Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోనే ప్రమాదకరమైన మలుపుల మార్గాలు..!

దేశంలోనే ప్రమాదకరమైన మలుపుల మార్గాలు..!

దేశంలోనే ప్రమాదకరమైన మలుపుల మార్గాలు..!

ఒంపులు తిరుగుతూ వయ్యారాలు పోయే దారుల్లో రయ్ మంటూ దూసుకుపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి ప్రయాణాల్లోనే ఆహ్లాదం, ఆనందంతోపాటు ప్రమాదాలు పొంచి ఉంటాయని గుర్తించాలి. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రమాదకర మలుపులు ఉన్న అలాంటి దారుల్లో మాత్రమే లాంగ్ రైడ్ కి వెళ్లాలి అనుకునేవారికి మన దేశంలోనే అనేక అనువైన మార్గాలు ఉన్నాయి. వీటిపై ప్రయాణిస్తే సరిగ్గా శ్వాస ఆడదు. త్వరగా అలసిపోతారు. తలతిరిగినట్లు అనిపిస్తుంది. డ్రైవింగ్లో ఎంతో అనుభవం కలిగిగిన వారు మాత్రమే ఈ రోడ్లపై వాహనాలను నడపగలరు. మరెందుకు ఆలస్యం దేశంలోనే పేరొందిన డేంజరస్ రోడ్డు మార్గాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

rothang pass

రోహతంగ్ పాస్

రోహతంగ్ పాస్మనాలికి 53 కి.మీ. దూరంలో ఉంది రోహతంగ్ పాస్. ఇది ఉత్తర భారతంలోనే అతి ఎత్తయిన కొండ మార్గం. ఆ మార్గంలో పర్వతాలు, లోయలు, అందమైన నదీ ప్రవాహాలు టూరిస్టులను ఆకర్షిస్తాయి. అయితే ఈ మార్గంలో ఎక్కువగా కొండ చరియలు విరిగిపడతాయి. ఒంపులు తిరిగే ఈ మార్గంలో రైడ్ మంచి అనుభూతులను అందిస్తుంది.

గాటా లూప్స్

గాటా లూప్స్

ఇక్కడ 21 హెయిర్ పిన్ లూప్స్ ఉంటాయి. లద్దాఖ్లో ఉన్న ఈ మార్గం అడ్డదిడ్డంగా ఉంటుంది. డ్రైవింగ్లో ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే ఈ మార్గంలో వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అదుపు తప్పినా ఇక అంతే సంగతులు.

జోజిలా పాస్

జోజిలా పాస్

శ్రీనగర్ నుంచి లేహ్ వెళ్లే ఎన్హెచ్ -1పై ఉంటుంది జోజిలా పాస్. ఈ మార్గంలో కారును నడపడం అంత ఈజీ కాదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ముందుకు వెళ్లాలి. చుట్టూ లోయలతో నిండి ఉండే ఈ మార్గం అడ్వేంచర్ రైడ్లకు అనువైనదిగా చెప్పవచ్చు.

హిల్ రోడ్డు

తమిళనాడులో ఉండే ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరమైనది. ఎంత సీనియర్ డ్రైవర్ అయినా ఈ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ వరుసగా 70 హెయిర్ పిన్ టర్న్స్ ఉంటాయి. వాటిని దాటి వెళ్లడం అంత ఈజీ కాదు.

జిజాంగ్ రోడ్డు

జిజాంగ్ రోడ్డు

ఇది సిక్కింలో ఉంటుంది. పర్వత ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రహదారిలో ఎన్నో మలుపులు ఉంటాయి. అక్కడి శిఖరాగ్రం నుంచి చూస్తే ప్రకృతి కప్పేసిన పచ్చని తివాచీ అందాలను వీక్షించవచ్చు. అయితే, అటు వైపు వెళ్లేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

సంగ్లా రోడ్డు

హిమాచల్ ప్రదేశ్లో ఉండే ఈ రోడ్డు చాలా ప్రమాదకరమైనది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రాణానికే ప్రమాదం.

బుమ్లా పాస్

అరుణాచల్ ప్రదేశ్లోని పర్వత ప్రాంతాల్లో సముద్రమట్టానికి 16 ఫీట్ల ఎత్తులో ఈ రోడ్డు ఉంటుంది. ఎన్నో మలుపులు, రాళ్లు రప్పలతో ప్రమాదకరంగా ఉంటుంది.

 లేహ్-మనాలి హైవే

లేహ్-మనాలి హైవే

ప్రమాదకరమైన మార్గాల్లో ఇదీ ఒకటి. వర్షాకాలం ఈ రోడ్డులో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. అయినా సరే ఔత్సాహికులు సాహసంలో భాగంగా ఈ రోడ్డు ప్రయాణాన్ని ఇష్టపడుతుంటారు. శీతాకాలంలో ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది. మంచు కారణంగా నేవిగేషన్ ఇబ్బందులు తలెత్తి దారి తప్పిపోయే ప్రమాదముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X