Search
  • Follow NativePlanet
Share
» »తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు దేశ విదేశాలనుండి ప్రతీరోజూలక్షలసంఖ్యలో భక్తులోస్తూవుంటారు. అందుకే ఎప్పుడుచూసినా శేషాచల కొండలు తిరునామస్మరణతో మారుమ్రోగుతూవుంటాయి.

By Venkatakarunasri

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు దేశ విదేశాలనుండి ప్రతీరోజూలక్షలసంఖ్యలో భక్తులోస్తూవుంటారు. అందుకే ఎప్పుడుచూసినా శేషాచల కొండలు తిరునామస్మరణతో మారుమ్రోగుతూవుంటాయి. బ్రహ్మోత్సవాలసమయంలో రద్దీ చాలా ఎక్కువగా వుంటుంది. భక్తులు వేసే కానుకలరూపంలో ప్రతీరోజూ వెంకటేశ్వరస్వామిఆదాయం కోట్లలోనే వుంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా 'తిరు', 'పతి' అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో 'తిరు' అంటే గౌరవప్రదమైన అనీ, 'పతి' అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం 'గౌరవనీయుడైన పతి' అని అర్ధం.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు. తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహి౦చి, పునర్నిర్మించారు. 14, 15 శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తన్ను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షి౦చదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచి వుంది. 1933లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పడి పరిపాలనా వ్యవహారాలూ చూసుకునేలా మద్రాస్ శాసనసభశాసనసభ ఒక చట్టం చేసింది.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలూ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. ధార్మిక విషయాల్లో ధార్మిక సలహా మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇచ్చేది. తిరుపతి నగరం ఇప్పటి కే టి రోడ్ లో కొత్తూరు లో వుండేది. తరువాత అది గోవిందరాజస్వామి దేవలాయం దగ్గరికి మారింది. ఇప్పుడు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

అందుకే భక్తులకు అసౌకర్యం కలగకుండా టిటిడిఅనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. తమ కోరికలు తీర్చే ఆ స్వామికి మొక్కులుచెల్లించేందుకు భక్తులు ఎక్కడెక్కడినుండో వస్తూవుంటారు. ఎంత శ్రమకైనా ఓర్చి స్వామివారి దర్శనం చేసుకుని తరించిపోతారు.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

కలియుగప్రత్యక్షదైవంగా పేరుగాంచిన ఆ శ్రీనివాసుడు అద్భుతాలకు నెలవుఅని అందరికీ తెలిసినవిషయమే. తిరుమలనాధుడు మూలవిగ్రహాన్ని శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా కూడా భావిస్తారు. మామూలుగా స్వామివారి మూలవిరాట్టును పరిశీలనగా చూస్తే ఆయన కళ్ళను తిరునామాలు కప్పేసివుంటాయి.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

దాంతో స్వామివారు కళ్ళు మూసుకునివున్న రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని రోజులక్రితం తిరుమల దివ్యక్షేత్రంలో అద్భుతం జరిగిందట.ఎప్పట్లానే భక్తులు క్యూలైన్లో దేవుడిదర్శనం కోసం వేచిచూస్తున్నారు.వున్నట్టుండిఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా వర్షంకురవటం ప్రారంభమైంది.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

ఎంత వర్షం పడిందో అధికారులుకూడా లెక్కగట్టలేనంత వర్షం కురిసిందట.కొన్నిసంలు గా తిరుమలకొండపై నీటి కరువొచ్చింది. భక్తులు కూడా తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ కరువు తీరిపోయేలా వర్షం పడటంతో తిరుమలచుట్టుప్రక్కల డ్యాంలన్నీ నిండిపోయాయట.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

మరి కొంచెం సేపు వర్షం పడివుంటే ఆ డ్యాంలకు వరదొచ్చేదని కాని ఖచ్చితంగా డ్యాంలకు ఎంతనీరు కావాలో సరిగ్గా అంటే వర్షంపడటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమని కొండపై నివసించే వ్యక్తులు అభిప్రాయపడ్డారు.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే తిరుమలకొండపై వర్షం కురుస్తున్న సమయంలో గర్భగుడిలో వున్న భక్తులు తమ కళ్ళనుతామే నమ్మలేక పోయారట. ఎప్పుడూ మూసుకునివుండే స్వామి వారి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకోవటంతో మొదట భయభ్రాంతులకులోనైయారట.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

