» »క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం, పాలకొల్లు !!

క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం, పాలకొల్లు !!

Posted By: Staff

LATEST: కొడైకెనాల్లో చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

క్షేత్రం : క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం

ప్రధాన దైవం : శివుడు

ప్రదేశం : పాలకొల్లు, పశ్చిమ గోదావరి

ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో క్రీ.శ. 10 -11 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.

ఇది కూడా చదవండి : గుంటుపల్లి బౌద్ధారామాలు, పశ్చిమ గోదావరి జిల్లా !!

పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు.

గోపురం

గోపురం

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు.

చిత్రకృప : PV Bhaskar

రుణహర గణపతి

రుణహర గణపతి

స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.

చిత్రకృప : Gopal vemu

విశేషమైన పూజలు, ఉత్సవాలు

విశేషమైన పూజలు, ఉత్సవాలు

ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది. ఇక ఇక్కడ పర్వ దినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారినీ, అమ్మవారిని దర్శించుకుంటారు.

చిత్రకృప : PV Bhaskar

స్థలపురాణం

స్థలపురాణం

పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది.

చిత్రకృప : PV Bhaskar

స్థలపురాణం

స్థలపురాణం

క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి.

చిత్రకృప : PV Bhaskar

స్థలపురాణం

స్థలపురాణం

పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం. ​

చిత్రకృప : రహ్మానుద్దీన్

ప్రయాణ వసతులు

ప్రయాణ వసతులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. షుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.

చిత్రకృప : Ramireddy.y

పాలకొల్లు ఎలా చేరుకోవాలి ?

పాలకొల్లు ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - గన్నవరం ఎయిర్ పోర్ట్ - 148 కి.మీ., రాజమండ్రి ఎయిర్ పోర్ట్ - 85 కి.మీ.

సమీప రైల్వే స్టేషన్ : పాలకొల్లు లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తుంటాయి.

రోడ్డు/ బస్సు మార్గం : ఏలూరు, రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి పాలకొల్లు కు బస్సులు కలవు.

చిత్రకృప : PV Bhaskar

Please Wait while comments are loading...