తర భారతదేశంలో శిలగా మారిన శ్రీమహావిష్ణువు ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా?

ఉత్తర భారతదేశంలో శిలగా మారిన శ్రీమహావిష్ణువు ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

ఉత్తరాఖండ్ రాష్ట్రం లో, సముద్ర మట్టానికి 2620 అడుగుల ఎగువన, భగీరథి నది ఒడ్డున, ఉత్తర కాశీ కి 72 కి.మీ దూరం లో గల గ్రామం హర్శిల్. ఈ పేరు గురించి చిన్న పౌరాణిక కథ చెబుతారు.

సత్య యుగం లో నదీ దేవతలైన భగీరథి, జలంధరి లు తమ ఇద్దరి లో ఎవరు ప్రాముఖ్యమైనవారు అనే విషయం మీద వాదులాడుకుంటూంటే, అది చూసిన విష్ణువు (విష్ణువు కే మరో పేరు "హరి") ఒక శిల గా మారిపోయి, వారి ఆగ్రహాన్నంతటినీ ఆ శిల లోకి తీసుకున్నాడట.

అందువల్లే ఈ గ్రామానికి "హరిశిల" లేక "హర్శిల్" అనే పేరు వచ్చిందట. చార్ ధాం అనబడే నాలుగు ప్రముఖ హిందూ యాత్రాకేంద్రాల్లో ఒకటైన గంగోత్రి కి ఈ గ్రామం సమీపం లో ఉంది. దీనికి 30 కి.మీ దూరం లో ఉన్న గంగోత్రి జాతీయ పార్క్ ఇక్కడి మరొక ముఖ్య పర్యాటక కేంద్రం.

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

ధరలి

ధరలి అనే గ్రామం హర్శిల్ కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో కలదు. చుట్టూ దేవదారు వృక్షాలతో నిండిన ఈ స్ధలం పవిత్ర గంగా నది ఒడ్డున కలదు. మంచుతో కూడిన శిఖరాలు, యాపిల్ తోటలు, చిక్కుడు పంటలు మొదలైనవి సందర్శకులను అలరిస్తాయి.

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

ధరలి లో కేదార్నాథ్ గుడిని పోలిన ప్రాచీన శివాలయం కలదు. గంగోత్రి కి వెళ్లే మార్గంలో ఉంది కనుక భక్తులు వస్తుంటారు. ముకిమత్ గుడి, గంగ్నానీ, చిర్బాస, వాసుకీ తాల్ మొదలైనవి ఇక్కడి ఇతర ఆకర్షణలుగా ఉన్నాయి.

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

ముఖ్బా గ్రామం

ముఖ్బా గ్రామాన్ని ముఖ్వాస్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం హిందువుల పవిత్ర స్థలంగా భావించబడుతున్నది. ఇక్కడ హిందూ నదీ దేవత గంగోత్రి పూజించబడుతున్నది.

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

చలికాలంలో గంగోత్రి, మంచుతో కప్పబడి గుడికి వెల్ళటానికి వీలుపడదు. అందుకే గంగమ్మ ను గంగోత్రి నుండి ఇక్కడికి(ముఖ్బా గ్రామానికి) తీసుకొని వచ్చి పూజలు చేస్తారు. చలికాలం అయిపోయిన మరుక్షణం తిరిగి నదీ దేవతను యధా స్థానంలో ఉంచుతారు.

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

గంగోత్రి జాతీయ పార్క్

హర్శిల్ లో చూడదగ్గ మరో పర్యాటక ఆకర్షణ గంగోత్రి నేషనల్ పార్క్. ఇది హర్శిల్ కు 30 కిలోమీటర్ల దూరంలో కలదు. దాదాపు 1553 చ. కి. మీ ల విస్తీర్ణాన్ని ఆక్రమించిన పార్క్ లో 15 రకాల జంతువులు, 100 కు పైగా వివిధ రకాల పక్షులు ఉన్నాయి.

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

అరుదైన మంచు చిరుతలు, జింకలు, ఎలుగు బంట్లు, బార్బెట్ అనబడే అరుదైన హిమాలయన్ పక్షులు , సెరోస్ అనబడే మేకను పోలిన హిమాలయన్ జంతువు, కాక్లోస్, కపింజలము మరియు పారకీట్ చిలుక మొదలైనవి చూడవచ్చు.

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

హర్షిల్ లో చూడవలసిన అద్భుతాలు

హర్శిల్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

ఉత్తరకాశీ, డెహ్రాడూన్, రిషికేష్, బర్కోట్, న్యూ టెహ్రి లాంటి ప్రదేశాల నుండి హర్శిల్ కు బస్సు సౌకర్యం కలదు.

రైలు మార్గం

హర్శిల్ కు 239 కిలోమీటర్ల దూరంలో రిషికేష్ రైల్వే స్టేషన్ కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ఇక్కడికి చేరుకోవచ్చు.

విమాన మార్గం

హర్శిల్ కు 253 కిలోమీటర్ల దూరంలో డెహ్రా డూన్ విమానాశ్రయం కలదు. ఇది ఢిల్లీ ఎయిర్ పోర్ట్ తో అనుసంధానించబడినది. క్యాబ్ లేదా టాక్సీ లలో హర్శిల్ చేరుకోవచ్చు.