Search
  • Follow NativePlanet
Share
» »ఒక్కో ప్రాంతంలో ఒక్కొలా.. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు!

ఒక్కో ప్రాంతంలో ఒక్కొలా.. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు!

ఒక్కో ప్రాంతంలో ఒక్కొలా.. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు!

భారతదేశం అంటేనే విభిన్నమైన ప్రజలు నివసించే విభిన్నమైన భూమి. అందుకే ఇక్క‌డివారు నూతన సంవత్సరాన్ని జరుపుకొనే స‌మ‌యాలు కూడా వేరు వేరుగా ఉంటాయి.

గొప్ప సంస్కృతిని ప్రతిబింబించే ఉగాది, గుడి పడ్వా, విషు, పుత్తండు మొదలైన పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాలలో నూత‌న సంవ‌త్స‌రాన్ని జరుపుతారు. వివిధ‌ రాష్ట్రాలలో నూతన సంవత్సర రోజుల జాబితా మీకోసం.

ఉగాది - తెలుగు నూతన సంవత్సరం

ఉగాది - తెలుగు నూతన సంవత్సరం

ఈ పండుగను కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి-ఏప్రిల్ నెల‌ల్లో (చైత్ర మాసం) జ‌రుపుతారు. ఒక యుగపు ప్రారంభానికి ప్రతీకగా భావిస్తారు. పండుగ తేదీ హిందూ క్యాలెండర్ పద్ధతిని అనుసరించి ఉంటుంది. ఈ తేదీన‌ ప్రజలు పండుగలను జరుపుకుంటారు. కొత్త బట్టలు కొనుక్కొని, మంచి పిండివంట‌ల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

గుడి పడ్వా - మరాఠీ నూతన సంవత్సరం

గుడి పడ్వా - మరాఠీ నూతన సంవత్సరం

చైత్ర మాసం మొదటి రోజున జరుపే గుడి పడ్వా మహారాష్ట్రీయులు మరియు కొంకణిలకు నూతన సంవత్సర దినం. ఈ రోజున గృహాల ప్రధాన ప్రవేశానికి కుడి వైపున వేలాడదీసిన గుడిని చూడవచ్చు. గుడి అనేది పొడవాటి వెదురు కొన‌కు చుట్ట‌బ‌డిన ప‌సువు వ‌స్త్రం. దీనికి చెరుకుగ‌డ మ‌రియు కుండ‌ను అందంగా అలంక‌రించి అమ‌ర్చుతారు.

బైసాఖి - పంజాబీ నూతన సంవత్సరం

బైసాఖి - పంజాబీ నూతన సంవత్సరం

బైసాఖీ అనేది సిక్కుల వైభవంగా జరుపుకునే పంట పండుగ. ఏప్రిల్ 13న నూతన సంవత్సరం ప్రారంభం కాగా 14న పండుగ అన్ని మతాల ప్రజలను ఒకచోటకు చేరి, పండుగ జ‌రుపుతారు. బైసాఖీ సిక్కు ఖల్సా ఏర్పడిన రోజుగా కూడా నిలుస్తుంది. ఈ రోజున‌ యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లతో పాటు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి.

పుతండు - తమిళ నూతన సంవత్సరం

పుతండు - తమిళ నూతన సంవత్సరం

తమిళంలో సాంప్రదాయ నూతన సంవత్సరం ఏప్రిల్ 13, 14 లేదా తమిళ నెల చితిరై మొదటి రోజున ప్రారంభమవుతుంది. ఈ పండుగ సందర్భంగా ప్రజలు ఒకరికొకరు పుతండు వజ్తుకల్ అని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు అర్థం. పచ్చి మామిడికాయలు, వేప పూలు మరియు బెల్లంతో చేసిన మాంగై పచ్చడి ఈ వేడుకలో ప్రత్యేక ఆహారం.

బోహాగ్ బిహు - అస్సామీ నూతన సంవత్సరం

బోహాగ్ బిహు - అస్సామీ నూతన సంవత్సరం

బోహాగ్ బిహు అస్సామీ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఏప్రిల్ మధ్యలో జరుపుకుంటారు. ఈ పండుగ అస్సాం యొక్క అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీనిని ఎంతో ఉత్సాహంతో, విశ్వాసంతో నిర్వ‌హిస్తారు.

పోహెలా బోయిషాక్ - బెంగాలీ నూతన సంవత్సరం

పోహెలా బోయిషాక్ - బెంగాలీ నూతన సంవత్సరం

ఏప్రిల్ మధ్యలో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. నబో బార్షో బెంగాలీ నూతన సంవత్సరం. ఈ రోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ మరియు ప్రార్థనలతో పాటు చాలా ఉత్సవాలను నిర్వ‌హిస్తారు. పోహెలా బోయిషాక్‌ను త్రిపురలోని కొండ ప్రాంతాలలో మరియు ఇతర నగరాల్లోని గిరిజన ప్రజలు జరుపుకుంటారు.

బెస్టు వరస్ - గుజరాతీ నూతన సంవత్సరం

బెస్టు వరస్ - గుజరాతీ నూతన సంవత్సరం

బెస్టు వరాస్ అనేది గుజరాతీ నూతన సంవత్సరం. ఇది గుజరాత్‌లో పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీపావళి మరుసటి రోజు మతపరమైన ఆచారాలు మరియు సంప్రదాయాలతో పాటు పండుగను ఆహ్వానిస్తారు. రాజస్థాన్‌లోని మార్వాడీలు దీపావళిని కొత్త సంవత్సరంగా పాటిస్తారు.

విషు - మలయాళ నూతన సంవత్సరం

విషు - మలయాళ నూతన సంవత్సరం

విషు అనేది మలయాళ నూతన సంవత్సరం. దేశంలోని ఇతర చోట్ల మాదిరిగానే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 14న జరుపుకుంటారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ వేడుకలలో ఒకటి. దీనిని కేరళ ప్రజలు అనుసరిస్తారు.

పనా సంక్రాంతి - ఒడిశా

పనా సంక్రాంతి - ఒడిశా

పానా సంక్రాంతి అనేది ఒడిశాలోని ప్రజల సాంప్రదాయ కొత్త సంవత్సరం పండుగ. ప్రజలు హనుమాన్ దేవాలయాలను సందర్శించడం, పవిత్ర నది లేదా ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలలో స్నానాలు చేయడం వంటి ఆచారాల‌తో ఉత్సాహంగా జరుపుకుంటారు.

Read more about: andhra pradesh karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X