Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలో మీకు తెలియని వింతలు .. విశేషాలు !

భారతదేశంలో మీకు తెలియని వింతలు .. విశేషాలు !

By Venkatakarunasri

మన దేశం ఒక సమ్మీలిత సాగరం. ఈ దేశంలో ఎవ్వరైనా జీవించవచ్చు, దేశం మొత్తం మీద ఎక్కడైనా తిరగేయొచ్చు. ఇక్కడ లెక్కలెన్ని అనుభూతులు అనుభవించవచ్చు. భారత దేశం గురించి చెప్పాలంటే చెప్పలేనన్ని విశేషాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈఫిల్ టవర్ చూస్తే మీరేమంటారు ?? అబ్బో ఎంత ఎత్తుగా ఉందో అని అంటారా? లేదా?

హైదరాబాద్ టాప్ 10 బిర్యానీ హోటల్స్ !

అలాగే మన రాష్ట్రం లో ఉన్న శ్రీశైలం డ్యామ్ ని చూస్తే ఎంత లోతైనదో అని, నాగార్జున సాగర్ ని చూస్తే ఎంత పొడవైనదో అని అంటుంటాము. ఇలాగే మన బారత దేశంలో కూడా చెప్పుకుంటూ పోతే లోతైనవి, పొడవైనవి, పెద్దవి ... ఇలా ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి ఒకసారి తెలుసుకుందామా ..!

ఏపీలో నోరూరించే వంటలు ఎక్కడ తినాలి ?

భారతదేశంలో మీకు తెలియని వింతలు .. విశేషాలు !

ఈ నెలలో టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. సుందర్ బన్స్

1. సుందర్ బన్స్

సుందర్బన్స్, భారతదేశం - బంగ్లాదేశ్ మధ్య విభజించబడిన ఒక పెద్ద మడ అడవుల రిజర్వ్ ప్రాంతం అయినప్పటికీ ఈ నేషనల్ పార్క్ ఎక్కువ భాగం బంగ్లాదేశ్ లో ఉంది, 1/3 వ వంతు భారతదేశంలో ఉంది. ఇక్కడ పర్యాటక సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సుందర్బన్స్ కి రాష్ట్ర రాజధాని కోల్కతా నుండి ప్రతిరోజూ కార్లు, బస్సులు నడుస్తాయి. స్థానిక రెస్టారెంట్లు, రెస్ట్ హౌస్ లు రుచికరమైన స్థానిక ఆహారాన్ని, కొన్ని చాలా తనివితీర్చే సముద్ర జీవుల ఆహారాన్ని అందిస్తాయి.

Photo Courtesy: joiseyshowaa

2. లడఖ్ (జమ్మూ-కాశ్మీర్)

2. లడఖ్ (జమ్మూ-కాశ్మీర్)

సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మరియు జిల్లా కూడా. దీనికి "ఆఖరి శాంగ్రి లా" ( ది లాస్ట్ శాంగ్రి లా) , " చిట్టి టిబెట్" ( లిటిల్ టిబెట్), " చంద్ర ప్రదేశం" ( ది మూన్ ల్యాండ్), " విరిగిన చంద్రుడు" ( ది బ్రోకెన్ మూన్) అనే పేర్లు కూడా ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు, ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు.

Photo Courtesy: sandeepachetan.com travel photography

3. మథుర (ఉత్తర ప్రదేశ్)

3. మథుర (ఉత్తర ప్రదేశ్)

మథుర లో దేశంలో కెల్లా అతి పెద్ద రిఫైనరీ పరిశ్రమ ఉంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ. యమునా నది ఒడ్డున కల మధుర భారతీయ సంస్కృతి మరియు నాగరికతలకు కేంద్రంగా వుంటుంది. ఈ దేశంలో చాలా మంది ప్రశాంత జీవనానికి ఇక్కడ కల ఆశ్రమాలకు వచ్చి ఆనందిస్తారు. ఇక్కడ కల శ్రీ కృష్ణ జన్మ భూమి టెంపుల్ చాలా పవిత్రంగా భావిస్తారు.

