» »హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్టు మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్టు మానవాకృతి : ఆశ్చర్యం

మన దేశంలో పురాతన దేవాలయాలు అనేకం వున్నాయి.ఆ కాలంలోని రాజులు నిర్మించిన ప్రతిఒక్క కట్టడం దేవాలయాలన్నీ విశిష్టతకలిగినదిగా నిర్మించటంజరిగింది. అదేవిధంగా ఆ దేవాలయాలు ఇప్పటికి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.వాటిలో హోయసలేశ్వర దేవాలయం ఒకటి.

ఈ దేవాలయంలోని శిల్పకళ అత్యంత అద్భుతమైనది. ఆ శిల్పకళను చూసిన పర్యాటకులు తమను తాము మైమరచిపోతారు.ఈ దేవాలయంలోని ఒక శిల్పంలో ఈజిప్ట్ మానవుని రూపంలో వున్న ఒక కళాకృతిని ఇక్కడ చూడవచ్చును.

ఇదేంటి ఆశ్చర్యంగా వుందే హోయసలేశ్వరదేవాలయంలో ఈజిప్ట్ కి సంబంధించిన ఇన్ని కళాకృతులు వున్నాయా? అని ఆశ్చర్యపోతున్నారా?అయితే రండి ఆ చిత్రకళలను గురించి ఈ వ్యాసంద్వారా తెలుసుకుందాం.

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలరాజవంశీకులు సుమారు క్రీ.శ1000సంల నుంచి క్రీ.శ1346వరకు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఒకానొకప్పుడు హొయసల సామ్రాజ్యానికి రాజధానియైన హళేబీడులో అనేక దేవాలయాలు వున్న సంగతి సామాన్యంగా తెలిసిన సంగతే.ఈ అద్భుతమైన స్థలం హాసన్ జిల్లాలో వుంది.హలేబీడు ఇంతకుముందు దొరసముద్రం అని పిలిచేవారు.

PC:Karthikbs23

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హళేబీడు అనే పేరు వున్నాకూడా ఇక్కడి శిల్పకళలు మాత్రం ఎంతో నవీనమైనది అని చెప్పవచ్చును. ఇక్కడ ఎంతో అందమైన దేవాలయాలు కూడా వున్నాయి.అల్లావుద్దీన్, మల్లికాఫూర్ ఇంకా అనేక ముస్లిం ఆక్రమణదారుల నుండి మిగిలినవి మాత్రం ఈ హోయసలేశ్వరదేవాలయం ఒక్కటే. ఇక్కడి శిల్పకళలు ఎంతో అమోఘమైనవి.

PC:Calvinkrishy

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

ఇక్కడ ఒక శివాలయం వుంది.ఈ భవ్యమైన శివాలయాన్ని విష్ణువర్ధన లేదా దండనాయకకేతమల్ల 1121 లో కట్టించెరని కొన్ని శాసనాలఆధారం ప్రకారం చెప్పవచ్చును. విష్ణువర్ధనకాలంలో కళలు మరియు శిల్పకళలకు గొప్పప్రోత్సాహం వుండెను.ఇతని రాణి శాంతలే ప్రసిద్ధమైన భరతనాట్య నర్తకి అంతేకాకుండా ఈమెకు శిల్పకళలో ఆసక్తికలదని చెప్తారు.

PC:Bikashrd

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

ఈ కాలంలోనే హొయసల శిల్పకళ అత్యధిక స్థాయికి చేరుకుందని చెప్పబడింది. హలేబీడులోని హొయసలేశ్వర ఆలయ నిర్మాణం బాగా అభివృద్ధి చెందినది విష్ణువర్ధన చివరికాలంలో ఉంది. విష్ణువర్ధననుని అంత్యకాలంలో ఆరంభమైన దేవాలయం నిర్మాణకార్యం హోయసలల యొక్క చివరి పరిపాలకుడు విశ్వనాథ బల్లాళన కాలంవరకూ ముందుకాలంలో రచించిన శాసనాలనుంచి తెలుసుకొనవచ్చును.

PC:Anks.manuja

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

ఈ దేవాలయాన్ని బలపం రాయిగా చెప్పుకునబడే రాయితో నిర్మాణం గావించబడినది.దీనిని సోప్స్టోన్స్ లేదా స్టియోటిట్స్ అని పిలుస్తారు.ఈ విశేషమైన రాయివల్ల హోయసల దేవాలయంలో సూక్ష్మమైన చెక్కడాలు చెక్కటానికి సాధ్యమైనది.హోయసల రాజవంశం గురించి జనాలకు వున్న గౌరవ భావనలు ఈ దేవాలయం నిర్మాణానానికి కారణమైనదని చెప్పవచ్చును.

PC:Anks.manuja

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హోయసల వంశం పేరు అజరామరంగా ప్రసిద్ధిచెందాలనే వుద్దేశ్యంచేత పెద్దదైన దేవాలయాన్ని నిర్మించి శివుని విగ్రహాన్ని ప్రతిష్టింపచేసి ,హోయసల వంశం అనే పేరుపెట్టారు.హోయసల ప్రభువే హొయసలేశ్వర.

