» »కర్ణి మాత ఆలయంలో రాత్రుళ్ళు జరిగే మిస్టరీ

కర్ణి మాత ఆలయంలో రాత్రుళ్ళు జరిగే మిస్టరీ

మన దేశంలో నమ్మకాలను,మూఢనమ్మకాలను నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు.నమ్మనివారు వాటి గురించి పట్టించుకొనటం లేదు.

అయితే ఏదైనా వింతలువిశేషాలు అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తి.అటువంటి ఆసక్తికరమైన దేవాలయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం.

ఆ ఆలయమే రాజస్థాన్ లోని కర్ణీమాతఆలయం.

ఇప్పటివరకు మనం దేవుళ్ళు,దేవతలను వినే వుంటాం కానీ ఈ ఆలయంలో ఎలుకలు ఆ దేవతతో సమానంగా పూజలు అందుకుంటున్నాయి.

అసలు ఈ ఆలయంలో ఎలుకలు ఎందుకు పూజలు అందుకుంటున్నాయి?

అలాగే ఇక్కడ చనిపోయిన ఎలుకలు మళ్ళీ మనుషులుగా జన్మిస్తాయట.

మనుషులుగా పుడుతున్న ఎలుకలు, అసలు కారణం తెలిస్తే షాక్

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

రాజస్థాన్ లోని బికనేకర్ కు సుమారు 30కి.మీ ల దూరంలో డేశ్నోక్ అనే ప్రాంతంలో కర్ణీ మాతా ఆలయం వెలసింది.

ఏమిటి ఈ ఆలయం స్పెషాలిటీ?

ఏమిటి ఈ ఆలయం స్పెషాలిటీ?

ఈ ఆలయంలో దాదాపు 20,000లకు పైగా ఎలుకలు గుడిమొత్తం తిరగాడుతూ వుంటాయి. అలాగే ఇక్కడ 4తెల్లఎలుకలు కూడా వుంటాయి. అవేమిటో తరువాత చూద్దాం.

అద్భుతశక్తులు కలిగినది

అద్భుతశక్తులు కలిగినది

ఈ ఆలయ చరిత్ర విషయానికొస్తే చిన్నతనం నుండే అద్భుతశక్తులు కలిగిన కర్ణీమాతా పేదలకు అండగా నిలబడేదట.

PC: Reeturajesh

అద్భుతశక్తులు

అద్భుతశక్తులు

కర్ణీమాతకు కలిగిన ముగ్గురు సంతానం పురిట్లోనే చనిపోవడంతో తన చెల్లెలిని తన భర్తకు ఇచ్చి వివాహం చేసింది.

PC:Dilkashd

కపిల్ ఎవరు?

కపిల్ ఎవరు?

వారి కుమారుడైన కపిల్ దాహం వేయడంతో సరోవర్ సరస్సు దగ్గర నీళ్ళు తాగే ప్రయత్నంలో అందులో పడిపోయాడు.

PC:Jean-Pierre Dalbéra

పునర్జన్మ

పునర్జన్మ

తన బిడ్డను కాపాడమని కోరడంతో మొదట తిరస్కరించినా ఆ తరువాత దుర్గాదేవీ అనుగ్రహంతో ఆ బిడ్డతో పాటు మిగతా ముగ్గురు బిడ్డలను తిరిగి ఎలుకలుగా పునర్జన్మను కల్పించారు.

PC:Avinashmaurya

గంగాసింగ్ ఎవరు?

గంగాసింగ్ ఎవరు?

వారే ఆ నాలుగు తెల్లఎలుకలు అని చెప్తున్నారు.అయితే కొన్నేళ్ళ తర్వాత కర్ణీమాత కన్పించకుండా అదృశ్యం కావడంతో ఆమె నివాసం వున్న ఇంట్లోనే 15వశతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది.

PC:Fulvio Spada

అన్న ప్రసాదాలు

అన్న ప్రసాదాలు

అయితే ఒకానొక రోజు ఆమె భక్తులతో తమ వంశంలో అందరూ త్వరగా చనిపోతారని, వారు మళ్ళా ఇక్కడే ఎలుకలుగా జన్మిస్తారని,వారికి అన్న ప్రసాదాలు సమర్పించాలని భక్తులను కోరారు.

PC:Schwiki

600కుటుంబాలు

600కుటుంబాలు

మొత్తం 600కుటుంబాలుకు పైగా వారి వంశస్థులువుండేవారట.కాలగమనంలో అందరూ చనిపోయి కర్ణీమాతా చెప్పినట్లుగా ఎలుకలరూపంలో ఈ ఆలయానికి వచ్చారని భక్తులుచెప్తున్నారు.

PC:Shakti

లడ్లు, ఇతరఆహారాలు

లడ్లు, ఇతరఆహారాలు

కర్ణీమాతతో సమానంగా వీటికి పూజలుచేసి పాలు, లడ్లు, ఇతరఆహారాలు వీటికి పెడ్తున్నారు.

PC:Schwiki

ఎలుకలతో వున్న ప్రసాదమా?

ఎలుకలతో వున్న ప్రసాదమా?

అలాగే ఇక్కడకు వచ్చేభక్తులకు ఎలుకలతో వున్న ప్రసాదాన్ని ఇస్తారు.

PC:Vberger

ఆశీస్సులు

ఆశీస్సులు

ఈ ఆలయంలో కనిపించే 4తెల్ల ఎలుకలు కర్ణీమాతాబిడ్డలనీ వారిని చూస్తే కర్ణీమాతఆశీస్సులు లభిస్తాయని,4తెల్లఎలుకలు కనిపించే వరకూ భక్తులు అక్కడే కూర్చుంటారట.

