Search
  • Follow NativePlanet
Share
» »ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

By Venkatakarunasri

ఏ ధర్మమైనా, ఏ జాతియైనా భగవంతుడికి మాత్రం భేదభావం లేదు. దేవుడు ఒక్కడే పేర్లు అనేకం అనే మాట ఎల్లప్పుడూ మన చెవులలో మారుమ్రోగుతూనేవుంటుంది.భగవంతునికి పేదవాళ్ళు, ధనవంతులు, పెద్దవారు, చిన్నవారు, జాతి, కుల, ధర్మాలకు ఏవిధమైన సంబంధం లేదు. ఎవరు భక్తితో అతనిని పూజిస్తారో వారిని కాపాడుతాడన్నమాట.ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా?

మరైతే వినండి ఇక్కడొక దేవాలయం వుంది. అది ఒక హిందూ దేవాలయం.ఆ దేవాలయంలో ఏ ధర్మం అనే బేధభావం లేకుండా ముస్లింలు కూడా ప్రవేశం కల్పించబడినది. ఆ దేవాలయం ఏది? అక్కడి మహాత్యమేమిటి? అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు వ్యాసంమూలంగా సంక్షిప్తంగా తెలుసుకోండి.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

రాయలసీమ ప్రాంతం లో ఉన్న మునిసిపల్ నగరం అయిన కడప, దక్షిణ భారత దేశ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ దక్షిణ మధ్య ప్రాంతం లో ఉంది. వాకిలి, ద్వారం, ప్రవేశ మార్గం అనబడే అర్ధాలు వచ్చే తెలుగు పదం 'గడప' నుండి కడప అనే పేరు ఈ నగరానికి వచ్చింది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

కడపకి పశ్చిమవైపున ఉన్న పవిత్ర క్షేత్రం మైన తిరుమల కి ఈ నగరం ప్రవేశ మార్గం గా ఉండడం వల్ల ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. 2010 ఆంగ్లం లో Cuddapah అనబడే ఈ పట్టణం వర్ణక్రమాన్ని Kadapa గా మార్చారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

హైదరాబాద్ నగరం నుండి ఈ నగరం 412 కిలోమీటర్ల దూరం లో ఉంది. పెన్నా నదికి అతి సమీపంలో ఈ నగరం ఉంది. నల్లమల ఇంకా పాలకొండ నడుమ ఈ నగరం ఉంది. చోళ సామ్రాజ్యంలో ముఖ్య భాగంగా ఈ నగరం పదకొండు నుండి పద్నాలుగు శతాబ్దాల మధ్యలో పరిగణించబడింది. పద్నాలుగవ శతాబ్దం తరువాత, ఈ నగరం విజయనగర సామ్రాజ్యంలో కలిసిపోయింది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

దాదాపు రెండు శతాబ్దాలు విజయనగర సామ్రాజ్యం మొత్తం గండికోట నాయకుల చేత పరిపాలింపబడింది. విజయనగర చక్రవర్తుల యొక్క గవర్నర్స్ గా వ్యవహిరించిన ఈ నాయకులు ఈ ప్రాంతం లో అనేకమైన టాంకులు అలాగే ఆలయాలు నిర్మించారు. కడప, 1565 లో గోల్కొండ ముస్లిం రాజులచేత ఆక్రమించుకోబడినది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఎన్నో ద్రోహమైన చర్యల ద్వారా అప్పటి రాజైన చిన్న తిమ్మ నాయుడు ని ఓడించి గండికోటని మీర్ జుమ్లా ఆక్రమించాడు. ఆ తరువాత, ఖుతుబ్ షాహీ పరిపాలకుడైన నేక్నం ఖాన్ కడప యొక్క సరిహద్దుల్ని విస్తరింపచేసి వాటిని నేక్నామాబాద్ గా పిలిచేవాడు. అయినప్పటికీ, చరిత్రకి సంబంధించిన విషయాల గురించి తెలియచేసేటప్పుడు చరిత్రకారులు 'నేక్నామాబాద్ నిజాములు' అని ప్రస్తావించడం కంటే 'కడప నిజాములు' గా నే ప్రస్తావిస్తారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