PC:Ms Sarah Welch

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

ఈ దేవాలయ నిర్మాణం సమయంలో సుమారు 20,000కన్నా ఎక్కువ శిల్పులు శ్రమించటం జరిగింది. హోయసల శిల్పులకున్న అదమ్య ప్రోత్సాహం హలేబీడులోని అద్భుతమైన దేవాలయాలను నిర్మాణంకావటానికి కారణం అని చెప్పవచ్చును. ఒక పురాణకథ ప్రకారం జక్కణాచార్య మరియు డక్కణాచార్య అనే ఇద్దరు శిల్పులు అని చెప్పవచ్చును.

PC:Ms Sarah Welch

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హోయసల శిల్పకళ ద్రావిడశైలి మరియు రెండు శైలులలో నిర్మించబడినట్లు తెలుస్తుంది.ఈ శైలిని వాసే లేదా హొయసాల శైలి అని కూడా అంటారు. వీరు నిర్మించిన అన్ని దేవాలయాలు నక్షత్రాకారంలో వుండటం విశేషం. వీరి చేత నిర్మించబడిన దేవాలయాలు నాలుగుభాగాలుగా విభజించబడివుంటుందని చెప్పవచ్చును.

PC:Ms Sarah Welch

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

అవి ఏవంటే మూల దేవతామూర్తి వుండే గర్భగుడి, శుకనాసి, నావరంగులను ఇక్కడ చూడవచ్చును. ఆశ్చర్యం ఏమంటే అక్కడవున్న శిల్పాలు ఈజిప్ట్ లోని మానవఆకృతిలో నిర్మించారనే అనుమానంరావటం సాధారణం.అవును ఇది నిజం.ఇక్కడ ప్రాచీన ఈజిప్ట్ మానవాకృతిని చూడవచ్చును.

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

ఈ అద్భుతదేవాలయంలో అనేక శిల్పకళలను చూడవచ్చును.అక్కడి శిల్పకళలకు దుస్తులు లేకపోవడం, ఆభరణాలు, సౌందర్యాత్మకమైన భంగిమలు కలిగిన దేవి-దేవతల శిల్పకళలను ఇక్కడ చూడవచ్చును.అనేక ఇతిహాసకులు ఇక్కడుండే కొన్ని శిల్పాలు ప్రాచీన ఈజిప్ట్ మానవాకృతిని పోలివున్నాయి.అయితే ఇందుకు ఎటువంటి ఆధారాలు లేవని చెప్తారు.

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

ఈ హోయసలేశ్వర దేవాలయంలోవున్న ఈ విభిన్నమైన శిల్పం ఒక పెద్ద కోట్ ను ధరించివుంది.అయితే ఎటువంటి ఆభరణాలను ధరించిలేదు.భారతీయ శిల్పాకృతులు వాటి కాళ్ళకు పాదరక్షలు ధరించివున్నాయి. అయితే ఈ విభిన్నమైన శిల్పానికి మాత్రం ఎటువంటి పాదరక్షలు ధరించిలేదు.ఇది ప్రాచీన ఈజిప్ట్ తరహాలో వేష-భూషణాలను ధరించివుంది.

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

ప్రాచీన ఈజిప్ట్ లాగే ఇక్కడకూడ తలకి ఒక విధమైన బట్టని దాని భుజాల మీద నుండి విడిచివుంది.ఇతిహాసం ప్రకారం భారతీయ శిల్పకళరచనకూ ఈజిప్ట్ లో శిల్పకళకూ ఏ విధమైన సంబంధం లేదని చెప్తారు.ఇదేకాదు బృహదీశ్వరదేవాలయంలో కూడా యురోపియన్ల కళాకృతులను చూడవచ్చును.

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

సామాన్యంగా మనలో మెదిలేప్రశ్న ఏమంటే ఈజిప్షియన్లు మన దేశానికి ఎందుకు వచ్చారు?వారు రావటానికి గల కారణం ఏమిటి? వారిని పోలిన శిల్పకళలు మన దేశంలోనికి ఎలా వచ్చాయి?అనే అనేకమైన ప్రశ్నలకు సమాధానంను చరిత్రకారులే చెప్పాలి.

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

హొయసలేశ్వర దేవాలయంలో ఈజిప్షియన్ మానవాకృతి : ఆశ్చర్యం

ఎలా వెళ్ళాలి?

బెంగుళూరునుండి హోయసలేశ్వర దేవాలయానికి సుమారు 221కిమీ దూరంవుంది.ఇక్కడికి వెళ్ళటానికి 3గంటల 45నిమిషాలకాలం పడుతుంది.ఈ ప్రదేశానికి వెళ్ళటానికి అనేక ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సుల సౌకర్యం వుంది. సమీపంలోని రైల్వే స్టేషన్ ఏదంటే అది హాసన్ రైల్వే స్టేషన్.ఇక్కడినుండి 30కిమీ ల దూరంలో హోయసలేశ్వరదేవాలయం వుంది. సమీపంలోని విమానాశ్రయం ఏదంటే అది మంగళూరు విమానాశ్రయం. ఇక్కడినుండి సుమారు 190కిమీ దూరంలో వుంది.క్యాబ్ లేదా బస్సుల ద్వారా సులభంగా ఈ ప్రదేశానికి చేరుకొనవచ్చును.

Please Wait while comments are loading...