ఇతర దేశాల నుండి కూడా భక్తులు

ఇతర దేశాల నుండి కూడా భక్తులు

ఈ ఆలయాన్ని దర్శించుకోటానికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలనుండి భక్తులు కదలివస్తున్నారు.

రాత్రి కాగానే

రాత్రి కాగానే

వుదయాన్నే ఆలయం మొత్తం తిరుగాడే ఎలుకలు రాత్రి కాగానే గర్భగుడిలోకి వెళ్ళిపోతాయి.

ఇక్కడకు దగ్గరలో చూడదగిన ప్రదేశాలు

ఇక్కడకు దగ్గరలో చూడదగిన ప్రదేశాలు

హాది రాణి మహల్

హాది రాణి మహల్, రాజస్తాన్ లోని నాగౌర్ లో చాలా అందంగా అలంకరించబడిన రాజభవనాలలో ఒకటి. ఈ రాజభవనం గోడలు, పైకప్పు పురాతన చెక్కడాలు, శాసనాల తో అలంకరించబడి ఉంటుంది. పర్యాటకులు ఈ రాజభవనం లోపల కుడ్య చిత్రాల అందమైన సేకరణలను కూడా చూడవచ్చు. కుడ్య చిత్రాలలో ఎక్కువ భాగం అనేకమంది పరిచారికలతో హాది రాణి రాణిని వర్ణిస్తాయి.

కేవల్ దేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్

కేవల్ దేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్

కేవల్ దేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్ లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. షుమారు 250 సంవత్సరాల కిందట సూరజ్ మాల్ మహారాజు నిర్మించిన ఈ పార్క్ ని కేవల్ దేవ్ ఘనా నేషనల్ పార్క్ అనికూడా అంటారు.

చాంద్ బవోరి, అభనేరి

చాంద్ బవోరి, అభనేరి

చాంద్ బవోరి రాజస్ధాన్ లోని అభనేరిలో కలదు. ఇండియాలోని దిగుడు బావులలో కెల్లా అందమైన బావి ఇది. ఈ మెట్ల బావిని 9వ శతాబ్దంలో ఈ ప్రాంతపు రాజు రాజా చంద్ నిర్మించారు. ఈ మెట్లబావులు పురాతన కాలంలో వర్షాల నీటితో నిండి, నీరు అవసరమైన వేసవి కాలంలో వాడుకునేందుకు రిజర్వాయర్లుగా ఉపయోగపడేవి.

జీన్ మాతా, సికార్

జీన్ మాతా, సికార్

జీన్ మాత ఒక గ్రామం, ఇది జీన్ మాత విగ్రహం ఉన్న ప్రసిద్ధ పురాతన ఆలయం. షుమారు 1000 సంవత్సరాల కిందట ఈ మందిరాన్ని నిర్మించారని నమ్మకం. ఈ ఆలయ నిర్మాణ శైలి కష్టమైన రాజపుత్ర నమూనాలను ప్రదర్శిస్తుంది. ఈ ఆలయంలోని 24 అందమైన స్తంభాలూ వివిధ బొమ్మలతో చెక్కబడి ఉంటాయి.

రణధంబోర్ నేషనల్ పార్క్, రనధంబోర్

రణధంబోర్ నేషనల్ పార్క్, రనధంబోర్

ఉత్తర భారత దేశంలో రణధంబోర్ నేషనల్ పార్క్ అతి పెద్ద అటవీ రిజర్వులు కలిగి ఉంది. ఒకప్పుడు ఈ అడవులలో రాజుల వేటలు సాగేవి. 1955 లో ఇది వన్య అభయారణ్యంగా స్ధాపించారు. 1980 సంవత్సరంలో ఱణధంబోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కి నేషనల్ పార్క్ హోదా కలిగించారు. ఇక్కడ పులులే కాక వివిధ రకాల ఇతర జంతువులు, నక్కలు, హయనాలు, మొసల్ళు, అడవి పందులు వివిధ రకాల జింకలు కూడా నివాసం చేస్తాయి.

విమాన ప్రయాణం

విమాన ప్రయాణం

ఎలా చేరుకోవాలి

జోధ్ పూర్ విమానాశ్రయం డెష్నోక్ కు సమీప విమానాశ్రయం. విమానాశ్రయం నుండి డెష్నోక్ కు టాక్సీలు సమంజస రేట్లలో దొరుకుతాయి.

 రైలు ప్రయాణం

రైలు ప్రయాణం

డెష్నోక్ లో రైలు స్టేషన్ కలదు. ఇది జోధ్ పూర్ రైలు స్టేషన్ కు కలుపబడింది. ఇక్కడినుండి దేశంలోని ఇతర రైలు స్టేషన్లకు తరచుగా రైళ్ళు కలవు. అయితే, జోధ్ పూర్ రైలు స్టేషన్ నుండి పర్యాటకులకు క్యాబ్ లు సౌకర్యంగా ఉంటాయి. జోధ్ పూర్ రైలు స్టేషన్ దేశంలోని అనేక నగరాలకు కలుపబడింది.

 రోడ్డు ప్రయాణం

రోడ్డు ప్రయాణం

బస్ ప్రయాణం చేయాలనుకునేవారు ముందుగా బికనీర్ చేరాలి. బికనీర్ నుండి డెష్నోక్ కు క్యాబ్ సౌకర్యం కలదు. బికనీర్ కు దేశంలోని వివిధ నగరాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేట్ వాహనాలు తరచుగా నడుస్తాయి.