Search
  • Follow NativePlanet
Share
» »భిన్నమైన అనుభూతిని అందించే చారిత్రక గుహలు

భిన్నమైన అనుభూతిని అందించే చారిత్రక గుహలు

భిన్నమైన అనుభూతిని అందించే చారిత్రక గుహలు

మ‌న దేశంలోని ప్ర‌కృతి అందం విషయానికి వస్తే, మంచుతో కప్పబడిన పర్వతాల నుండి స్మారక చిహ్నాలు చారిత్ర‌క నిర్మాణాల‌ దృశ్యాల వరకు నెల‌వైన నేల‌గా పేరుగాంచింది. ఇది కాకుండా, భారతదేశ సంస్కృతి, నాగరికత కూడా దేశ‌విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. భారతదేశంలో అందమైన పర్వతాలు.. జలపాతాలు మాత్రమే కాకుండా, చాలా పురాతనమైన గుహలు కూడా ఉన్నాయి. ఈ గుహలను చూడటం జీవితంలో మ‌ర్చిపోలేని ఆనందాన్ని కలిగిస్తుంది. మ‌న దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని కొన్ని అత్యుత్తమ చారిత్ర‌క‌ గుహలను గురించి తెలుసుకోవాలి.

భారతదేశంలోని పురాతన గుహల గురించి మాట్లాడుకుంటే, ఎక్కువ‌మంది అజంతా మరియు ఎల్లోరా గుహలు లేదా ముంబైలో ప్ర‌ఖ్యాత‌గాంచిన‌ ఎలిఫెంటా గుహల గురించి మాత్రమే మాట్లాడతారు. అయితే, భారతదేశంలో ఒడిశా నుండి మధ్యప్రదేశ్ వరకు అనేక చారిత్రాత్మకంగా అందమైన గుహలు ఉన్నాయి. కొన్నింటిలో చక్కటి రాతి శిల్పాలు మ‌రికొన్నింటిలో స్టాలగ్మిట్‌లు మరియు స్టాలక్టైట్స్ ఉన్నాయి.

ఇలాంటి గుహలలో చాలా వరకు ఆ కాలంలోని వివిధ రకాల అత్యుత్తమ వాస్తుశిల్పానికి ఉదాహరణ‌లుగా నిలుస్తాయి. కొన్ని బౌద్ధ జీవితం మరియు బోధనలను కూడా వర్ణిస్తాయి. ఈ గుహలను సందర్శించడం ద్వారా, మ‌నం భారతదేశ వారసత్వం గురించి మరింత మెరుగ్గా మరియు దగ్గరగా తెలుసుకోగలుగుతాం.

అజంతా మరియు ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర

అజంతా మరియు ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర

మహారాష్ట్రలోని జల్గావ్ నగరంలో ఉన్న అజంతా మరియు ఎల్లోరా గుహల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ గుహలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప‌ర్యాట‌కులు వస్తుంటారు. రాక్-కట్ గుహలలో పురాతన మతపరమైన చిత్రాలు మరియు శిల్పాలు ఉన్నాయి.

ఎల్లోరాలో 6వ మరియు 11వ శతాబ్దాల నాటి 34 గుహలు ఉన్నాయి. అలాగే, అజంతాలో 29 గుహలు ఉన్నాయి. ఇవి 2 వ శతాబ్దం నుంచి 6 వ శతాబ్దం నాటివి. అజంతా గుహలు బౌద్ధమతానికి అంకితం కాగా ఎల్లోరా గుహలు బౌద్ధమతం, హిందూమతం మరియు జైనమతాల స‌మ్మేళ‌నాన్ని సూచిస్తాయి.

భింబేట్కా గుహలు, మధ్యప్రదేశ్

భింబేట్కా గుహలు, మధ్యప్రదేశ్

భీంబేట్కా గుహలు మధ్యప్రదేశ్‌లోని రతపాని వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఉన్నాయి. ఈ గుహలు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఈ గుహలు మానవజాతి పురాతన కళాఖండాలకు నిల‌యంగా ద‌ర్శ‌న‌మిస్తాయి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఇక్క‌డే ఆశ్రయం పొందారని ఒక నమ్మకం ఉంది. దీని కారణంగా ఇది భారతదేశంలోని ముఖ్యమైన గుహలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

మౌసమై గుహలు, మేఘాలయ

మౌసమై గుహలు, మేఘాలయ

మేఘాలయలోని చిరపుంజిలో ఉన్న మౌసమై గుహలు దేశంలోని ఇతర గుహల కంటే అనేక విష‌యాల‌లో విభిన్నంగా ఉంటాయి. భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశానికి సమీపంలో ఉన్న మౌసమై గుహలు అనేక భారీ గదులు మరియు మార్గాలతో కూడిన అందమైన సున్నపురాయి నిర్మాణాలుగా ఆహ్లాదాన్ని పంచుతాయి. చీకటిగా ఉండే ఇతర భారతీయ గుహల మాదిరిగా కాకుండా, ఈ గుహలు పూర్తి వెలుతురుతో వెలిగిపోతాయి. పర్యాటకులు అన్వేషించడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. గుహ లోపల అందమైన స్టాలక్టైట్ మరియు స్టాలగ్మైట్ నిర్మాణాలను చూసే అవకాశం మీకు లభిస్తుంది.

బాగ్ గుహలు, మధ్యప్రదేశ్

బాగ్ గుహలు, మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల్ శ్రేణులలో బఘని నది ఒడ్డున ఉన్న బాగ్ గుహలు తొమ్మిది రాతి నిర్మాణాల సమూహం. ఈ గుహలు పురాతన చిత్రాలకు ప్రసిద్ధి చెందాయి. సంద‌ర్శ‌కులు బాగ్ గుహలను రంగ్ మహల్ అని కూడా పిలుస్తారు. ఈ రాక్-కట్ గుహలు ప్రాచీన భారతీయ కళకు అత్యుత్తమ ఉదాహరణలు. ఈ గుహలు 4వ శతాబ్దం చివరి నుండి క్రీస్తుశకం 6వ శతాబ్దం వరకు బౌద్ధులు నిర్మించినట్లు భావిస్తున్నారు.

బాదామి గుహలు, కర్ణాటక

బాదామి గుహలు, కర్ణాటక

కర్నాటకలోని బాదామి గుహలలో నాలుగు గుహలు ఉన్నాయి. అందులో రెండు విష్ణువుకు అంకితం చేయబడ్డాయి, ఒకటి శివునికి మరియు మరొకటి జైనులకు అంకితం చేయబడ్డాయి. కొండపై ఎర్ర ఇసుకరాయితో తయారు చేయబడిన బాదామి గుహలు భారతీయ రాక్-కట్ ఆర్కిటెక్చర్ యొక్క అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటి. ఈ భారతీయ గుహలు క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందినవని నమ్ముతారు.

Read more about: maharashtra madhya pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X