మసీదులు, దర్గాలు నిర్మించడం ద్వారా నవాబులు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మరియు నిర్మాణ కళల కు ఏంతో దోహదపడ్డారు. సుమారు 1800 సంవత్సరం సమకాలీన సమయంలో, బ్రిటిష్ వారు కడప ని వారి అధీనం లో కి తీసుకుని, వారి నలుగురు అధీన కలేక్టోరేట్స్ లో ఒకరికి ఈ ప్రాంతాన్ని ప్రధాన కార్యాలయంగా మార్చారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఈ ప్రాంతానికి ప్రధాన కలెక్టర్ అయిన సర్ థామస్ మున్రోనేతృత్వంలో ఈ ప్రధాన కార్యాలయం ఉండేది. మూడు చర్చిలని ఈ నగరం లో బ్రిటిష్ వారు నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ నగరం మున్సిసిపాల్ కార్పొరేషన్ లో భాగం అయ్యింది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

మీరు ఎప్పుడైనా విన్నారా? హిందూ దేవతల దేవాలయంలో ముస్లింలు స్వామి దర్శనానికి క్యూలో నిలబడటం? మరైతే వినండి ఆ దేవాలయం ఏదంటే ఆంధ్రప్రదేశ్ లోని పెరుమాళ్ దేవాలయం.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

పెరుమాళ్ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలో వుంది.అదే శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర పెరుమాళ్ దేవాలయం. అదేవిధంగా ఈ మహిమాన్వితమైన దేవాలయానికి అనేకమంది భక్తులు ప్రతిరోజూ సందర్శిస్తారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఆంధ్రప్రదేశ్ లోని కడప అత్యంత సాంప్రదాయమైన నగరం. లక్ష్మీదేవిని, వేంకటేశ్వరస్వామిని అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ధనవంతులు కావాలనే కోరిక ప్రతిఒక్కరికీ సాధారణంగా వుంటుంది. అందువలన ఈ ఆలయాన్ని భక్తులు తండోపతండాలుగా సందర్శిస్తారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఈ దేవాలయం కడప నగరంలో అత్యంత ప్రసిద్ధమైనది. నూతన సంవత్సరం రోజున తెలుగు ప్రజలు చాలామంది ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శిస్తారు. స్వామి దర్శనంకోసం క్యూలో నిలబడివుండటం మీరు ఈ చిత్రంలో చూడవచ్చును.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఇక్కడ హిందువుల వలె ముస్లింలు కూడా శ్రీ వేంకటేశ్వరస్వామిని భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తారు.ఇక్కడ గర్భగుడిలో స్వామికి పూలు, బెల్లం, చెరకు, పసుపు, నిమ్మకాయలను భగవంతునికి అర్పిస్తారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఈ దేవాలయాన్ని ముస్లింలు ఎంతో భక్తితో, గౌరవంతో సందర్శిస్తారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు వున్నా కూడా ఈ దేవాలయాన్ని సందర్శనకు వచ్చే భక్తులు మాత్రం తగ్గరు. దర్గాకు వచ్చే విధంగా భక్తజనసాగారం ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఇక్కడి పెరుమాళ్ స్వామి సందర్శించడానికి ముస్లింల సందర్శన వెనుక గొప్ప కథ కూడా ఉంది. కడప దేవాలయం ఒక అద్భుతమైన దేవాలయం మరియు పేదలు ధనవంతులవుతారని ప్రజలు నమ్ముతారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

కిష్కిందకాండ హిందూ మత ఇతిహాసమైన రామాయణం ప్రకారం, రామాయణం లోని ఏడు కాండల లో ఒకటైన కిష్కిందకాండ భాగం కడప జిల్లాలో ఉన్న వొంటిమిట్ట అనే ప్రాంతంలో జరిగింది. కడప ప్రధాన నగరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ వొంటిమిట్ట నగరం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రసిద్ది చెందిన గండి అనే గ్రామం కడప కి సమీపంలో ఉంది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

హనుమంతునికి అంకితమివ్వబడిన ఈ ఆలయంలో ఉన్న హనుమంతుల వారి విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీ రాముల వారే స్వయంగా మలచారని భక్తుల నమ్మకం. బాణాలు కొన్ని ఉపయోగించి హనుమంతుల వారి విగ్రహాన్ని ఒక రాతిపై శ్రీ రాములవారు మలచారని అంటారు. సీతమ్మ వారిని కనిపెట్టినందుకు హనుమంతులవారికి గౌరవార్ధం శ్రీ రాముడు ఈ విగ్రహాన్ని మలచారని అంటారు. దీనిని రాష్ట్రంలో ఒక ప్రధాన పర్యాటక మజిలీ గా ప్రస్తుత కాలంలో కడప ని పేర్కొనవచ్చు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

