Search
  • Follow NativePlanet
Share
» »వైష్ణో దేవి సంద‌ర్శ‌న‌కు వెళితే మాత్రం ఈ ప్రదేశాలను సందర్శించాల్సిందే! 

వైష్ణో దేవి సంద‌ర్శ‌న‌కు వెళితే మాత్రం ఈ ప్రదేశాలను సందర్శించాల్సిందే! 

వైష్ణో దేవి సంద‌ర్శ‌న‌కు వెళితే మాత్రం ఈ ప్రదేశాలను సందర్శించాల్సిందే!

జ‌మ్మూ-కాశ్మీర్‌లోని వైష్ణో దేవి దర్శనం కోసం వెళుతున్నట్లయితే, అక్క‌డికి సమీపంలో ఉన్న కొన్ని అద్భుతమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. హిందూ మతంలో వైష్ణో దేవి యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ చాలా మంది భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వ‌సిస్తారు. అందుకే వైష్ణో దేవి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దేశ‌న‌లుమూల‌ల నుంచి ఇక్కడికి వస్తుంటారు.

ముఖ్యంగా నవరాత్రుల రోజుల్లో ఎక్కువ మంది సంద‌ర్శ‌కులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ సంవత్సరం నవరాత్రులు సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 4 వరకు మరియు దసరా అక్టోబర్ 5 న జరుపుకుంటోన్న సందర్భంగా ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లో ఉన్న కొన్ని ప‌ర్యాట‌క అందాల‌ను ప‌ల‌క‌రిద్దాం.

పట్నితోప్

పట్నితోప్

వైష్ణో దేవాలయం ఆధ్యాత్మికతకు కేంద్రంగా గుర్తింపు పొందితే, ఇక్క‌డికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ప‌ట్నితోప్ ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా ప్ర‌సిద్ధి పొందింది. ఈ ప్రాంత‌మంతా సహజ సిద్ద‌మైన ప్ర‌కృతి సంపదతో నిండి ఉంటుంది. హిమాలయాల ఒడిలో ఉన్న దట్టమైన దేవదారు మరియు ఎత్తైన పర్వతాల మ‌ధ్య దాగిన ప‌ట్నితోప్ అందాలు మాట‌ల్లో చెప్పలేం. ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కులు పారాగ్లైడింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ మొదలైన అనేక సాహస క్రీడలను మ‌న‌సారా ఆస్వాదించవచ్చు. చలికాలంలో ఇక్కడికి వెళితే మంచు కురుస్తుంది. నవరాత్రి రోజుల్లో, వైష్ణో మాత‌ సందర్శించడానికి వచ్చే భక్తులతోపాటు దాదాపు అన్ని ర‌కాల పర్యాటకులు ఖచ్చితంగా ఇక్క‌డ సందర్శన‌కు చేరుకుంటారు. కత్రా నుండి పట్నితోప్‌కి సుమారు గంట ప్ర‌యాణం చేస్తే స‌రిపోతుంది.

సనాసర్

సనాసర్

వైష్ణో దేవి ఆల‌యం సందర్శించిన తర్వాత కుటుంబ‌స‌మేతంగా ఏదైనా హిల్ స్టేషన్‌ని సందర్శించాలనుకుంటే మాత్రం నేరుగా సనాసర్ చేరుకోవాలి. ఈ అందమైన ప్రదేశాన్ని మ‌న‌సారా ఆస్వాదించేందుకు చాలా ప్రకృతి అందాలు మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తాయి. ఇక్క‌డి పారాగ్లైడింగ్, బోట్ రైడ్ మరియు రాక్ క్లైంబింగ్ వంటి అనేక ఇతర సాహ‌స క్రీడ‌ల‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాదు, ఇక్కడి కాశ్మీరీ సంస్కృతిని ద‌గ్గ‌ర‌గా చూసేందుకు ఈ ప్ర‌దేశం స‌రైన ఎంపిక‌. కత్రా నుండి దాదాపు రెండు గంటలు ప్రయాణం చేయ‌డం ద్వారా సనాసర్ చేరుకోవచ్చు.

బాటోట్

బాటోట్

బాటోట్‌ చాలా అందమైన మరియు ప్రసిద్ధ హిల్ స్టేషన్. చీనాబ్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశానికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ అనుభ‌వించే విశ్రాంతి క్షణాలు జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను అందిస్తాయి. ఎత్తుప‌ల్లాల ప‌చ్చిక‌ మైదానాల్లో తిరగడంతో పాటు ఇక్కడి అట‌వీప్రాంతంలో క్యాంపింగ్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా చెప్పొచ్చు. ఇది కాకుండా, ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఆనందించవచ్చు. కత్రా నుండి బాటోట్‌కు 81 కిలోమీట‌ర్లు. అలాగే, పట్నితోప్ నుండి 12 కిలోమీట‌ర్ల‌ దూరంలో బాటోట్ ఉంటుంది.

ఝజ్జర్ కోట్లి

ఝజ్జర్ కోట్లి

ఝజ్జర్ కోట్లి వైష్ణో దేవాలయం చుట్టుప‌క్క‌ల‌ చూడవలసిన ఉత్తమమైన మరియు అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడి ప్ర‌కృతి అందాలు సంద‌ర్శ‌కుల‌ను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే ఈ ప్రాంతం కుటుంబ‌స‌మేతంగా గ‌డిపేందుకు అనువైన పిక్నిక్ స్పాట్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మీరు ఇక్కడ అడ్వెంచర్ గేమ్‌లను కూడా ఆస్వాదించవచ్చు. వైష్ణో దేవాలయం నుండి ఝజ్జర్ కోట్లి దాదాపు 31 కిలోమీట‌ర్లు ఉంటుంది.

Read more about: katra patnitop
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X