Photo Courtesy: Kendash1987

4. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)

4. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)

ఇగ్నో విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఢిల్లీ లో ఉంది. ఈ విద్యాలయం దేశంలో ఉన్న విద్యాలయాలన్నింటిలో అతి పెద్దది. సుమారు దేశం మొత్తం మీద 3 మిలియన్ మంది విద్యార్థులు ఈ విశ్వవిధ్యాలయం లోనే చదువుతుంటారు. మన రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ లలో ఇగ్నో స్టడీ సెంటర్ లు ఉన్నాయి.

Photo Courtesy: ingou

5. సె కెథెడ్రల్ (పాత గోవా)

5. సె కెథెడ్రల్ (పాత గోవా)

సె కెథెడ్రల్ చర్చి అలెగ్జాండ్రియా కేధరిన్ కు అంకితమైంది. సె కేధడ్రల్ ఆఫ్ శాంతా కటారినా అనే పేరుగల ఈ చర్చి ఇండియాలో అతి పెద్ద చర్చిగా చెప్పవచ్చు. ఈ చర్చి కి పర్యాటకులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. ప్రత్యేకించి క్రిస్టమస్ పండుగ సందర్భంలో అధిక సంఖ్యలో వస్తారు. ఈ చర్చి పొడవు సుమారు 250 అడుగులు వెడ్లపు 181 అడుగులు ఉండి 115 అడుగుల ఎత్తున గంభీరంగా ఉంటుంది. పది అంతస్తులకంటే అధిక ఎత్తు కలిగి ఉంటుంది.

Photo Courtesy: Amit Rawat

6. ముంబాయి

6. ముంబాయి

ముంబై లో దేశంలో కెల్లా పెద్ద నౌకాశ్రయం ఉంది. కనుకనే తరచూ గేట్ వే ఆఫ్ ఇండియా గా అభివర్ణిస్తారు. భారత దేశానికి ప్రధాన ఆర్థిక నగరమైన ముంబై, ఎప్పుడో 200 సంవత్సరాల కాలంలో పాలించిన బ్రిటీష్ కాలం నుంచి కూడా వన్నె తగ్గలేదు. ఇక్కడికి దుబాయ్, సౌదీఅరేబియా వంటి దేశాల నుంచే కాకుండా ఆఫ్రికా ఖండం లోని మరికొన్ని దేశాల నుంచి, ఐరోపా ఖండం నుండి ఫెర్రీ లు నడుస్తుంటాయి.

Photo Courtesy: claire.tomkins

7.అండమాన్ మరియు నికోబార్ దీవులు

7.అండమాన్ మరియు నికోబార్ దీవులు

అండమాన్ నికోబార్ దేశంలో కెల్లా పెద్ద దీవులు. ఈ దీవులు రాజధాని పోర్ట్ బ్లెయిర్. గుంపులు లేని ఒంటరి ప్రదేశాలలో మీరు విహరించాలంటే తప్పక ఈ దీవులకి వెళ్లాల్సిందే, వెళ్ళి ఆనందించాల్సిందే ..! మీకు ఇక్కడ లెక్కకు మించి బీచులు స్వాగతం పలుకుతాయి. వందలాది పక్షులు కిల కిల రాగాలు, పూల పరిమళాలు ప్రత్యేకించి కొత్త జంటలకు హనీమూన్ ఆనందాలను మరింత పెంచుతాయి.

Photo Courtesy: Show In My Eyes

8. కోల్ కతా

8. కోల్ కతా

భారత దేశంలో తూర్పు భాగంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని అయిన కోల్ కత్తా వైశాల్యం రీత్యా అతి పెద్ద నగరం. ఈ నగరం లో సినిమా షూటింగ్ లు అనేకం జరుగుతుంటాయి. పురాతన కాలం నుంచి కూడా తూర్పు వర్తకానికి పెద్దదిక్కుగా ఈ నగరం వ్యవహరించినది.పురాతన కాలం నుంచి కూడా తూర్పు వార్తకానికి పెద్దాదిక్కుగా ఈ నగరం వ్యవహరించినది. ఇక్కడున్న విక్టోరియా మహల్, హౌరా వంతెన ఈ నగరానికి ప్రధాన ఆకర్షణలుగా చెప్పుకోవచ్చు.

