Search
  • Follow NativePlanet
Share
» »అమ్మాయిలూ వయసొచ్చినా ‘ఆ’ ముచ్చట తీరలేదా మీ కోసమే ‘నవకన్యల’ ఆలయం

అమ్మాయిలూ వయసొచ్చినా ‘ఆ’ ముచ్చట తీరలేదా మీ కోసమే ‘నవకన్యల’ ఆలయం

కుంభకోణంలోని కాశీవిశ్వేశ్వరాలయంలోని నవ కన్యల ఉపలయం గురించి కథనం.

By Kishore

భారత దేశంలోని ఒక్కొక్క ఆలయానిది ఒక్కొక్క విశిష్టత. కొన్ని పురాణ ప్రాధాన్యత కలిగి ఉంటే మరొకొన్ని భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారాలు. అయితే కొన్ని మాత్రమే అటు పురాణ ప్రాధాన్యతతోపాటు భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ వారి విశ్వాసాన్ని చూరుగొంటున్నాయి. దీంతో రోజురోజుకు ఆ దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అటు వంటి కోవకు చెందినదే ఈ కథనంలోని దేవాలయం.

ఈ దేవాలయంలోని నవకన్యలను వివాహ కాక ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు పూజిస్తే త్వరగా వివాహ అవుతుందని నమ్ముతారు. వీరే కాక వివాహ సమస్యలతో బాధపడుతున్న యువకులు కూడా ఇక్కడికి వెళితే ప్రయోజనం ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా 16 శుక్రవారాలు ఈ నమకన్యలను ఉపవాసంతో పూజిస్తే వారి కోరిక తప్పక నెవరేరుతుందని చెబుతారు.

ఇక్కడే శ్రీరామచంద్రుడుకి ఉగ్ర తత్వం కూడా అలవడింది. ఆ ఉగ్రతత్వం వల్లే రావణుడితో యుద్ధం చేయగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ దేవాలయం గురించిన వివరాలు మీ కోసం....

 తొమ్మిది పరమ పవిత్రమైన నదులు

తొమ్మిది పరమ పవిత్రమైన నదులు

P.C: YouTube

హిందూ పురాణాలను అనుసరించి భారత దేశంలో తొమ్మిది పరమ పవిత్రమైన నదులు ఉన్నాయి. అవి వరుసగా గంగ, యమున, నర్మద, సరస్వతి, కావేరి, గోదావరి, క`ష్ణ, తుంగభద్ర, సరయు. ఇదిలా ఉండగా ప్రజలు తాము చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి ఈ తొమ్మిదింటిలో స్నానాలు చేసి ఆ నదీ తీరాల్లో వెలిసిన దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తుండటం మనకు తెలిసింది.

 ఆ పాపాలన్నీ ఆ నదీమ తల్లులకు

ఆ పాపాలన్నీ ఆ నదీమ తల్లులకు

P.C: YouTube

దీని వల్ల ప్రజల పాపాలు తీరుతున్నాయి. అయితే ఆ పాపాలన్నీ ఆ నదీమ తల్లులకు చుట్టుకొంటున్నాయి. దీంతో ఆ తొమ్మిది నదీమ తల్లులు తల్లడిల్లి పోతూ తమ పాపాలను పోగొట్టే ఉపాయం చెప్పమని కాశీలోని విశ్వేశ్వరుడిని ప్రార్థిస్తారు.

మహామహంలో పన్నెండేళ్లకు ఒకసారి

మహామహంలో పన్నెండేళ్లకు ఒకసారి

P.C: YouTube

దీంతో ఆ పరమశివుడు వారికి ప్రత్యక్షమయ్యి కుంభకోణంలోని మహామహం పేరుతో ఉన్న పుష్కరిణిలో పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభం సమయంలో స్నానం చేసి అక్కడే ఉన్న ఆదికుంభేశ్వరుడిని పూజిస్తే మీ పాపాలన్నీ పోయి పునీతులవుతారని చెబుతాడు.

నవ కన్యల రూపంలో

నవ కన్యల రూపంలో

P.C: YouTube

దీంతో ఆ తొమ్మిది మంది నదీమ తల్లలు కుంభకోణం చేరుకొని మహాకుంభం సమయంలో మహామహంలో స్నానంచేస్తారు. అటు పై ఇక్కడే నవ కన్యల రూపంలో కొలువై ఉండిపోతారు. అంతేకాకుండా ఆ మహామహంలో స్నానం చేయడానికి, ఇక్కడ తాము కొలువై ఉండటానికి సహాయం చేయమని ఆ పరమశివుడిని అర్థిస్తారు.

