• Follow NativePlanet
Share
» »ఇక్కడున్న ప్రసిద్ధ స్థలాల పేర్లను మీరు గుర్తించగలరా?

ఇక్కడున్న ప్రసిద్ధ స్థలాల పేర్లను మీరు గుర్తించగలరా?

చాలామంది ఇటువంటి ప్రదేశాలను చూసి ఆనందించవచ్చును.ఒక్కొక్క స్థలానికి చిత్రం చూస్తూనే ఆకర్షించబడతాం.ఇది అదే స్థలం. ఇక్కడ ట్రావెలింగ్ చేయటానికి ప్రతిఒక్కరూ ఇష్టపడతారు. మనస్సుకి కొంచెం విశ్రాంతి కోసం ఎక్కడికైనా బయటకు స్నేహితులతో,దంపతులతో లేదా పిల్లలతో వెళ్తాం. ఇక్కడ ప్రక్రుతి సౌందర్యానికి కావలసినంతమేరకు చిత్రాలతో ఏ స్థలం అని మీరే కనుగొనండి. అంటే ఇక్కడ చిత్రాలు ఇవ్వబడినాయి.ఆ చిత్రంలోని స్థలం ఏది అనేది మీరే కనిపెట్టాలి.

చూద్దాం మీరెంత టూరిస్ట్ ప్రియులు అనేదాన్ని మీరే తెలుసుకోండి.అలాగైతే మరెందుకు ఆలస్యం రండి ఆ చిత్రాల స్థలాలను గుర్తిస్తాం.

ఇది ఏ స్థలం?

ఇది ఏ స్థలం?

చిత్రంలోని అందమైన ప్రదేశం సన్నివేశమే చెబుతుంది.పాల నురగలాగా దుముకుతూవుండే అద్భుతమైన దృశ్యం ఎటువంటి పర్యాటకులైనా మంత్రముగ్దులుకాకమానరు. ఇది మన కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశం.ఈ జలపాతం దక్షిణ భారతదేశం యొక్క ప్రఖ్యాతిగాంచిన హిల్ స్టేషన్లలో ఒకటి. కర్ణాటక యొక్క జీవనది పుట్టింది ఇదే స్థలంలో...సమాధానం చెప్పండి .....

సమాధానం: అబ్బి ఫాల్స్, మడికెరి.

PC:Vaishak Kallore

ఇది ఏ స్థలం?

ఇది ఏ స్థలం?

సమాధానం చూడటానికన్నా ముందు చిత్రాన్ని సూక్ష్మంగా గమనించి సమాధానం చెప్పండి.ఈ నయనమనోహరమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగివున్న ఈ స్థలం ప్రపంచంలోనే అత్యధికంగా వర్షాలు కురిసే ప్రదేశాలలో ఒకటి.దీనిని దక్షిణ చిరపుంజి అని పిలుస్తారు.ఇక్కడి అపురూపమైన సూర్యాస్తమయం మరియు సూర్యోదయాన్ని సందర్శించటానికి అనేకమంది పర్యాటకులు వస్తూవుంటారు.సమాధానం తెలుసుకోవాలి కదా?

సమాధానం: అగుంబే, తీర్థహళ్ళి తాలూకు, షిమోగా జిల్లా.

PC:Sajjad Fazel

ఇది ఏ స్థలం?

ఇది ఏ స్థలం?

ఇదొక అద్భుతమైన పర్వతశ్రేణి కలిగివున్న పశ్చిమ కనుమలలో ఆవరించివున్న ఒక మతపరమైన ప్రసిద్దిపొందిన ప్రదేశం.ఇది హిందూ మరియు ముస్లిం రెండుధర్మాల వారికీ పవిత్రమైన ప్రదేశం అని చెప్పవచ్చును

సమాధానం :బాబా బుడాన్ గిరి హిల్స్, చిక్కమగళూరు జిల్లా.

PC:S N Barid

ఇది ఏ స్థలం?

ఇది ఏ స్థలం?

ఇది మంత్రముగ్ధమైన కొండల శ్రేణి.ఇది కొడగు జిల్లాలోవున్న ఈ మంత్రముగ్ధమైన కొండల శ్రేణి ట్రెక్కింగ్ కి కూడా ప్రసిద్ధమైనది.ఈ కొండ పశ్చిమ కనుమలలో ఉంది.ఈ అందమైన ప్రదేశాన్ని అనేకమంది పర్యాటకులు సందర్శిస్తారు.

సమాధానం :బ్రహ్మగిరి పర్వతాలు, కూర్గ్

ఇది ఏ స్థలం?

ఇది ఏ స్థలం?

ప్రసిద్ధ ఇంగ్లీష్ పురాతత్త్వ ఇతిహాసకుడు చెప్పిన ప్రకారం ఈ దేవాలయాలం యొక్క శిల్పకళ కన్నడ రాష్ట్రంలో హలేబీడు అనంతరం ఇది చాలా ఉత్తేజకరమైనది.పశ్చిమచాళుక్యుల కళానైపుణ్యతను చూపే ఈ దేవాలయం మహాశివునికి సంబంధించిన ఇది ఒక పుణ్యక్షేత్రం.అంటే ఇదొక మహిమాన్వితమైన శైవ క్షేత్రం.

సమాధానం : మహాదేవ ఆలయం, ఇటాగి, కొప్పల్ జిల్లా.

PC: L. Shyamal

ఇది ఏ స్థలం?

ఇది ఏ స్థలం?

ఇది కర్ణాటకలోనే మాత్రమేకాదు భారతదేశంలోనే ప్రసిద్ధమైన జలపాతం. ఇక్కడ రాజా, రాణి, రాకెట్ మరియు రోలర్ అనే 4జలపాతాలు దూకే ఈ స్థలం శివమొగ్గ జిల్లాలోవుంది.ఇక్కడి సౌందర్యాన్ని చూడటానికి అనేకమంది పర్యాటకులు ఇక్కడికి వస్తూవుంటారు.

సమాధానం : జోగ్ ఫాల్స్, షిమోగా

PC:Prasanaik

ఇది ఏ స్థలం?

ఇది ఏ స్థలం?

ఈ అందమైన ప్రదేశం బెంగుళూరు నుండి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో వుంది.ఇది అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అందమైన హిల్ స్టేషన్.ఇది ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణ.ఇక్కడి ప్రకృతి సౌందర్యంతోపాటూ భోగనందీశ్వరుని దేవాలయం కూడా వుంది.

సమాధానం :నంది హిల్స్, చిక్కబల్లాపూర్.

PC:Koshy Koshy

ఇది ఏ స్థలం?

ఇది ఏ స్థలం?

ఇది దక్షిణభారత రాష్ట్రంలోని "సాంస్కృతిక రాజధాని" నగరంలో వుంది. భారతదేశంలో నున్న అందమైన మరియు విశాలమైన వుద్యానవనాలలో ఒకటి. ఈ అందమైన వుద్యానవనం కర్ణాటకలోని జనప్రియమైన జలాశయాల్లో ఒక భాగంగా వుంది.

సమాధానం :KRS గార్డెన్, మాండ్య జిల్లా.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి