Search
  • Follow NativePlanet
Share
» »స్వర్గాన్ని తలపించే రత్నగిరి పర్వతాన్ని చూశారా?

స్వర్గాన్ని తలపించే రత్నగిరి పర్వతాన్ని చూశారా?

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో రత్నగిరి జిల్లా ఒకటి. రత్నగిరి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రత్న అంటే మరాఠీ లో రత్నం అని అర్ధం అలాగే గిరి అంటే పర్వతం. రత్నగిరి అంటే మొత్తానికి రత్నాల పర్వతం అని అర్ధం. డాక్టర్ అంబేద్కర్, లోకమాన్య తిలక్, వి.డి. సవార్కర్, బాబా పాఠక్, సానే గురూజీ, హుతత్మ, అనంత్ కంహరె మరియు అనేక మంది జాతిరత్నాలను దేశానికి అందించింది కనుక ఇది రత్నగిరి అయిందని భావిస్తున్నారు. రత్నగిరి కోటకు ఇరువైపులా ఉన్న రెండు సముద్రతీరాలలో ఒక దానిలో తెల్లని ఇసుక మరొక దానిలో నల్లని ఇసుక ఉండడం విశేషం. ఇక్కడ ఇటువంటి వింతలు చాలానే ఉంటాయి మరి ఇక్కడున్న బీచ్ లు, ముఖ్యంగా బంగారు కోట విశేషాలు తెలుసుకుందామా ...

తిబా ప్యాలెస్

తిబా ప్యాలెస్

తిబా ప్యాలెస్ క్రీ.శ. 1910 - 1911 మధ్యకాలంలో నిర్మించబడింది. ఇది దేశ బహిష్కరణ గావించబడిన బర్మా రాజు- రాణి కొరకు నిర్మించబడింది. వారు ఈ ప్యాలెస్‌ లో క్రీ.శ. 1911 నుండి క్రీ.శ. 1916 వరకు నివసించారు. వారు నివసించిన దానికి గుర్తుగా ఇక్కడ రెండు సమాధులు ఉన్నాయి.
PC: Bharat Bang

మాల్గుండ్

మాల్గుండ్

మాల్గుండ్ ప్రముఖ మరాఠీ కవి కేశవ్‌సూత్ జన్మస్థలం. ఇది ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. గణపతిపులె నుండి ఇది 1 కి.మీ దూరంలో ఉంది. కవి వివసించిన గృహం ఒక సందర్శన ప్రదేశంగా ఉన్నది. మరాఠీ సాహిత్య పరిషద్ కవి ఙాపకార్ద్జం " కేశవ్సూత్ " పేరిట స్మారక చిహ్నం నిర్మించింది. Photo Courtesy: Rajesh Warange / wikicommons

జైగాడ్ కోట

జైగాడ్ కోట

జైగాడ్ కోట సంగమృశ్వర్ నదీ ముఖద్వారం వద్ద నిర్మించబడింది. ఇది గణపతి పులే నుండి 25 కి.మీ దూరంలో ఉంది. 17వ శతాబ్ధానికి చెందిన ఈ కోట సముద్రతీరంలో ఆకర్షణీయం గా కనిపిస్తుంది. జైగాడ్స్ సీ ఫోర్ట్ షెల్టర్డ్ బేలో ఉంది. ఇక్కడ సముద్రతీరం చిన్నది మరియు సురక్షితమైనది.
Photo Courtesy: Ramnath Bhat

వెల్నేశ్వర్

వెల్నేశ్వర్

రత్నగిరి కి 170 కి.మీ దూరంలో ఉన్న వెల్నేశ్వర్ చిన్న గ్రామం ఇది. ఇక్కడ సముద్రతీరం శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు బారులు తీరి ఉండి రాళ్ళు లేని ప్రాంతంగా ఉంటుంది కనుక ఈతకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న " వెల్నేశ్వర్" అనే పురాతన శివాలయం అనేకమంది భక్తులను ఆకర్షిస్తుంది. పరమశివుని నివాసమైన ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గాన్ని తలపింపజేస్తుంది.