స్వామివారిని కాశీవిశ్వేశ్వరుడని

స్వామివారిని కాశీవిశ్వేశ్వరుడని

P.C: YouTube

దీంతో ఆ పరమశివుడు ఇక్కడ కొలువై ఉండిపోతాడు. అందువల్లే ఇక్కడ ఉన్న స్వామివారిని కాశీవిశ్వేశ్వరుడని పిలుస్తారు. ఇక్కడ పరమేశ్వరుడితోపాటు ఉన్న అమ్మవారిని కూడా విశాలాక్షి అనే పేరుతోనే పూజిస్తారు.

12 ఏళ్లకు ఒకసారి కుంభకోణం వచ్చి

12 ఏళ్లకు ఒకసారి కుంభకోణం వచ్చి

P.C: YouTube

ఇక ఈ తొమ్మది మంది నదీమ తల్లులు అంటే నవ కన్యలు 12 ఏళ్లకు ఒకసారి కుంభకోణం వచ్చి మహామహంలో స్నానం చేస్తారని చెబుతారు. ఆ సమయంలో ఆ మహామహంలో స్నానం చేస్తే దేశంలోని తొమ్మది నదుల్లో చేసిన పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.

లక్షలాదిమంది భక్తులు

లక్షలాదిమంది భక్తులు

P.C: YouTube

అందువల్లే ఆ సమయంలో ఈ మహామహంలో స్నానం చేయడానికి లక్షలాదిమంది భక్తులు ఇక్కడకు చేరుకొంటూ ఉంటారు. ఈ తొమ్మది మంది నదీమ తల్లులకు కాశీవిశ్వేశ్వరుడి దేవాలయంలో పెద్ద విగ్రహాలు ఉన్నాయి.

ఈ నవకన్యలను పూజిస్తే

ఈ నవకన్యలను పూజిస్తే

P.C: YouTube

ఆడ పిల్లలు వయస్సు పెరిగినా వివాహ కాక ఇబ్బందులు పడుతున్నవారు ఈ నవకన్యలను పూజిస్తే త్వరగా వివాహ అవుతుందని నమ్ముతారు. వీరే కాక వివాహ సమస్యలతో బాధపడుతున్న యువకులు కూడా ఇక్కడికి వెళితే ప్రయోజనం ఉంటుందని చెబుతారు.

16 శుక్రవారాలు ఈ నమకన్యలను ఉపవాసంతో పూజిస్తే

16 శుక్రవారాలు ఈ నమకన్యలను ఉపవాసంతో పూజిస్తే

P.C: YouTube

ముఖ్యంగా 16 శుక్రవారాలు ఈ నమకన్యలను ఉపవాసంతో పూజిస్తే వారి కోరిక తప్పక నెవరేరుతుందని చెబుతారు. అందువల్లే మిగిలిన రోజులతో పోలస్తే ఇక్రవారం ఈ దేవాలయంలో పెళ్లి కాని అమ్మాయిలు ఎక్కువ మంది నవ కన్యలను పూజించడం గమనించవచ్చు.

ఉగ్ర తత్వాన్ని పొందడానికి

ఉగ్ర తత్వాన్ని పొందడానికి

P.C: YouTube

ఇదిలా ఉండగా రామనుడు తన సాత్విక గుణాన్ని వదిలి కొంత ఉగ్ర తత్వాన్ని పొందడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం సతాన్వేషణ చేస్తూ శ్రీరామ చంద్రుడు, లక్ష్మణుడు కుంభకోణానికి వస్తారు.

వేప చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించి

వేప చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించి

P.C: YouTube

ఆ సమయంలో అగస్త్య మహాముని సలహా పై ఈ దేవాలయం సమీపంలో ఉన్న వేప చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించి పూజించి, రుద్రాంశను పొందడమే కాకుండా కొంత ఉగ్ర తత్వం కూడా రామచంద్రుడికి అలవడింది. ఆ ఉగ్రతత్వం వల్లే రావణుడితో యుద్ధం చేయగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నవకన్యల గురించి, కాశీ విశ్వేశ్వరాలయం గురించి తమిళ ప్రాచీన గ్రంధాల్లో విస్తారంగా కథలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X