Search
  • Follow NativePlanet
Share
» »లామాల పండగ ' హేమిస్' !

లామాల పండగ ' హేమిస్' !

By Mohammad

భారతదేశంలో ఉన్న పురాతన మతాలలో బౌద్ధ మతం ఒకటి. వీరి యొక్క మత కేంద్రాన్ని 'మొనాస్టరీ' అంటారు. ఇవి బౌద్ధ మాత సంస్కృతిని, అలాగే వారి జీవన విధానాలను ప్రతిబింబిస్తాయి. మొనాస్టరీ లు హిమాలయా పర్వతశ్రేణుల పరివాహ ప్రాంతాలలో ఎక్కవగా కనిపిస్తుంటాయి.

బౌద్ధ మతాన్ని ఆచరించే వారు సన్యాసులు. వీరిని 'బౌద్ధ సన్యాసులు' అంటారు. వీరికంటూ ప్రత్యేకంగా పండగలు అంటూ ఉండవు. సన్యాసులు కదా !! అంతగా పాల్గొన్నారు. ఎప్పుడూ ధ్యానం, పీటకాలు ఇవే వారి దినచర్య.

హేమిస్ మొనాస్టరీ

హేమిస్ మొనాస్టరీ

చిత్ర కృప : Isen Majennt

చాలా మంది టిబెట్ బౌద్ధ మతస్థులు మన దేశంలో మొనాస్టరీ స్థాపించారు. వాటిలో చెప్పుకోదగ్గది హేమిస్ మొనాస్టరీ. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి పండగ జరుగుతుంది. ఈ పండగలో పాల్గొనటానికి టిబెట్ బౌద్ధ గురువులు, సన్యాసులు వస్తుంటారు.

ఇది కూడా చదవండి : ఇండియాలోని 5 ప్రసిద్ధ బౌద్ధ ఆరామాలు !

హేమిస్ జమ్మూ రాష్ట్రంలోని లేహ్ ప్రాంతానికి సమీపంలో కలదు. ఇక్కడున్న ఆశ్రమం లేదా గొంప చాలా పాచూర్యం చెందినది. ఈ హేమిస్ మొనాస్టరీ చుట్టూ ఎన్నో మందిరాలు ఉన్నాయి.

హేమిస్ పండగ

హేమిస్ పండగ

చిత్ర కృప : Sangyi drolma

హేమిస్ మొనాస్టరీ ఆశ్రమంలో ఉన్న ప్రధాన ఆకర్షణ బుద్ధుని తామ్ర విగ్రహం. ఇక్కడ కాలచక్ర, లార్డ్ ఆఫ్ ఫోర్ క్వార్టర్స్ ; కి సంబంధించిన అందమైన చిత్ర లేఖనాలు ఆశ్రమం యొక్క గోడలపై గమనించవచ్చు. సింహ గర్జన గా పేరొందిన టిబెట్ బౌద్ధ గురువు పద్మసంభవ గౌరవార్థం బౌద్ధ సన్యాసులు జూన్/జులై నెలల మధ్యలో వేడుకను నిర్వహిస్తారు. దీనిని 'హేమిస్ పండగ' అంటారు.

ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు డిక్లేర్ చేస్తుంది. ఇది రెండు రోజుల వేడుక. టిబెటన్ల క్యాలెండర్ ప్రకారం లూనార్ నెలలో 10 వ రోజును మరియు టిబెట్ బౌద్ధ మత స్థాపకుడు పద్మసంభవ జయంతిని పురస్కరించుకొని హేమిస్ పండగ జరుపుకుంటారు.

సంప్రదాయ దుస్తులలో స్థానికులు

సంప్రదాయ దుస్తులలో స్థానికులు

చిత్ర కృప : Tama

ఈ పండగ రోజున స్థానికులు పురాత సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. మగవాళ్ళు, ఆడవాళ్లు ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆడవాళ్లు నెత్తిన రింగులు, ఆభరణాలు ధరిస్తారు. మగవాళ్ళు నడుము వద్ద కండువా వంటిది ధరిస్తారు. కొమ్ములు,డప్పులు, డ్రమ్ములు వాయిస్తూ ఉంటే .. లామా లు పవిత్ర మాస్క్ లు ధరించి నృత్యం చేస్తారు. దీనిని 'చామ్' అని అంటారు.

చామ్ నృత్యం

చామ్ నృత్యం

చిత్ర కృప : JPhilipson

ఈ వేడుకలలో మాస్క్ ధరించి నృత్యం చేయటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మాస్క్ డాన్స్ చేసే వారిని చామ్స్ అని పిలుస్తారు. తాంత్రిక ప్రక్రియలతో కూడిన వజ్రయానం బోదించేటప్పుడు మాత్రమే వీరు ఆ నృత్యాన్ని ఆడతారు.

గ్యాంబ్లింగ్ ఆడుతున్న యువకులు

గ్యాంబ్లింగ్ ఆడుతున్న యువకులు

చిత్ర కృప : Kirsten

హేమిస్ లో చూడవలసిన మరో ప్రధాన ఆకర్షణ ఇండుస్ నదీ తీరంలో ఉన్న హేమిస్ నేషనల్ పార్క్. ఈ ప్రాంతం హేమిస్ హై ఆల్టిట్యుడ్ నేషనల్ పార్క్ గా ప్రసిద్ధి చెందినది. ఈ పార్క్ సముద్ర మట్టానికి 3300 - 6000 మీటర్ల ఎత్తున ఉంటుంది. డీర్, స్నో లెపర్డ్, రాబందులు, గబ్బిలాలు, ఎలుగుబంట్లు మొదలైనవి చూడవచ్చు.

హేమిస్ ఎలా చేరుకోవచ్చు ?

హేమిస్ చేరుకోవటానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

బస్సు ద్వారా : లేహ్ నుండి హేమిస్ 40 కమ్ ల దూరంలో ఉన్నది. ప్రయాణ సమయం గంట పడుతుంది. జమ్మూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఇక్కడకి ప్రతిరోజూ నడుస్తాయి. 30 - 50 రూపాయల వరకు టికెట్ ధర ఉంటుంది.

రైలు ద్వారా : హేమిస్ కు 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్ సమీప రైల్వే స్టేషన్. ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి. శ్రీనగర్ నుండి లేహ్ కు బస్సులలో, క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించవచ్చు.

విమానం ద్వారా : లేహ్ లో విమానాశ్రయం కలదు. ఇది హేమిస్ కు 44 KM ల దూరంలో ఉన్నది. శ్రీనగర్, ఢిల్లీ, షిమ్లా, పుణె లతో ఈ విమానాశ్రయం అనుసంధానించబడినది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X