» »టెంకాయలు పగలకొడుతున్న హనుమంతుని విగ్రహం !

టెంకాయలు పగలకొడుతున్న హనుమంతుని విగ్రహం !

Written By: Venkatakarunasri

గుజరాత్ లోని సరంగ్ పూర్ జిల్లాలోని ఆంజనేయుడి దేవాలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటుంటారు. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత వుంది. ఇక్కడ వుండే హనుమంతుని విగ్రహం చాలా ప్రత్యేకమైనది. భక్తులు తన నోట్లో వేసిన కొబ్బరికాయలను ముక్కలుగా చేసి ఆశీర్వదిస్తుంది.

గుజరాత్ పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రము. ఇది మహారాష్ట్ర తరువాత దేశంలో పారిశ్రామికీకరణలో రెండవ స్థానంలో ఉంది. దేశంలోనే అత్యధిక సముద్రతీరం కలిగిఉన్న రాష్ట్రం. గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది నమూనా ప్రకారం నిర్మించిన నగరం. గుజరాత్‌లోని అతి పెద్ద నగరమైన అహమ్మదాబాదు దీనికి దగ్గరలోనే ఉంది.

రోజులో కాసేపు మాత్రమే కనిపించే దేవాలయం ! ఎక్కడుందో మీకు తెలుసా?

మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయి పటేల్ - ఈ ఇద్దరు ప్రసిద్ధ జాతీయోద్యమ నాయకులు గుజరాత్‌కు చెందినవారు. ప్రస్తుతం 'గుజరాత్' అనబడే ప్రాంతంలో హరప్పా నాగరికత కాలంనాటి అవశేషాలు బయటపడటం వల్ల ఇది పురాతనమైన సంస్కృతికి కేంద్రమనవచ్చును.

ఒకే కొండ మీద 1000కి పైగా దేవాలయాలు ఎక్కడ వున్నాయో మీకు తెలుసా ?

వ్యాపారానికి అనువైన తీరప్రాంతము ఉన్నందున మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం రాజ్యాలకాలంనుండి ఇది వర్తక కేంద్రముగా విలసిల్లింది. గుజరాతీ ఇక్కడి ప్రధాన భాష. పోర్చుగీసు వర్తకులు గుజరాత్ ప్రాంతానికి వచ్చి డామన్, డయ్యు, దాద్రా, నగర్ హవేలీ, మరికొన్ని స్థావరాలు ఏర్పరచుకొన్నారు. ముఖ్యమైన పర్యాటక స్థలాలు: పాలిటానా, డయ్యు, కచ్, జామ్‌నగర్, జునాగఢ్, రాజ్‌కోట్.

టెంకాయలు పగల కొడుతున్న హనుమంతుని విగ్రహం !

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

సరంగ్ పూర్ జిల్లా

సరంగ్ పూర్ జిల్లా

గుజరాత్ లోని సరంగ్ పూర్ జిల్లాలోని ఆంజనేయుడి దేవాలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటుంటారు. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత వుంది.

pc:youtube

హనుమంతుని విగ్రహం

హనుమంతుని విగ్రహం

ఇక్కడ వుండే హనుమంతుని విగ్రహం చాలా ప్రత్యేకమైనది. భక్తులు తన నోట్లో వేసిన కొబ్బరికాయలను ముక్కలుగా చేసి ఆశీర్వదిస్తుంది.

pc:youtube

కొబ్బరికాయ

కొబ్బరికాయ

దేవాలయం వెలుపల ఏర్పాటుచేసిన ఈ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆంజనేయుడు నోట్లో వేసిన కొబ్బరికాయ రెండు ముక్కలై విగ్రహం చేతుల్లోకి వస్తుంది.

pc:youtube

 సాంప్రదాయం

సాంప్రదాయం

ఇదేం సాధ్యం, ఇందులో రహస్యం ఏంటనే సందేహం ప్రతిఒక్కరికీ కలుగుతుంది. హిందూ దేవాలయాలలో కొబ్బరికాయను కొట్టడం సాంప్రదాయంగా భావిస్తారు.

దెయ్యాల బీచ్ గురించి మీకు తెలుసా ?

pc:youtube

మంచి

మంచి

ఎందుకంటే దీనివల్ల మంచి ఒరుగుతుందనేది ప్రజల భావన. సాంప్రదాయం ఆలయాల్లో కొనసాగుతున్నా శుభ్రతపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుంది.

హనుమాన్ ఆవహించి ఊగిన విగ్రహం !

pc:youtube

సరంగ్ పూర్ దేవాలయాల కమిటీ

సరంగ్ పూర్ దేవాలయాల కమిటీ

ఆలయాల పరిసరాల పరిశుభ్రత కోసం చాలా మంది కార్మికులు పని చేస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులు అధిగమించటానికి సరంగ్ పూర్ దేవాలయాల కమిటీకి ఒక ఐడియా వచ్చింది.

pc:Bhargavinf

నోట్లో కొబ్బరికాయలు

నోట్లో కొబ్బరికాయలు

కొబ్బరికాయలు పగలగొట్టే యంత్రాన్ని కొనుగోలు చేసి ఆలయం బయట హనుమంతుని విగ్రహంలో ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు నోట్లో కొబ్బరికాయలు వేస్తే నోట్లో వుండే యంత్రం రెండుగా విడగొడుటుంది.

గుజరాత్ - ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు !

pc:AroundTheGlobe

తండోపతండాలుగా భక్తులు

తండోపతండాలుగా భక్తులు

విడిపోయిన భాగాలు విగ్రహం చేతిలో నుంచి బయటకు వస్తాయి. గత ఏడాది ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనిని దర్శించుకోటానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఇండియాలో వింత ప్రదేశాలు !

pc:MV Sharma