Search
  • Follow NativePlanet
Share
» »చారిత్ర‌క సాక్ష్యాలు.. హంపి న‌గ‌ర వీధులు!

చారిత్ర‌క సాక్ష్యాలు.. హంపి న‌గ‌ర వీధులు!

చారిత్ర‌క సాక్ష్యాలు.. హంపి న‌గ‌ర వీధులు!

చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న ప్రదేశాలలో అడుగుపెట్టాల‌ని భావించే సంద‌ర్శ‌కుల‌కు హంపి ఆల‌యాల ప‌ర్య‌ట‌న‌ మంచి ఎంపికగా చెప్పొచ్చు. ప‌చ్చ‌ని ప‌రిస‌రాల మ‌ధ్య వెల‌సిన ఈ ప్ర‌దేశం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. విజయనగర సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన నగరం హంపి. 14వ శతాబ్ధంలో వెలిసిన విజయనగర రాజ్యానికి రాజధాని హంపి నగరం. ఇక్క‌డి విశాల వీధులు, పెద్ద పెద్ద ప్రాకారాల శిధిలాలు అప్ప‌టి న‌గ‌ర నిర్మాణ చాతుర్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తాయి. మ‌రెందుకు ఆల‌స్యం ఆ చారిత్ర న‌గ‌ర విశేషాల‌ను తెలుసుకుందాం రండి!

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కేంద్రానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హంపి. ఓ వైపు తుంగభద్ర నది, మిగతా మూడు వైపులా ఆనాటి చరిత్రకు శిధిల సాక్ష్యాలుగా మిగిలిన కట్టడాలు, గ్రానైటు శిలలు ఉంటాయి. ఇక్క‌డి చారిత్ర‌క విశేషాల‌ను మ‌న‌సారా ఆస్వాదించాలంటే క‌నీసం నాలుగైదు రోజులైనా ప‌డుతుంది అంటారు. హంపి చాలా వేడిగా ఉండే ప్రాంతం. హంపి టెంపుల్ చుట్టూ రాతి కట్టడాలు ఎక్కువగా ఉంటాయి కనుక వేసవిలో వెళితే ఆ వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. కనుక అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలోపు హంపికి వెళ్లడం ఉత్తమం.

పుస్తకాలలో ప్రస్తావ‌న‌..

పుస్తకాలలో ప్రస్తావ‌న‌..

హంపిలోని నిర్మాణ సౌంద‌ర్యాన్ని ఆ కాలంలో ఎంతో మంది పర్షియన్, పోర్చుగీస్, యూరోపియన్ పర్యాటకులు హంపి గురించి తాము రాసిన పుస్తకాలలో ప్రస్తావించారు. తుంగభద్ర నది పక్కన సిరిసంపదలతో, నిర్మాణ కౌశలాన్ని తెలిపే కట్టడాలతో, ప్రకృతి అందాలతో రమణీయంగా వెలిగిన నగరంగా హంపిని వారు వర్ణించారు. ఇప్పుడు హంపి ఆనాటి చారిత్రక కట్టడాలకు సాక్ష్యంగా ఉంది. అందుకే అంటారు.. చరిత్రను ఇష్టపడేవారు కచ్చితంగా సందర్శించాల్సిన నగరం హంపి.

యాభై మీటర్ల ఎత్తుతో గాలిగోపురం

యాభై మీటర్ల ఎత్తుతో గాలిగోపురం

విశాల‌మైన వీధిలో పూర్తి రాతి నిర్మిత‌మైన విరూపాక్ష దేవాలయం సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. యాభై మీటర్ల ఎత్తుతో ఉన్న గాలిగోపురం విరూపాక్ష దేవాలయం ప్రత్యేకత. నిజానికి, ఈ దేవాలయాలు విజయనగరసామ్రాజ్యం కన్నా ముందు నుంచే ఉన్నాయని చెబుతారు. ఇవి 10 నుంచి 12వ శతాబ్ధానికి చెందినవై ఉంటాయరి చరిత్రకారుల అంచనా.

అనెగొంది గ్రామానికి దగ్గర్లో ఉంటుంది విఠలదేవాలయం. విఠలుడంటే విష్ణుమూర్తి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించినట్టు చెబుతారు.ఈ గుడిలో సప్తస్వరాలు పలికే ఏడు సంగీత స్థంభాలు ఉన్నాయి. విఠల దేవాలయంలోనే ఏకశిలారథం కొలువుదీరి ఉంటుంది. కేవలం ఒకే శిలతో ఈ అద్భుత శిలను చెక్కారు. దీనికి కదిలే చక్రాలు ఉండడం విశేషం.

అధ‌న‌పు ఆక‌ర్ష‌ణ హిప్పీ ఐలాండ్

అధ‌న‌పు ఆక‌ర్ష‌ణ హిప్పీ ఐలాండ్

హంపి గ్రామం పక్కనే హిప్పీ ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్ కు గ్రామానికి మధ్యలో చిన్న ఏరు ఉంటుంది. దాన్ని తెప్పతో లేదా పడవలో దాలి వెళ్లచ్చు. హిప్పీ ఐలాండ్ లోనే అధికంగా విదేశీయులు వసతి తీసుకుంటారు. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు, ఆహారాలు దొరుకుతాయి. చూడటానికి చాలా బావుంటుంది. అంతేకాదు, హంపి ప‌రిస‌ర ప్రాంతాల్లో నాన్‌వెజ్ ఆహారం దొర‌క‌దు. అందుకోసం హిప్పీ ఐలాండ్‌కు వెళ్లాల్సిందే. అందుకే, దూర ప్రాంతాల‌నుంచి హంపికి వ‌చ్చే ప‌ర్యాట‌కులు ఇక్క‌డ వాలిపోతూ ఉంటారు.

హంపి ఎలా చేరుకోవాలి?

హంపి ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గంలో హైదారాబాద్ నుంచి 385 కిలోమీటర్ల దూరంలో ఉంది హంపి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా హంపి చేరుకోవచ్చు. లేదా హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బళ్లారి అక్కడి నుంచి హంపి వెళ్లచ్చు. అదే రైలు మార్గంలో హంపిని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి హోస్పేట్ జంక్షన్ వరకు టికెట్ బుక్ చేసుకోవాలి. హోస్పేట్ నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది హంపి.

Read more about: hampi karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X