• Follow NativePlanet
Share
» »గ్వాలియర్ కోట యొక్క ఐతిహాసిక అందం : ఒక్కసారైనా చూసితీరాల్సిన ప్రదేశం

గ్వాలియర్ కోట యొక్క ఐతిహాసిక అందం : ఒక్కసారైనా చూసితీరాల్సిన ప్రదేశం

కోట అంటే సామాన్యంగా అందరికీ ఇష్టమవుతుంది. కోటలలో ముఖ్యంగా ప్రసిద్ధి గాంచిన కోటలను చాడాలి అనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది. అటువంటి కోటలలో ముఖ్యమైనది గ్వాలియర్ కోట.

గ్వాలియర్ 8 వ శతాబ్దంలోని అతి ప్రాచీనమైన కోట. ఈ కోట లోపల అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ కోట ఒక చారిత్రాత్మక కోట. చాలామంది రాజులు ఈ కోటను పరిపాలించారు.
ఇటువంటి ప్రసిద్ధమైన కోట వుండేది మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లోని గ్వాలియర్ కోట ఇదే.

ప్రస్తుత వ్యాసం మూలంగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్వాలియర్ కోట గురించి మాకు తెలుసుకుందాం.

1. సూరజ్ సేన్

1. సూరజ్ సేన్

సూరజ్ సేన్ అనే రాజు భయంకరమైన రోగమైన కుష్ఠురోగం వల్ల అతను బాధపడుతుండెను. ఒకసారి ఈ కోట సమీపంలోని "సన్ ట్యాంక్" లోని నీటిని త్రాగెను. ఆ నీటిని త్రాగిన అనంతరం సూరజ్ సేన్ సంపూర్ణంగా స్వస్థత పొందాడు.

PC:DAN

2. కోట యొక్క సౌందర్యం

2. కోట యొక్క సౌందర్యం

కోట అత్యంత సుందరంగా వుంటుంది. ఇంతైతే ఈ రాజులు పాలించిన కోట కాదా? ఈ కోట చుట్టూ సుమారు 15 మీటర్ల ఎత్తు గోడలు మరియు మానవ నిర్మిత శిలలు ఇక్కడ చూడవచ్చును.

PC:Varun Shiv Kapur

3.ఏముంది?

3.ఏముంది?

గ్వాలియర్ కోటలో చూడాల్సినది కావాల్సినంత వుంది. కోట యొక్క ఎడమ వైపు పురావస్తు మ్యూజియం, మ్యూజియం, మొఘల్ పాలనలో సంగీత ప్రదర్శనల కోసం అంకితం చేయబడిన నీటి ఫౌంటేన్ వుంది.

PC:DAN

4. రాజులు

4. రాజులు

ఈ కోటను అనేక ప్రసిద్ధ రాజులు పరిపాలించారు. వీరందరూ కళాపోషకులే. ఇక్కడి వస్తు సంగ్రహాలయం చాలా అందంగా వుంటుంది. ఈ వస్తు సంగ్రహాలయంలో 2 ఆసక్తికరమైన ఫలకాలను చూడవచ్చును.

PC:DAN

5. శాసనం

5. శాసనం

ఈ వస్తు సంగ్రహాలయంలో హిందూమతం యొక్క దేవత మహావిష్ణు అవతారం అదేవిధంగా జైన తీర్ధంకరుల గురించిన శాసనాలు ఆ ఫలకాలలో చూడవచ్చును.
ఇక్కడ విభిన్నరకాలైన మహావిష్ణుని విగ్రహాలను చూడవచ్చును.

PC:Tom Maloney

6. 8వ శతాబ్దం

6. 8వ శతాబ్దం

ఈ గ్వాలియర్ కోట యొక్క ఇతిహాసానికొస్తే, ఈ కోటను సుమారు 8 వ శతాబ్దంలో నిర్మించబడినది. ఇది ఒక పెద్ద వైవిధ్యమైన మరియు సాంస్కృతిక పరంపరను కలిగివున్న సామ్రాజ్యమై వుంది.