అమీన్ పీర్ దర్గా, భగవాన్ మహావీర్ మ్యూజియం, చాంద్ ఫిరా గుంబద్, దెవునికడప ఇంకా మసీద్-ఎ-అజాం వంటి ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలు ఈ ప్రాంతం లో ఉన్నాయి. ఏడాది పొడవునా ఉష్ణ వాతావరణం ఈ ప్రాంతం లో ఉంటుంది. తీవ్రమయిన ఎండాకాలం, పాక్షికంగా ఉండే శీతాకాలం తో పాటు మూడు నెలల కాలం వరకు ఉండే వర్షాకాలం లో నమోదయ్యే సాధారణ వర్షపాతాలు ఈ కడప ప్రత్యేకత. వాయు, రైలు, రోడ్డు మార్గం ద్వారా కడపకి సులభంగా చేరుకోవచ్చు. నగరం నడిబొడ్డు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ నగరంలో దేశీయ విమానాశ్రయం ఉంది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముంబై - చెన్నై లైన్ లో ఉన్న రైల్వే స్టేషన్ లో అనేక రైళ్ళు తరచుగా వస్తూ ఉంటాయి. చక్కటి రోడ్డు రవాణా మార్గం ద్వారా ఈ నగరం రాష్ట్రం లో ని మిగతా నగరాలకు అనుసంధానమై ఉంది. కడపకి చేరుకునేందుకు, క్యాబ్స్ అలాగే బస్సులు అందుబాటులో కలవు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు

దెవునికడప, కడప

హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన దెవునికడప అత్యంత ప్రాముఖ్యత కలిగినది. తిరుమల తిరుపతి దేవుని యొక్క ఆశీస్సులు కోరుకునే భక్తులు వారి తీర్ధయాత్ర లు పూర్తి అయినట్టుగా భావించాలంటే తప్పకుండా ఈ దేవుని కడపని సందర్శించవలసిందే. తిరుమల తొలి గడప దేవుని కడప గా ప్రాచుర్యం పొందింది దేవుని కడప.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ప్రఖ్యాతి చెందిన శ్రీ లక్షీ వెంకటేశ్వర ఆలయం ఇక్కడ ఉంది. గురు కృపాచార్య చేత ఈ ఆలయం లో వెంకటేశ్వర స్వామీ వారి విగ్రహం ప్రతిష్టింపబడినది. అందువల్ల పురాణాలలో కూడా ఈ దేవాలయం గురించి ప్రస్తావించబడినది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

కృపావతి క్షేత్రంగా ఆ కాలం లో ఈ ఆలయం ప్రసిద్ది చెందింది. అన్నమాచార్యుల వారిని అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మొదట ప్రార్ధించిన తరువాత తిరుపతి ప్రయాణానికి యాత్రికులు పయనమవుతారు. పూజలు చెయ్యడానికి ఏంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. వారం పొడవునా ఈ ఆలయం భక్తుల సందర్శనతో కిటకిట లాడుతూనే ఉంటుంది. శనివారాలు అయితే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