వెల్నేశ్వర్

వెల్నేశ్వర్

రత్నగిరి కి 170 కి.మీ దూరంలో ఉన్న వెల్నేశ్వర్ చిన్న గ్రామం ఇది. ఇక్కడ సముద్రతీరం శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు బారులు తీరి ఉండి రాళ్ళు లేని ప్రాంతంగా ఉంటుంది కనుక ఈతకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న " వెల్నేశ్వర్" అనే పురాతన శివాలయం అనేకమంది భక్తులను ఆకర్షిస్తుంది. పరమశివుని నివాసమైన ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గాన్ని తలపింపజేస్తుంది.

Photo Courtesy: Ankur

సువర్ణ దుర్గం

సువర్ణ దుర్గం

చుట్టూ సముద్రం, మధ్యలో కోట. ఆ కోటే సువర్ణదుర్గం. హర్నారు దగ్గర సముద్రపు నీటి మధ్యలో ఈ కోట ఉంది. తీరం నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో కొండపై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. లోపల ఎన్నో భవనాలు, నీటి వనరులు ఇలా సకల సదుపాయాలు ఉన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. శివాజీ కాలంలోనే దీన్ని 'సువర్ణదుర్గ్‌' అని పిలిచేవారు. ఈ కోటను చూడడానికి వందలాది పర్యాటకులు పడవల్లో వస్తుంటారు. ఇక్కడికి దగ్గరలో కనకదుర్గ్‌ అనే మరోకోట ఉంది. సువర్ణదుర్గ్‌ కోట కాపాడటానికే ఈ కోటని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.

గురునాడా కోట

గురునాడా కోట

ఈ కోట గురునాడా ఆకారంలో ఉంటుంది. పొడవు 1300 మీటర్లు వెడల్పు 1000 మీటర్లు. కోట మూడు వైపులా సముద్రం ఉంటుంది. నాలుగవ వైపు మాత్రమే భూమి ఉంటుంది. కోటలో ఇప్పటికీ లైట్ హౌస్ ఉంది. ఇక్కడ అందమైన భగవతి ఆలయం ఉంది. ఆలయ సమీపంలో మెట్లబావి ఒకటి ఉంది.
Photo Courtesy:Kristina D.C. Hoeppner

మర్లేశ్వర్ ఆలయం

మర్లేశ్వర్ ఆలయం

మార్లేశ్వర్ ఆలయం సాహ్యాద్రి కొండమీద ఉంది. ఇక్కడ ఉన్న మర్లేశ్వర్ జలపాతం ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ఆలయం పక్కనే జలపాతం ఉంది. ఇది మరల్ గ్రామం వద్ద ఉంది. ఇది దియోరుఖ్ గ్రామానికి 16 కి.మీ దూరంలో ఉంది. Photo Courtesy: varun

గుహగర్ బీచ్ :

గుహగర్ బీచ్ :

గుహగర్ లో ఉన్న ఈ సముద్రం అంత లోతైనది కాదు, అయితే ఇక్కడ స్విమ్మింగ్ మరియు వాటర్ స్పోర్ట్స్ కు అనుకూలంగా ఉంటుంది. ఈ బీచ్ లో మరో ప్రత్యేకత. ఉదయం, సాయంత్ర సమయాల్లో సూర్యచంద్రలను చూడటం చాలా గ్రేట్ గా ఉంటుంది. ఈ సన్ సెట్ లో బీచ్ అందాలను చూడటం నయన మనోహరంగా ఉంటుంది. ఈ బీచ్ లో తెల్లని ఇసుకు వెండి వెన్నల్లో మిళమిళ మెరుస్తుంటుంది.