Photo Courtesy: Christopher J. Fynn

9. తీహార్ (ఢిల్లీ)

9. తీహార్ (ఢిల్లీ)

భారత రాజధాని ఢిల్లీ లో ఉన్న చాణక్యపురి నుంచి ఏడంటే ఏడే కిలో మీటర్ల దూరంలో తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్‌ జైలు అని అంటారు. తీహార్ జైలు, భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము. ఈ జైలులో 6251 మంది సరిపోయే వసతులు ఉన్నా ఎప్పుడూ అంతకన్న ఎక్కువమందికే ఆశ్రమిస్తున్నది. ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊసలు లెక్కబెట్టారు.

Photo Courtesy: kiran

10. ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)

10. ఊలార్ (జమ్మూ-కాశ్మీర్)

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ లో నెలకొని ఉన్న వుల్లార్ సరస్సు భారతదేశం లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు మరియు ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. ఇది వివిధ జాతుల పక్షులు మరియు చేపల కు ఆవాసం. సాధారణ గుండు చేప, రోజీ బార్బ్, దోమ చేప, క్రాసో చేలస్ లాటియస్ , వివిధ రకాల మంచు జల్ల చేపలు ఇక్కడ ఉంటాయి. చేప స్థానికుల ఆహారంలో ముఖ్యమైన భాగం.

Photo Courtesy: Maxx786

11.సాంబార్ (రాజస్థాన్)

11.సాంబార్ (రాజస్థాన్)

సాంబార్ సరస్సు రాజస్తాన్ రాష్ట్రంలోని జైపూర్ పట్టణానికి 96 కి.మీ దూరంలో మరియు అజ్మీర్ నుండి 64 కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడ సముద్రపు నీరు లేకపోయినా ఇక్కడ ఉప్పును తయారు చేస్తారు. ఇది ఆరావళీ కొండల నడుమ ఉన్నది. వర్షములు పడ్డప్పుడు నీరు బాగా నిండుతుంది. కొండల మీద మడులు చేసి నీటిని నిలువ చేసి, నీటి మట్టం తగ్గినప్పుడు ఎండిపోయిన మడి నుండి ఉప్పును తయారుచేస్తారు.

Photo Courtesy: Nawanshu91

12.రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)

12.రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ)

దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరే ఇతర రాజ్యాధినేత కు లేని నివాస గృహం (అధికారిక నివాసం) ఒక్క మన రాష్ట్రపతి కి మాత్రమే ఉంది. ఢిల్లీ లో ఈయన నివసించే గృహాన్ని రాష్ట్రపతి నిలయం అంటారు. దీని నిర్మాణంలో ఎక్కడా స్టీల్ ఉపయోగించకపోవడం గమనార్హం. మొత్తం 340 గదులతో నాలుగు అంతస్తులుగా ఉండే ఈ భవనం లో .... దర్బాలు హాలు, అశోకాహాలు, డైనింగు హాలు, మొగల్ గార్డెన్ లను మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారు. దర్బారు హాలు జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు , అశోకా హాలు మంత్రుల ప్రమాణ స్వీకారణోత్సవాలకు, డైనింగు హాలులో ఒకేసారి 104 మంది కూర్చొని బోజనం చేయడానికి ఉపయోగిస్తారు.

Photo Courtesy: Manoj Kumar Gangadharan

13.జామా మసీదు (ఢిల్లీ)

13.జామా మసీదు (ఢిల్లీ)

భారత దేశంలో పురాతన మసీదులలో ఒకటైన జామా మసీదు ఢిల్లీ లో ఉన్నది. ఈ మసీదు దేశంలో కెల్లా అతి పెద్ద మసీదు గా చరిత్రకెక్కింది. రంజాన్, బక్రీద్ వంటి పండుగలనాడు ఈ మసీదు చూస్తే మీరు నివ్వెరపోతారు. మామూలుగా పవిత్ర రోజైన శుక్రవారం నాడు చేసే ప్రార్థనలకి ఒకేసారి పాతిక వేల మంది హాజరవుతుంటారు. 40 మీటర్ల ఎత్తుతో తెల్ల పాలరాయి మరియు ఎర్ర ఇసుకరాయితో చేసిన నాలుగు స్తంభాలు గల టవర్లున్నయి.