అమీన్ పీర్ దర్గా, కడప

కడప నగరంలో ఉన్న సూఫీ మందిరం అమీన్ పీర్ దర్గా. అన్ని మతాల ప్రజలచే సందర్శింపబడే ఈ మందిరం అత్యంత ప్రఖ్యాతి చెందినది. సామాజిక సామరస్యానికి ప్రతీక అయిన ఈ మందిరం అన్ని రోజుల్లో తెరిచే ఉంటుంది. పర్యాటకులు అలాగే స్థానికులు ఈ మందిరానికి విచ్చేస్తూ ఉంటారు. గురు, శుక్ర వారాల్లో అన్ని మతాల ప్రజలు పీరుల్లా హుస్సైని మరియు అరుఫుల్ల హుస్సైని అనే ఇద్దరి సాధువుల యొక్క దీవెనలు అందుకునేందుకు ఈ దర్గాకి విచ్చేస్తారు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఈ మందిరంలో ఈ సాధువుల యొక్క సమాధులు ఉన్నాయి. ఇక్కడ ప్రార్ధించడం ద్వారా కోరికలు తీరతాయని ప్రజల నమ్మకం. ఈ ఇద్దరు సాధువుల వారసులు కూడా ఈ మందిరంలో పనిచేస్తున్నారు. వేరే సిబ్బంది నుండి వీరిని గుర్తించేందుకు సులువుగా కాషాయ దుస్తులు వీరు ధరిస్తారు. కాషాయ రంగు టోపీ ల నే ఈ ఇద్దరు సాధువుల యొక్క భక్తులు ధరిస్తారు. ప్రవక్త మహమ్మద్ యొక్క వారసుడు పీరుల్లహ్ హుస్సేన్ అని ఎక్కువ మంది నమ్మకం. భారత దేశం లో ని అన్ని సూఫీ సాధువుల దర్గాలని సందర్శించే ఇతను అజ్మీరు విన్నపం వల్ల కడప లో స్థిరపడ్డారు.

ఇవన్నీ భారత దేశం లో జైన మతం వృద్ది చెందుతున్న సమయంలోని ప్రాచీన కాలానికి చెందినవి. క్రీస్తు శకం అయిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు పట్టణాలుగా వర్ధిల్లిన నందలూర్, గుండ్లూరు, తిమ్మాయపాలెం, అత్తిరాల, మంతమపంపల్లీ, పోలి, కొలతుర్, అలాగే మరెన్నో ప్రాంతాలనుండి సేకరించిన వస్తువులను ఈ మ్యూజియం లో గమనించవచ్చు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

పురావస్తు శాఖ తవ్వ కాలలో బయట పడిన కళాకృతులని భగవాన్ మహావీర్ మ్యూజియం లో భద్రపరిచేందుకు కడపకి తీసుకువచ్చారు. ఏనుగు ఆకారంలో కనిపించే వినాయకుడు, జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం, శివుని తలపై నుండి కాకుండా పక్క నుండి పారుతున్న గంగతో శివుని విగ్రహం వంటి కొన్ని అరుదైన కళాకృతులు ఈ మ్యూజియం లో గమనించవచ్చు.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం

కడప నగరానికి ఎన్నో ప్రైవేట్ బస్సులు అలాగే గవర్నమెంటు బస్సులు తరచూ తిరుగుతూ ఉంటాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ రోడ్డులు చక్కగా నిర్వహించబడతాయి. తిరుపతి, కృష్ణాపురం, విజయవాడ, గుంటూరు అలాగే హైదరాబాద్ వంటి సమీప నగరాల నుండి బస్సులు తిరుగుతూ ఉంటాయి. కర్ణాటకా మరియు తమిళ్ నాడు వంటి రాష్ట్రాలు కూడా కొన్ని ప్రత్యేక బస్సులని ఈ ప్రాంతానికి ఏర్పాటు చేసాయి.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

రైలు మార్గం

దేశంలోని మిగతా ప్రాంతాలకి రైలు మార్గం ద్వారా కడప చక్కగా అనుసంధానమై ఉంది. చెన్నై - ముంబై రైల్వే లైన్ లో ఉన్న కడప రైల్వే స్టేషన్ లో తరచూ ఈ రెండు పట్టణాల నుండి రైళ్ళు తిరుగుతూ ఉంటాయి. కడప కి దగ్గరలో ఉన్న మరొక రైల్వే స్టేషన్ కృష్ణాపురం రైల్వే స్టేషన్ మరియు తిరుపతి రైల్వే స్టేషన్.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

వాయు మార్గం

ప్రధాన నగరం కడప నుండి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో స్వదేశీ విమానాశ్రయం ఉంది. హైదరాబాద్ మరియు తిరుపతి నుండి మాత్రమే విమానాలు ఈ విమానాశ్రయానికి వస్తాయి. కడప నుండి 134 కిలో మీటర్ల దూరం లో తిరుపతి విమానాశ్రయం ఉంది.

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

ముస్లింలు భక్తితో పూజించే హిందూ దేవాలయమిది....

అయినా ఇది కూడా దేశీయ విమానాశ్రయం మాత్రమే. అతి సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న విమానాశ్రయం. కడప విమానాశ్రయం నుండి టాక్సీ లేదా ఆటో రిక్షా ద్వారా నగరానికి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more