» »ఇండియన్ జురాసిక్ పార్క్ చూసారా?

ఇండియన్ జురాసిక్ పార్క్ చూసారా?

Written By: Venkatakarunasri

మనదేశంలో కూడా డైనోసార్ లు ఉన్నాయా ? అని నోరెళ్లబెట్టే వారికి ఈ ప్రదేశమే జవాబు చెబుతుంది. డైనోసార్ ల కాలి గుర్తులను, శిలాజాలు చూడాలని ఉందా ? అయితే వెళదాం పదండి 'బలసినోర్ ఫాసిల్ పార్క్' కి. దీన్నే 'ఇండియన్ జురాసిక్ పార్క్' అని కూడా అంటారు.

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాకాసి బల్లుల్ని పూజిస్తారు. ఆ ఊరిలో ఎటుచూసినా డైనోసార్ ల శిలాజాలు దర్శనమిస్తాయి. చుట్టూ అంతా వాటి గుర్తులే కనిపిస్తాయి .. అదో రాకాసి రాజ్యం .. ఇదెక్కడో కాదు మన దేశంలోనే !

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

జురాసిక్ పార్క్, గుజరాత్ రాష్ట్రంలోని బాలసినోర్ పట్టణం దగ్గరలోని రైయోలి అనే గ్రామం వద్ద ఉన్నది.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

రాకాసి బల్లుల శిలాజాలు ఉన్న ఊరిగా ప్రసిద్ధి చెందిన రైయోలి లో డైనోసార్ ల యొక్క శిలాజాలు దర్శనం ఇస్తాయి. రాకాసి బల్లుల శిలాజ రూపంలో ఉన్న గుడ్లు, పుర్రెలు, ఎముకలు, దంతాలు, మరియు ఇతర శరీరభాగాల అవశేషాలు, గుర్తులు కనిపిస్తాయి.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

ఇక్కడున్న శిలాజాలు కొన్ని 20 మీటర్ల ఎత్తున కనిపిస్తాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడ నిలువెత్తు రాకాసి బల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేశారు. మొన్నీమధ్యనే కొత్త డైనోసార్ల శిలాజాలు బయటపడ్డాయట. దాంతో ఈ పార్క్ మరలా వార్తల్లో నిలిచింది.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

సుమారు పది కోట్ల ఏళ్ల క్రితం ఈ ఊరు పరిసరాలలో డైనోసార్ లు తిరిగేవట. వాతావరణం అనుకూలించడంతో అవి ఇక్కడే ఉండి, గుడ్లు కూడా పెట్టేవట.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

కొంత మంది శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంలో పరిశోధనలు జరుపుతుంటే 1981 లో మొట్టమొదటి సారిగా డైనోసార్ శిలాజాలు కనిపించాయట! అది కాస్త ఆ నోట ఈ నోట పాకి వివిధ దేశాలలో నుంచి శాస్త్రవేత్తలు ఇక్కడకు వచ్చి పరిశోధనలు చేశారు.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

పరిశోధనల పుణ్యమాని ఇప్పటివరకు 13 వరకు డైనోసార్ ల జాతులను, పది వేల వరకు డైనోల గుడ్ల ను కనిపెట్టారు.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

'డైనోసార్ టూరిజం' పేరిట గుజరాత్ పర్యాటక శాఖ దీన్ని అభివృద్ధి చేస్తున్నది. రోజూ వేలాది మంది సందర్శకులతో ఈ జురాసిక్ పార్క్ కిటకిటలాడుతుంది.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలిసినోర్ లో ఉన్న పురాతన ఆలయం అంబాజీ టెంపుల్. ఇది బలిసినోర్ ఫాసిల్ పార్క్ కు సమీపాన ఉన్నది.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

డైనోసార్ పార్క్ కి కేవలం 20 నిమిషాల దూరంలో ఉన్న ది గార్డెన్ ప్యాలెస్ తప్పక చూడదగినది. దీనిని నవాబ్ సాహెబ్ మనోవర్ ఖాన్ జీ బాబీ క్రీ. శ. 1883 లో నిర్మించాడు. ప్యాలెస్ ప్రస్తుతం హెరిటేజ్ హోటల్ గా సేవలు అందిస్తున్నది. ప్యాలెస్ లోపల ఇంటీరియర్ డిజైన్ సందర్శకులను ఆకట్టుకుంటుంది.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

మహి నది మీద నిర్మించిన వనక్ బోరి డ్యాం పర్యాటకులకు పిక్నిక్ స్పాట్ గా అలరిస్తున్నది. ది గార్డెన్ ప్యాలెస్ కు ఈ డ్యామ్ చేరువలో ఉన్నది.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

తిమ్బ తువా డైనోసార్ పార్క్ సమీపాన ఉన్న మరొక పర్యాటక ప్రదేశం. ఇక్కడ వేడి నీటి బుగ్గ కలదు. దీనికి సంజీవని లక్షణాలు ఉన్నట్లు స్థానికులు భావిస్తారు.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

తిమ్బ తువా

పిక్నిక్ స్పాట్ గా ప్రసిద్ధి చెందిన గల్టేశ్వర్, శివునికి అంకితం చేయబడిన ఆలయం. ఇక్కడికి శివరాత్రి సందర్భంలో యాత్రికులు వస్తుంటారు.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

చంపానేర్

ఆస్కార్ కు నామినేట్ అయిన 'లగాన్' అనే బాలీవూడ్ చిత్రాన్ని చంపానేర్ లో షూటింగ్ చేశారు. చంపానేర్ బలిసినోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ కుగ్రామం వెయ్యేళ్ల కిందట హిందూ, జైన ఆలయాలకు స్థావరంగా ఉండేది. మసీదులు, కోట లు, రాజభవనాలు ఇలా ఎన్నో చంపానేర్ లో చూడదగ్గవిగా ఉన్నాయి. 2004 లో చంపానేర్ ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించారు.

బలసినోర్ ఫాసిల్ పార్క్

బలసినోర్ ఫాసిల్ పార్క్

ఎలా చేరాలి?

వాయు మార్గం

బలిసినోర్ కు సమీపాన 79 కిలోమీటర్ల దూరంలో వడోదర రైల్వే స్టేషన్, 107 కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి బలిసినోర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

బలిసినోర్ కు సమీపాన 63 కిలోమీటర్ల దూరంలో ఆనంద్ రైల్వే స్టేషన్ కలదు. న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, హౌరా, అహ్మదాబాద్ ప్రాంతాల నుండి ఇక్కడికి రెగులర్ గా రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం / బస్సు మార్గం

అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర వంటి పట్టణాల నుండి బలిసినోర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతాయి.