• Follow NativePlanet
Share
» »కేరళ రక్తపు వర్షం నిజమా?

కేరళ రక్తపు వర్షం నిజమా?

కేరళ రాష్ట్రం పర్యాటకతకు మారు పేరు. పచ్చటి ప్రదేశాలు, కొబ్బరి తోటలు, తాటి చెట్ల వరుసల బీచ్ లు, ఆహ్లాదకర బ్యాక్ వాటర్స్ లో బోటు ప్రయాణాలు, అనేక దేవాలయాలు, ఆయుర్వేద వైద్య సుగంధాలు, నిర్మల సరస్సులు, సముద్ర ప్రాంతాలు, కాలువలు, ద్వీపాలు, మొదలైన ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. ఏ ఒక్క ఆకర్షణా వదలదగ్గదికాదు. కేరళ రాష్ట్ర పర్యటన ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన ఒక ఆహ్లాదకర పర్యటన.

నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ ట్రావెల్ ప్లస్ లీషర్ సంస్ధ మేగజైన్ అయిన ట్రావెలర్, కేరళ రాష్ట్రాన్ని ప్రపంచంలోని పది స్వర్గాలలో ఒకటిగాను, జీవితంలో చూడవలసిన 50 పర్యాటక ప్రదేశాలలో ఒకటిగాను, 21వ శతాబ్దంలోని 100 అతి గొప్ప పర్యటనలలో ఒకటిగాను పేర్కొంది.

కేరళ లోని నీటి మార్గాలు - జల విస్తరణ

వర్కాల, బేకాల్, కోవలం, మీనకున్ను, షెరాయ్ బీచ్, పయ్యంబాలం బీచ్, శంగుముఖం, ముజుప్పిలంగాడ్ బీచ్, మొదలైనవి మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే బీచ్ లు. కేరళలోని అద్భుతమైన బ్యాక్ వాటర్స్ అలప్పుజా లేదా అలెప్పీ, కుమరకోం, తిరువల్లం, కొల్లం, కాసర్ గోడ్, మొదలైన చోట్ల కలవు. ఈ ప్రదేశాలు బ్యాక్ వాటర్ అనుభవాలకు ఇష్టపడేవారికి మరచిపోలేని అనుభూతులిస్తాయి. కేరళ బ్యాక్ వాటర్లలో కెట్టువలములు మరియు హౌస్ బోట్లు ఉపయోగిస్తారు. హౌస్ బోట్లు కొద్దిపాటిగా అభివృధ్ధి చెందిన వినోదపు రవాణా వీటిని పర్యాటకులకు వసతిగా కూడా ఉపయోగిస్తారు. బ్యాక్ వాటర్ రిసార్టులు కూడా ఇక్కడ కలవు. సాంప్రదాయక స్నేక్ బోట్ రేసు ప్రతి ఏటా కేరళలో జరుగుతుంది. దీనిని చూసి ఆనందించేందుకు అనేకమంది పర్యాటకులు రాష్ట్రానికి వస్తారు.

వర్షం కురిసేటప్పుడు ఆ వర్షంలో ఐస్ ముక్కలు పడటం ఈ మధ్యకాలంలోనైతే ఏకంగా చేపలే పడటం చూస్తున్నాం. అయితే నేను చెప్పబోయే ఈ వర్షం,వీటన్నిటికన్నా డిఫరెంట్. ఎందుకంటే ఆ వర్షంలో కురిసింది నీరు కాదు రక్తం.

కేరళ రక్తపు వర్షం నిజమా?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1.కేరళ రాష్ట్రం

1.కేరళ రాష్ట్రం

ఈ వింత జరిగింది ఎక్కడో కాదండీ.పచ్చటి ప్రకృతి అందాలకు కొలువైన కేరళ రాష్ట్రంలో. ఈ బ్లడ్ రైన్ 2001 వ సం.లో జులై 25 వ తేది నుండి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు కురిసిందంట.

pc: youtube

 2. వర్షాలు

2. వర్షాలు

అయితే ఇదేమీ మొదటిసారి కాదని 1896నుంచీ ఈ రకమైన వర్షాలు అప్పుడప్పుడు కురుస్తూనే ఉన్నాయనీ అక్కడివారు చెబుతున్నారు.

pc: youtube

3. నమ్మకం

3. నమ్మకం

హిందూ ధర్మాల ప్రకారం రక్తపు వర్షం కురవటం అంటే ఏదో ఒక వినాశనం జరుగుతుందని ఒక నమ్మకం.

pc: youtube

4. ప్రజలు

4. ప్రజలు

ఈ నమ్మకాల వల్ల అక్కడ వున్న ప్రజలు చాలా భయపడ్డారట.

pc: youtube

5. ప్రకృతిలో సంభవించే కొన్ని వింతలు

5. ప్రకృతిలో సంభవించే కొన్ని వింతలు

ఈ వర్షం కేవలం ప్రకృతిలో సంభవించే కొన్ని వింతల మార్పుల వల్ల ఇలా జరిగిందని దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని,కేరళ ప్రభుత్వం, శాస్త్రవేత్తలు చెప్పారు.

pc: youtube

 6. ప్రాధమిక పరీక్ష

6. ప్రాధమిక పరీక్ష

ఈ బ్లడ్ రెయిన్ లో అధికశాతం ఎర్రటి కణాలు వుండటం వల్ల ఈ వర్షం ఎర్రగా వుందని అక్కడ జరిగిన ప్రాధమిక పరీక్ష వల్ల తేలింది.

pc: youtube

7. CESS

7. CESS

అయితే ఈ వర్షం గురించి మరింత లోతైన పరీక్షలు చేయటానికి ఆ వర్షపు శాంపిల్స్ ని సెంటర్ ఫర్ ద ఎర్త్ సైన్సు స్టడీస్ CESS వారికి పంపించారట.

pc: youtube

8. రిపోర్ట్

8. రిపోర్ట్

ఆ సంస్థల వారు చాలా పరిక్షలు చేసి ఒక రిపోర్ట్ ను ఇచ్చారట.ఆ రిపోర్ట్ ప్రకారం ఆ వర్షపు నీటిలో ఉప్పు శాతం లేదని దాని మాంగనీస్,టైటానియం, క్రోమియం మరియు కాపర్ లాంటి పదార్ధాలు వున్నాయని చెప్పారు.

pc: youtube

9. రసాయనిక చర్య

9. రసాయనిక చర్య

ఇదే సంస్థవారు ఇంకొక థియరీని కూడా చెప్పారు. అదేమిటంటే భూమి మీదకొచ్చిన వుల్కలు పేలిపోవటం వల్ల వచ్చిన పొడి మొత్తం మబ్బులో కలసి రసాయనిక చర్య జరగటం వల్ల ఈ రకమైన వర్షాలు కురిసాయని చెప్పారు.

pc: youtube

10. బూడిదరంగు మచ్చలు

10. బూడిదరంగు మచ్చలు

అయితే ఈ వర్షం పడిన ప్రాంతం మాత్రం చాలా తక్కువ. ఈ వర్షం పడిన ప్రదేశాలలో వున్న చెట్ల మీద బూడిదరంగు మచ్చలు వచ్చాయటండీ

pc: youtube

11. ప్రయోగాలు

11. ప్రయోగాలు

ఈ విషయం మీద TBGRI అనే సంస్థ CESS తో కలసి మళ్ళీ కొన్ని ప్రయోగాలు చేసి ఇంకొక రిపోర్ట్ ఇచ్చిందంటండీ.

pc: youtube

 12. ఫంగస్

12. ఫంగస్

ఆ రిపోర్ట్ ప్రకారం ఈ ఎర్రటి వర్షంలో ఒక రకమైన ఫంగస్ లాంటిది వుందనీ,ఈ రకమైన ఫంగస్.

pc: youtube

13. నీటిలో మునిగి వుండే ప్రాంతాలు

13. నీటిలో మునిగి వుండే ప్రాంతాలు

సముద్రాలలో మరియు నీటితో ఎక్కువగా మునిగి వుండే ప్రాంతాలలో వుంటుందని చెప్పారు.

pc: youtube

14. పర్యాటక ఛాయలు

14. పర్యాటక ఛాయలు

చరిత్రను శోధించాలనుకునేవారికి, ఆనందించాలనుకునేవారికి కేరళ రాష్ట్రంలోని ప్రతి పట్టణం, నగరం, అతి చిన్న గ్రామం సైతం తమదైన ప్రత్యేకతలను చాటి ఈ రాష్ట్రానికి గాడ్స్ ఓన్ కంట్రీ అంటే, దేవుడి స్వంత దేశం అనే పేరుని సార్ధకం చేస్తాయి.

pc: youtube

15. పర్యాటక లోకం

15. పర్యాటక లోకం

కేరళలోని కాసర్ గోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం, పలక్కాడ్, త్రిస్సూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, అలపుజ (అలెప్పీ), పాతనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం అనే 14 జిల్లాలలోని పర్యాటక ప్రదేశాలు, పర్యాటకలోకంలో పయనించి ఆనందాలను అనుభవించాలనుకునే వారికి వివిధ ఆకర్షణలతో వారి వారి అభిరుచులను తృప్తి పరుస్తాయి.