PC:Tom Maloney

7. పాలన

7. పాలన

ఈ ఐతిహాస కోటను అనేకమంది రాజ కుటుంబాల వారు,అలాగే బ్రిటీష్ వారు కూడా ఈ ప్రదేశాన్ని పరిపాలించారు. అదేవిధంగా నగరంలో అనేక ప్రదేశాల్లో అందమైన భవనాలు నిర్మించారు. విశేషమేమంటే మొఘల్ చక్రవర్తియైన బాబర్ ఈ కోటను గురించి శాసనాలలో పేర్కొన్నాడు. అదేమిటంటే " హిందూ కోటలు అనే హారంలో ముత్యం" అని వర్ణించినాడు. ప్రత్యేకమైన ప్రస్తావన మొఘల్ చక్రవర్తి బాబర్ ఆ కోటను పేర్కొన్నారు.

PC:Varun Shiv Kapur

8. ప్యాలెస్

8. ప్యాలెస్

గ్వాలియర్ కోట లోపలిభాగంలో మ్యాన్ మందిర్, ప్యాలెస్ అదేవిధంగా రెండవ ఉప రాజప్రాసాదాలు చూడవచ్చును.ఈ కోట యొక్క మొదటి భాగాన్ని మొదటి టోమర్స్ పరిపాలనలో
నిర్మించినారు. 2 వ భాగంలో మ్యూజియంలు మరియు ప్యాలెస్లు వున్నాయి.

PC:DAN

9. హిందూ రాజ్

9. హిందూ రాజ్

1556 లో ఆగ్రా మరియు ఢిల్లీలో అక్బర్ సైన్యం యొక్క ఓటమి తరువాత, హిందూ భారతదేశంలో "హిందూ రాజ్" అయిన హెన్ విక్రమానదిత్య (హేము) చేత స్థాపించబడింది. న్యూఢిల్లీ ఖిలాలో 15 అక్టోబర్ న అతని పట్టాభిషేకం జరిగింది.

PC:Varun Shiv Kapur

10. గ్వాలియర్ లో విశేషం

10. గ్వాలియర్ లో విశేషం

గ్వాలియర్ పర్యాటక ప్రదేశం చాలా అందంగా వుంటుంది మరియు పర్యాటకులను ఆకర్షించే శక్తి కలిగి ఉంది. గ్వాలియర్ కోట, పూల్ బాగ్, సూరజ్ కుండా, హతి పూలా, మన్మందిరా ప్యాలెస్ మరియు జే విలాస్ మహల్ అదేవిధంగా అనేక ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చును.

PC:swifant

 11. సందర్శించడానికి ఉత్తమ సమయం

11. సందర్శించడానికి ఉత్తమ సమయం

గ్వాలియర్ కోట సంవత్సరం పొడవునా తెరచి ఉంటుంది. ఇది ఒక చారిత్రక కోట మరియు ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఈ అందమైన కోటకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తారు.

PC:Varun Shiv Kapur

12. ప్రవేశ సమయం

12. ప్రవేశ సమయం

ఉదయం 8 నుండి 5:30 వరకు సందర్శకులకు ఇది అందుబాటులో ఉంటుంది.

PC:carol mitchell

13. ప్రవేశ రుసుము

13. ప్రవేశ రుసుము

గ్వాలియర్ కోట ప్రవేశానికి ప్రత్యేక ప్రవేశ రుసుము ఉంది. పెద్దలకు రూ. 75, పిల్లలకు రూ. 40 మరియు విదేశీయులకు రూ. 250 ప్రవేశ రుసుము చెల్లించవలసి వుంటుంది.

PC:carol mitchell

14. సమీప విమానాశ్రయం

14. సమీప విమానాశ్రయం

ఈ గ్వాలియర్ అనే అందమైన కోటకు ఒక్కసారి వెళ్ళగలిగే సమీప విమానాశ్రయం అది గ్వాలియర్. ఇది సమీప విమానాశ్రయం. ఇది గ్వాలియర్ నగరం నుంచి నేరుగా విమానాశ్రయం వుండుట చేత ఇక్కడి నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున గ్వాలియర్ కోటకు సులభంగా చేరుకోవచ్చును.

15. సమీపంలోని రైల్వే స్టేషన్

15. సమీపంలోని రైల్వే స్టేషన్

రైలు మార్గం ద్వారా గ్వాలియర్ కోటకి చేరుకోవడానికి సమీపంలోని రైల్వే స్టేషన్ ఏదంటే అది గ్వాలియర్ రైల్వే స్టేషన్. ఈ రైలు అనేక ప్రసిద్ధ నగరాలను దాటుకుంటూ వస్తుంది. గ్వాలియర్ హిస్టారిక్ ఫోర్ట్ ఈ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి