Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడికి వెళితే అందరి కంటే ముందే కలియుగాంతం గురించి మీరు తెలుసుకోవచ్చు.

ఇక్కడికి వెళితే అందరి కంటే ముందే కలియుగాంతం గురించి మీరు తెలుసుకోవచ్చు.

హరిశ్చంద్ర ఘాట్ లోని కేదారేశ్వర దేవాలయం గురించి కథనం.

యుగాంతం. ఈ పదాన్ని ఆధారంగా చేసుకొన్ని ఎన్నో కథలు, నవలలు, చివరికి సినిమాలు కూడా వచ్చాయి. ఇక పరిశోధనలకు లెక్కలేదు. ఈ యుగాతం విషయమై ధార్మిక, వేద భూమిగా పేరొందిన భారతదేశంలో పరిశోధనలకు లెక్కలేదు. లయకారకుడైన పరమేశ్వరుడి ఆదేశం మేరకు ఈ యుగాంతం అనే ప్రక్రియ జరుగుతుందని చెబుతారు.

ఇక కలియుగం అంతం తర్వాత ఈ భూ మండలం పై జీవంఉండదని కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది. ఒక్క భారత దేశంలోనేకాకుండా కలియుగానికి సంబంధించిన కథలు, పరిశోధనలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విషయాల పైఅప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.

అలా కలియుగాన్ని 24 గంటలు మందే చెప్పే ఒక గుహాలయం భారతదేశంలోనే ఉంది. మీరు అక్కడికి చేరుకొంటే యుగాంతం గురించిముందుగా తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం మీ కోసం...

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ప్రస్తుతం మనం నివశిస్తున్నది కలియుగం. ఈ యుగం తర్వాత ఈ ప్రపంచం మొత్తం అంతమై పోతుందని భారతపురాణాలే కాకుండా ఇతర దేశాల్లోని చాలా మంది నమ్ముతున్నారు.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

శాస్త్రవేత్తలు కూడా చాలా ఏళ్లుగా ఈ విషయం పై పరిశోధనలు చేస్తున్నారు. భారత పురాణాలను అనుసరించి ఈ మొత్తం ప్రపంచాన్ని క`తయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని విభజించారు.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ప్రతి యుగం తర్వాత భయంకర ప్రళయం ఏర్పడుతుందని అటు పై మరుసటి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతాయి.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

అయితే కలియుగం తర్వాత అటువంటి ధర్మం పునరావ`తం కాదని ఈ స`ష్టి నాశనం తప్పదని చెబుతారు. ఇక ఈ స`ష్టి నాశనాన్ని ముందుగా తెలియజేసే కొన్ని ఘటనలు మనకు గోచరిస్తాయి.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ఆ ఘటనల్లో చాలా వరకూ దేవాలయాల్లో జరుగుతాయి. అటు వంటి దేవాలయం మహారాష్ట్రలో ఉంది. అదే కేదారేశ్వర దేవాలయం. ఇది ఒక గుహాలయం.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ఈ గుహలో నాలుగు రాతి స్తంభాల మధ్య ఒక శివలింగం ఉంటుంది. దీని ఎత్తు ఐదు అడుగులు. ఈ శివలింగంతోపాటు ఈ గుహాలయాన్ని ఎప్పుడు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ఇక ఆ నాలుగు స్తంభాలు ఒక్కొక్క యుగానికి అంటే క`తయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలు. ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా 24 గంటల ముందు ఒక్కో స్తంభం విరిగి పోయిందని స్థానిక కథనం.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ఇదే క్రమంలో విరిగి పోకుండా ఉన్న స్తంభం మనకు కలియుగానికి ప్రతీక. అదే విధంగా విరిగి పోకుండా ఉన్న ఈ స్తంభం అంత పెద్ద రాతి బండను ఎలా మోస్తోందన్న విషయం ఇప్పటికీ తెలియడం లేదు.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ఇక కేదారేశ్వర గుహలో చుట్టూ ఉన్న నాలుగు గోడల నుంచి నిత్యంనీరు వస్తూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోందన్న విషయం పై పరిశోధనలు జరుగుతున్న సమాధానం మాత్రం అందడం లేదు.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ఇక ఈ నీరు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వేసవి, శీతాకాలాల్లో కనిపించే ఈ నీరు వర్షాకాలంలో మాత్రం మనకు కనిపించదు. ఈ విషయం పై కూడా పరిశోధనలు జరిగిన జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ఇక కలియుగానికి సరిగ్గా 24 గంటల ముందు చివరిదైన నాలుగో స్తంభం విరిగిపోతుందని పెద్దలు చెబుతున్నారు. ఇక కలియుగాంతం గురించిన కథలు కేవలం భారతీయ పురాణాల్లోనే కాకుండా అనేక ఇతర పాశ్చత్య దేశాల్లో కూడా ఉంది.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ముఖ్యంగా రష్యా, ఈజిప్టు, వంటి దేశాకు చెందిన గ్రంధాల్లో కూడా మనకు కనిపిస్తాయి. ఇక ఈ కేదారేశ్వర గుహకు దగ్గర్లోనే హరిశ్చంద్రేశ్వర గుడి ఉంది. ఇందులో ప్రధానంగా పూజలు అందుకునేది వినాయకుడు.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

అదే విధంగా ఈ హరిశ్చంద్ర కోట అనేక రాజుల ఆయుధ నిల్వగా ఉంది. ఇక్కడ నీటి నిల్వ కోసం నిర్మించిన ట్యాంకులు అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతిభింబాలు.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ఈ గుహకు దగ్గర్లోనే మంగళ గంగా అనే నది జన్మిస్తుంది. ఈ కేదారేశ్వర గుహాలయం కేవలం ఆధ్యాత్మిక పురాణ పరంగానే కాకుండా ప్రక`తిలో మమేకం కావాలనుకొనే పర్యాటకులను సైతం ఆకర్షిస్తోంది.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడికి దగ్గర్లో ఉన్న పచాని వాటర్ ఫాల్స్ ను చూస్తున్నంత సేపు ఈ లోకాన్నే మర్చిపోతామంటే అతిశయోక్తి కాదు. అంతే కాకుండా సప్త తీర్థ పుష్కరిణి కూడా ఇక్కడ చూడదగిన పర్యాటక కేంద్రాల్లో ఒకటి.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

అదే విధంగా ఇక్కడి తారామతి శిఖరం పై ఉన్న ఈ గుహాలయానికి చేరుకోవడానికి ఎక్కువ మంది ట్రెక్కింగ్ ను ఎంచుకొంటారు. అందువల్ల వారాంతాల్లో ఇక్కడ ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే యువత ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

ప్రక`తి సోయగాల నడుమ నడుచుకొంటూ వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర కోటలో కేదారేశ్వర గుహ ఉంది.

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

కేదారేశ్వర గుహ, హరిశ్చంద ఘడ్

P.C: You Tube

అహ్మద్ నగర్ నుంచి ఈ కేదారేశ్వర గుహకు 146 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం 3.48 గంటలు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎప్పుడైనా గుహను సందర్శించుకోవడానికి వీలవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X