Search
  • Follow NativePlanet
Share
» »వీకెండ్ సెలవులు ఆహ్లాదంగా గడపడానికి అనువైన ప్రదేశం భద్రాచలం

వీకెండ్ సెలవులు ఆహ్లాదంగా గడపడానికి అనువైన ప్రదేశం భద్రాచలం

By Venkata Karunasri Nalluru

నిజాముల పాలనలో తెలంగాణ మెదక్ మరియు వరంగల్ విభాగాలకు చెందిన ఒక విలీనప్రాంతం. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగమైనది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉనికిని సంపాదించింది. తెలంగాణకు రాజధానిగా "హైదరాబాద్" ను ఎన్నుకున్నారు.

తెలంగాణ భౌగోళిక సరిహద్దులు: మహారాష్ట్ర - ఉత్తరదిక్కున మరియు ఉత్తరం - పశ్చిమం, చత్తీస్‌ఘడ్ - ఉత్తరం-తూర్పున, కర్ణాటక - పడమర, ఒడిషా లేదా ఒరిస్సా - తూర్పున.

Hyderabad To Bhadrachalam A weekend Trip

ఈ రాష్ట్రమునకు తెలంగాణ అనే పేరు ఎలా వచ్చింది?

తెలంగాణ రాష్ట్రానికి "తెలంగాణ" అనే పేరు శివుడు లింగ రూపంలో 3 ప్రాంతాల్లో వెలిశాడని పురాణాలూ తెలుపుతున్నాయి. ఆ 3 ప్రాంతాలు 1. కాళేశ్వరం 2. శ్రీశైలం 3. ద్రాక్షారామం. ఈ మూడు ప్రదేశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని "త్రిలింగ ప్రదేశంగా" పేర్కొంటారు. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలని " తెలింగ ప్రజలు " అని అనేవారు. ఈ ప్రాంతంలో ప్రజలు వాడే భాషను " తెలింగ బాషా " అనిఅనేవారు. అయితే కాలక్రమేణా ఈ ప్రాంతాన్ని "తిలింగాణం" అని అన్నారు. ఈ పేరులో ఆణెము అనగా "దేశం ". ఈ తెలింగాణము అనే పేరు తరువాత తిలింగానా మరియు తెలంగాణగా మారిపోయింది. అయితే ఇటీవల మెదక్ జిల్లాలోని " తెల్లాపూర్ " గ్రామంలో దొరికిన పురాణం శాసనాలలో " తెలంగాణపురం " అనే పేరు వాడుకలో ఉన్నట్టుగా ప్రస్తావన వచ్చింది.

సంస్కృతి:

తెలంగాణలో వివిధ దేశ.విదేశీయ సంప్రదాయాలకు, సంస్కృతులకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. ఉదా:పర్షియన్ ల ప్రభావం,కాబట్టి ఇక్కడి ప్రజలు అనేక విధాలైన సంస్కృతి సంప్రదాయాలు కలిగివుంటారు. ఇక్కడ ఉత్తరభారతదేశములో జరుపుకొనే పండుగాలన్నీ ఇక్కడ జరుపుకొంటారు. తెలంగాణ భారతదేశమునకు దక్షిణదిక్కున గల రాష్ట్రం. అంతేకాకుండా శ్రీభాగవతంను తెలుగులో రచించిన పోతన, కవులు మరియు కళాకారులు ఇక్కడి వారే.

కొన్ని సంప్రదాయ పండుగలైన బోనాలు, బతుకమ్మ మరియు సమ్మక్కసారలమ్మ జాతర ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇతర ముఖ్య పండుగలైన దాశర, వినాయకచవితి, మరియు ఉగాది మొదలైన పండుగలు కూడా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

తెలంగాణరాష్ట్రపు ముఖ్యమైన వంటకాలు:

ప్రముఖమైన రెండు రకాల వంటకాలు - 1. తెలంగాణ వంటకాలు 2:హైదరాబాదీ వంటకాలు

తెలంగాణ వంటకాలు దక్షినభారతదేశానికి చెందిన వంటకాలు.ఇది చాలా కారంతో కూడుకొని వుంటాయి.

హైదరాబాదీ వంటకాలు మిశ్రమంగా ఉంటాయి. తెలుగు మరియు అరబ్, టర్కిష్ మరియు మొఘలాయి ఇతర వంటకాల సమ్మేళనం. హైదరాబాదీ దమ్ బిర్యానీ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన రుచికరమైన వంటకం.

తెలంగాణలో టూరిజం:

తెలంగాణ దక్షిణ భారతదేశంలో అత్యంతగా తరచూ సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఒకటి. హైదరాబాద్ లోని చార్మినార్, పాపీ హిల్స్ మరియు కుంతల జలపాతాలు ఆకర్షణలుగా ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని భద్రాచల ఆలయం, వేయిస్తంభాల గుడి, మరియు శ్రీరాజరాజేశ్వరి ఆలయం.

Hyderabad To Bhadrachalam A weekend Trip

Image source:www.wikipedia.org

చార్మినార్: చార్మినార్ 1591సంవత్సరంలో ముహమ్మద్ కులీ కుతుబ్ షాహి నిర్మించాడు, దీనికి హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ విశిష్టత ఉంది.

హైదరాబాద్ నుండి భద్రాచలం: హైదరాబాద్ నుండి భద్రాచలంకు 311కి.మీ. దూరం ఉంది. మరియు కారులో 6గం. ల ప్రయాణం పడుతుంది.

భద్రాచలం: భద్రాచలం తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉంది. ఇక్కడ పవిత్రమైన గోదావరి నది ప్రవహిస్తుంది. శ్రీరామచంద్రుడు, సీతమ్మతో కోలువైవున్నారు.

Hyderabad To Bhadrachalam A weekend Trip

భద్రాచలంను దర్శించుకోవలసిన మంచి సమయం: అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య సమయంలో . ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.

తెలంగాణరాష్ట్ర రావాణా సమాచారం:

భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి మరియు ఇతర దేశాల నుండి తెలంగాణ చేరుకోవడానికి వచ్చిన ప్రయాణికులు మరియు పర్యాటకుల కోసం వాహన సౌకర్యములకు అందుబాటులో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చారిత్రక నిర్మాణం వల్ల హైదరాబాద్ ప్రపంచ గుర్తింపు పొందింది. చార్మినార్ రెండు ఉర్దూ పదాల సమ్మేళనం. 'చార్' మరియు 'మినార్' అంటే అక్షరాలా నాలుగు టవర్లు అనే అర్ధం వస్తుంది. టవర్ నిర్మాణం అద్భుతంగా వుంది. పురాతన కాల నిర్మాణ వైభవంను గుర్తుకువచ్చేలా చేస్తుంది. చార్మినార్ ను "కులీకుతుబ్ షా" నిర్మించారు. చార్మినార్ ప్రతి సంవత్సరం వేల మంది పర్యాటకులని ఆకర్షిస్తుంది.

హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రంలోనే ఒక ప్రధానమైనది. తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణించుటకు రైల్వేలు, రహదారులు ఎంతగానో దోహదం చేస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X