Photo Courtesy: Muhammad Mahdi Karim

14.గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)

14.గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)

కర్నాటక రాష్ట్రం లోని బీజాపూర్ లో ఎంతో చారిత్రక ప్రాధాన్యతగల గోల్ గుంబజ్ ఉంది. ఇది భారత దేశంలో అతి పెద్ద సమాధి మరియు ప్రపంచంలో రెండవ అతిపెద్ద సమాధి. బీజపూర్ సుల్తాన్ మహమ్మద్ అదిల్ షా సమాధి. ఈ డోమ్ లోపలి భాగాలు ఏ ఆధారం లేకుండా నిలవటం అనేది ఒక మిస్టరీగా ఉంటుంది. సంగీత గాయకులు ఇందులో కూర్చుని కచేరీ చేస్తే అది అన్ని వైపులా వినబడుతుంది.

Photo Courtesy: Mukulb

15. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

15. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంక్ లలో పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. ప్రధాన కేంద్రం ముంబై లో ఉన్నది.

Photo Courtesy:Roshan Panjwani

 16. గోవింద సాగర్ (హిమాచల్ ప్రదేశ్)

16. గోవింద సాగర్ (హిమాచల్ ప్రదేశ్)

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో ప్రవహించే సట్లెజ్ నదిపై గోవింద్ సాగర్ అనే మానవనిర్మితమైన సరస్సు కలదు. ఇది దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు. ఇది బాక్రానంగల్ ఆనకట్ట వలన సాధ్యమైనది. ఇక్కడి వంతెనపైనున్న రహదారి ఆసియాలోనే రెండవ అతి పెద్ద వంతెన గా నిలిచింది.

Photo Courtesy: Vishal Majithia

17.శైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం

17.శైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం

ఆంధ్ర రాష్ట్రం లోని శ్రీశైలం పుణ్యక్షేత్రం లో చూడదగిన ప్రదేశాలలో టైగర్ వ్యాలి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇది ఇండియా లోనే అతి పెద్ద టైగర్ రిజర్వు గా పేరొందినది. సుమారు 3568 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి వుంది. ఈ అడవిలో పులులతో పాటు మరెన్నో వన్య ప్రాణులు చూడొచ్చు. ఇక్కడకి వచ్చిన పర్యాటకులు జంగల్ సఫారీ చేస్తుంటారు. ఇక దీనికి తోడు అటవీ అందాలు, పచ్చని ప్రకృతి సోయగాలు ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు.

Photo Courtesy: Nori Syamsunder Rao

18.మజులి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్)

18.మజులి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్)

సాంస్కృతిక వారసత్వంతో ముస్తాబైన ముగ్దమనోహర నదీ ద్వీపం మజులి ద్వీపం. చరిత్ర, సంస్కృతితో నిండిన గొప్ప ప్రదేశం కావడంతో ఇది అస్సాం రాష్ట్ర ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. మజులి ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపమే కాక, నవీన వైష్ణవమతానికి అస్సాంలోనే పెద్ద పీట కల్గినది కూడా.

Photo Courtesy: Suraj Kumar Das

20. థార్ ఎడారి

20. థార్ ఎడారి

థార్ ఎడారి భారత దేశానికి, పాకిస్థాన్ కి సరిహద్దులో 2 లక్షల పై చిలుకు చ. కి. మీ. లలో రాజస్థాన్ రాష్ట్రం లో విస్తరించి ఉంది. ఇది దేశంలో ఉన్న అతి పెద్ద ఎడారిగా గుర్తింపు పొందింది. అందుకే కాబోలు దీనిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని పిలుస్తుంటారు. ప్రపంచంలో సహారా ఎడారి ఎలాగో ... మనకు ఇది అలాగనమాట !

Photo Courtesy: Flicka

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X