వెలాస్ బీచ్ :

వెలాస్ బీచ్ :

ఈ బీచ్ చూడటానికి చాలా అద్భుతంగా ఈ బీచ్ లో టూర్టెల్ ఫెస్టివల్ ను జరుపుతారు. జనవరి మరియు ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ బీచ్ లో తాబేళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు, ఈ బీచ్ లో ఉండే తాబేళ్ళు ఒక్కొక్కటి ఒకసారికి 90-150 గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు 55రోజుల వరకు అలాగే ఉండి తర్వాత విడిగి పిల్లలను చేస్తాయి.

తిలక్ ఆలి మ్యూజియం

తిలక్ ఆలి మ్యూజియం

రత్నగిరి ఆకర్షణలలో చూడదగిన పర్యాటక స్ధలం. ఈ ప్రదేశం ప్రఖ్యాత స్వాతంత్ర పోరాట యోధుడు లోకమాన్య తిలక్ పూర్వీకులది. మ్యూజియం స్ధానిక కొంకణి శిల్పశైలికి అద్దంగా నిలుస్తుంది. ఈ మ్యూజియం తిలక్ జీవిత అంశాలను ఎంతో వివరవంతంగా చిత్రాలు, ఇతర విధాలుగా ప్రదర్శిస్తుంది. ఒక్కసారి ఈ మ్యూజియం దర్శిస్తే చాలు తిలక్ స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాత్ర తీసుకున్నాడనేది తెలిసిపోతుంది. ఆనాటి భారతీయులు స్వాతంత్రం కొరకు పడిన కష్టాలు అర్ధం అవుతాయి.

అంజర్లే బీచ్:

అంజర్లే బీచ్:

ఇది ఒక అద్భుతమైన తెల్లని ఇసుక ఉన్న బీచ్. దీన్ని రత్న గిరి సమీపంలో కనుగొనడం జరిగింది. ఈ బీచ్ లో ప్యారాసైలింగ్ , స్నోర్కెలింగ్ మరియు వైండ్ సర్ఫింగ్ వంటి స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే అక్కడే లోకల్ గా సీఫుడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ అంజ్లే బీచ్ దగ్గ డాల్ఫిన్ కూడా చూడవచ్చు. ఈ బీచ్ కు సమీపంలో కద్యవార్చా గణపతి టెంపుల్ ను సందర్శించవచ్చు.

రత్నగిరి ఎలా చేరుకోవాలి

రత్నగిరి ఎలా చేరుకోవాలి

వాయు మార్గం
రత్నగిరిలో ఒక విమానాశ్రయం నిర్మించబడి ఉన్నప్పటికీ ఇది వాణిజ్య అవసరాలకు ఉపకరించడం లేదు. కనుక మీరు 170 కి. మీ. దూరంలో ఉన్న సాంబ్రే ఏర్‌పోర్ట్ (బెల్గాం ఏర్ పోర్ట్) వద్ద గాని లేదంటే దబొలిమ్ ఏర్ పోర్ట్ ( గోవా ఏర్ పోర్ట్) వద్ద గాని దిగి క్యాబ్ ల ద్వారా గాని లేదా ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా గాని చేరుకోవచ్చు.
రైలు మార్గం
రత్నగిరి లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ దేశం నలుమూలల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడికి చేరువలో మరో రెండు రైల్వే స్టేషన్ లు ఉన్నాయి అవి వరుసగా అదవలి, నివ్సర్ రైల్వే స్టేషన్లు. రోడ్డు మార్గం
రత్నగిరి రాష్ట్ర రాజధాని ముంబయితో జాతీయరహదారి 66 (ముందుగా జాతీయరహదారి 17) ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఈ రహదారి జిల్లాను గోవా మరియు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు లతో అనుసంధానిస్తుంది. కనుక మీకు రోడ్డు మార్గం సులభమైనది. సముద్ర మార్గం జిల్లా పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రతీరంలో పలు చిన్నచిన్న రేవులు ఉన్నాయి.వాటి ద్వారా రత్నగిరి చేరుకోవచ్చు. Photo Courtesy: Shreekanth M

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X