16. ఆనందమయ బ్యాక్ వాటర్స్

16. ఆనందమయ బ్యాక్ వాటర్స్

కేరళ పర్యాటకత ఎన్నోఆనందకర అంశాలు కలిగి ఉంది, ఇసుక దిన్నెల బీచ్ లు, ఆనందమయ బ్యాక్ వాటర్స్, పర్వత ప్రదేశాలు, వంటివి విశ్రాంతిలో పునరుజ్జీవనం పొందాలనుకునే వారికి, సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి లేదా ప్రశాంతతతో ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకునేవారికి లేదా శృంగార కేళిలో ఓలలాడాలనుకునే జంటలకు, బిజీ నగర జీవితాలతో సతమతమై అలసి సొలసినవారికి ఒక విశ్రాంతి సెలవుల నిలయంగా ప్రతి ఒక్క ప్రదేశం విరాజిల్లుతోంది.

pc: youtube

17. కేరళ హిల్ స్టేషన్లు- ఎత్తు పల్లాల అద్భుతాలు

17. కేరళ హిల్ స్టేషన్లు- ఎత్తు పల్లాల అద్భుతాలు

కేరళలోని అందమైన మున్నార్ హిల్ స్టేషన్ నేటికి ఎంతో పవిత్రంగా కనపడుతుంది. దక్షిణ ఇండియాలోని ఇతర హిల్ స్టేషన్లతో పోలిస్తే, ఈ ప్రదేశంలో వాణిజ్య కలాపాలు చాలా తక్కువ. హనీమూన్ జంటల శృంగార కేళికి ఈ ప్రదేశం సరైనది.

pc: youtube

18. హిల్ స్టేషన్లు

18. హిల్ స్టేషన్లు

వయనాడ్ కు సమీపంగా ఉంది. వాగమన్, పొన్ముడి, ధెక్కడి, పీర్ మేడ్, మొదలై ఇతర హిల్ స్టేషన్లు కూడా పర్యాటకులు ఆనందించవచ్చు. ధెక్కడి ప్రదేశం వన్యజీవులకు, సాహస క్రీడలకు ప్రసిద్ధి.

pc: youtube

19. దేవుడి విగ్రహాల ఊరేగింపు

19. దేవుడి విగ్రహాల ఊరేగింపు

కేరళలోని త్రిస్సూర్ లో కల అయిరానికులం మహదేవ దేవాలయం, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయం తిరువాళ్ళ శ్రీవల్లభ దేవాలయం, మొదలైనవి కూడా ప్రసిద్ధ దేవాలయాలే. కేరళ దేవాలయాల ఉత్సవాలలో భాగంగా, అక్కడి ఏనుగులు తమ వీపులపై అంబారీలు ధరించి వాటిలో దేవుడి విగ్రహాల ఊరేగింపు చేయటం అచ్చమైన భారతీయ దేవాలయాల సంప్రాదాయంగా కనపడుతుంది.

pc: youtube

20. కేరళ రాష్ట్ర సందర్శన

20. కేరళ రాష్ట్ర సందర్శన

కేరళ ప్రదేశ భూమి జగద్దురువుగా కీర్తించబడే ఆది శంకరా భగవత్పాదుల జన్మతో మరింత పుణ్య భూమిగా మారింది. హిందూ మతానికి అద్వైత వేదాంతాన్ని అందించిన ఈ పరమ పూజ్యులు కేరళలోని కలాడిలో జన్మించి ఆ భూమిని ధన్యవంతం చేశారు. ఇన్ని ప్రాధాన్యతలు కల కేరళ సందర్శనకు మరెందుకు ఆలస్యం? ఎవరెవరికి ఏది కావాలో వాటిని కేరళ అందించి ఆనందింపజేస్తోంది. మరి నేడే మీ సందర్శన ప్రణాళిక చేయండి.

pc: youtube

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి