Search
  • Follow NativePlanet
Share
» »Jodhpur fort - జోధ్‌పూర్ వీక్ష‌ణ‌....ఓ ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌...

Jodhpur fort - జోధ్‌పూర్ వీక్ష‌ణ‌....ఓ ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌...

బంగార వ‌ర్ణ‌పు ఇసుక రేణువులు న‌డియాడిన నేల అది. భార‌తీయ సంస్కృతి సంప్ర‌దాయాల‌లో ఆ ప్రాంతానికంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అబ్బుర‌ప‌రిచే రాతి నిర్మాణాలు నేటికి అల‌నాటి రాచ‌రిక‌పు ప‌రిమ‌ళాల‌ను వెద‌జ‌ల్లుతూ ఉన్న‌ది. అదే జోధ్‌పూర్ కోట‌. అక్క‌డి మా ప‌ర్యాట‌క అనుభ‌వాల‌ను మీతో పంచుకునేందుకు మేం సిద్ధం.

రాతిని త‌ల‌పించేలా చెక్క నిర్మాణాలు...

రాజ‌స్థాన్‌లోని జోథ్‌పూర్ కోట ముఖ ద్వారానికి చేరువయ్యాము. అలనాటి రాచ‌రిక‌పు ఆన‌వాళ్ల‌కు ప్ర‌తీక‌గా నిలిచిన ఆ రాతి క‌ట్ట‌డ‌పు గోడ‌లు మ‌మ్మ‌ల్ని రా ర‌మ్మంటు సాద‌ర ఆహ్వ‌నం ప‌లికాయి. ఆ ఎర్ర‌ని రాయి నిర్మాణ శైలి అబ్భుర ప‌రిచేలా ఉంది. ఎటుచూసినా గంభీరంగా నిల‌బ‌డిన సైనిక ప్ర‌తిమ‌లు వాస్త‌వ రూపాలకు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. రాతిని త‌ల‌ద‌న్నేలా క‌నిపిస్తోన్న కోట పైక‌ప్పు పూర్తి చెక్క‌తో త‌యారు చేసింది అని తెలియ‌గానే మా మిత్ర బృందం ఆశ్చ‌ర్యానికి గుర‌య్యింది.

 Jodhpur fort

రాజ‌స్తానీ సంస్కృతి ఉట్టిప‌డేలా...

కోట లోప‌లి భాగంలో ఎటు చూసినా రాజ‌స్తానీ సంస్కృతి ఉట్టి ప‌డేలా రాజ‌స్తానీ వేష‌ధార‌ణ‌లో వారు చేసే నృత్యాలు, పురాత‌న సంగీత వాయిద్యాలు మ‌మ్మ‌ల్ని క‌ట్టి ప‌డేశాయి. మ‌రీ ముఖ్యంగా వారు వేష‌ధార‌ణ‌లో ఉప‌యోగించిన ప‌గ‌డి (త‌ల‌పాగు) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అనే చెప్పాలి. దేశ విదేశీ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు వారు చేసే ప్ర‌య‌త్నాలు చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి. అలా కాస్త ముందుకు వెళ్లిన త‌ర్వాత ప్ర‌త్యేకంగా భ‌ద్ర‌ప‌రిచిన అప్ప‌ట్లో వినియోగించిన వ‌స్తువుల ద‌గ్గ‌ర మా అడుగులు ఆగాయి. పూర్వం ఉప‌యోగించిన‌ట్లు చెబుతోన్న నాలుగు అడుగుల పొడ‌వు సుమారు ప‌దిహేను కేజీల బ‌రువు ఉన్న ఖ‌డ్గం చూసిన త‌ర్వాత నిజంగా మ‌నుషులు దానిని వినియోగించ‌గ‌లిగారా? అన్న అనుమానం క‌లిగింది. అయితే, ప‌క్క‌నే ఉన్న రెండు అడుగుల చెప్పుల‌ను చూడ‌గానే అల‌నాటి మ‌నుషుల గంభీర‌మైన ఆకారం మా మెద‌ళ్ల‌ను తోల‌చివేసిన అనుమాన‌పు బీజాల‌ను కూక‌టి వేళ్ల‌తో స‌హా పెళ్ల‌గించేలా చేసింది. యుద్ధ స‌మ‌యంలో సైనికులు ధ‌రించిన లోహ‌పు క‌వ‌చాలు, కిరీటాలు ఇత‌ర వస్తు సామాగ్రి నేటికీ చెక్కు చెద‌ర‌కుండా కోట‌లో అల‌నాటి వైభ‌వాన్ని ప్రతిబింబించేలా ప‌ర్యాట‌కుల‌ను నేటికీ ఆక‌ర్షిస్తూనే ఉన్నాయి.

 Jodhpur folk dance

చూపు తిప్పుకోనీయని సుంద‌ర దృశ్యం...

కోట పై భాగానికి వెళ్లిన త‌ర్వాత జోధ్‌పూర్ న‌గ‌ర అందాల‌ను క‌నులారా వీక్షించే అదృష్టం దొరికిందా? అన్న అనుభూతి క‌లిగింది. ఎత్తైన భ‌వ‌న స‌ముదాయాలు సైతం నేల‌పై ప‌రిచిన న‌క్ష‌త్రాల వ‌లే చిన్న‌గా, ఆకర్ష‌ణీయంగా క‌నిపించాయి. కోట ముఖ‌ద్వారం పైన శ‌త్రువుల‌ను ఎదురించేందుకు ఏర్పాటు చేసిన ఫిరంగుల నిర్మాణాలు ఈ కోట శ‌త్రు దుర్భేక్షంగా నిర్మించ‌బ‌డింది అనేందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌. కోట మొత్తం తిరిగాడిన త‌ర్వాత పై భాగంలో వీస్తోన్న‌ చ‌ల్ల‌గాలులు సంద‌ర్శ‌కుల‌కు సేద‌దీరేందుకు స‌హాయ‌ప‌డుతున్నాయా? అన్న‌ట్లు అనిపించింది. తిరుగు ప్ర‌యాణానికి సిద్ధ‌మవుతోన్న స‌మ‌యంలో జీవితంలో ఒక్క‌సారైనా చూడాలి అనేలా ఓ సుంద‌ర దృశ్యం మ‌మ్మ‌ల్ని చూపు తిప్పుకోనియ్య‌లేదు. అదే, కోట పై భాగంలోంచి క‌నిపించిన సూర్య‌స్త‌మ‌య దృశ్యం. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

ఎలా చేరుకోవాలి?

జోధ్‌పూర్‌కు రైలు, బ‌స్సు, విమానం ద్వారా చేరుకునేందుకు అన్ని ప్ర‌ధాన మార్గాల గుండా ప్ర‌యాణ సౌక‌ర్యం అందుబాటులో ఉంది. అప్ప‌టికే ఇర‌వై ఏళ్ల‌కు పైగా స్తానికంగా ఆర్మీలో విధులు నిర్వ‌ర్తిస్తున్న రాజు అనే మిత్రుడు ఉండ‌డంతో మా కోట ప‌ర్య‌ట‌న సులువయ్యింది.

Read more about: jodhpur rajasthan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X