నిదానంగా తేరుకుని అది భగవంతుని లీలఅని తెలుసుకున్న భక్తులు గోవిందనామ స్మరణతో శ్రీవారిఆలయాన్ని హోరెత్తించారట. కాసేపటికి తిరుమలవెంకన్న కళ్ళు వాటికవే మూసుకుపోయాయట.
అదే సమయంలో బయటవర్షం కూడా ఆగిపోయిందని దేవుడు మహిమకి ఇంతకన్నా నిదర్శనంఏముంటుందని భక్తులు వ్యాఖ్యానించటం విశేషం.తను శరణుకోరి వచ్చే వారికి ఏ చిన్నఅసౌకర్యం కూడా కలగనీయడని శ్రీవేంకటేశ్వరుడు భక్తజనభాంధవుడని మరో సారి ఋజువైందని భక్తులువ్యక్తం చేసారు.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

చూడాల్సిన ఆకర్షణలు

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు. చెక్క బొమ్మలు, తెల్ల చెక్కతో చేసిన వస్తువులు, కలంకారీ చిత్రాలు, తంజావూర్ బంగారు ఆకుల చిత్రాలు, మరీ ముఖ్యంగా చందనపు బొమ్మలు లాంటి ఇక్కడి కళాకృతులు కూడా చూడాల్సిందే.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

కాంచీపురం

కాంచీపురం పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా పేరు మరియు ప్రసంశలు పొందింది. ఆధునిక కాలంలో మహిళల ఇష్టమైన బంగారం జరి, పట్టు దారంలతో గత వైభవాన్ని ప్రదర్శిస్తుంది. ఇది ముఖ్యంగా దక్షిణ భారత దుస్తుల కోణం, కానీ అలాగే తమిళులకు ఒక సంప్రదాయ మరియు సాంస్కృతిక కోణం కూడా ఉంది.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

ఈ పవిత్ర నగరంలో కామాక్షీ అమ్మవారి ఆలయం, ఎకంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం మరియు కైలసనతార్ ఆలయం వంటి సుప్రసిద్ధ దేవాలయాలు కోసం సంవత్సరం అంతటా పర్యాటకులు సందర్శిస్తారు.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

వెల్లూర్

గోల్డెన్ టెంపుల్ లో ఉన్న దేవతలలో 'మహాలక్ష్మి దేవత' కన్నుల పండుగగా ఉంటుంది మరియు వెల్లూరు దర్శించటానికి వొచ్చినప్పుడు తప్పనిసరిగా చూడవలసిన దేవాలయం. ఇక్కడి మరి కొన్ని ఆకర్షణలు విల్లపక్కం, వల్లిమలై, బాలమతి, విరిచిపురం, మెట్టుకులం, మోర్ధన ఆనకట్ట మరియు పూమలై వానిగ వాలగం. ఈ ప్రదేశాలు మీకు చిరస్మరణీయముగా మిగిలిపోతాయి.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

నెల్లూరు నగరం

ఆంధ్రప్రదేశ్ లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. రాష్ట్రం లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలోఒకటి. ఈ పట్టణం పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు రాజధాని కూడాను. అది వరలో ఈ జిల్లాను నెల్లూరు జిల్లా అని మాత్రమే పిలిచేవారు. ఈ పట్టణం వివిధ ప్రసిద్ధ దేవాలయాలు మరియు వ్యవసాయ పరంగా ఒక ప్రసిద్ధ కేంద్రంగా కూడా వుంది. నెల్లూరు నగరం పెన్నా నది ఒడ్డున కలదు.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

చెన్నై

తమిళ్ ఫిలిం ఇండస్ట్రి, కోలీవుడ్ కి చెన్నై పుట్టినిల్లువంటిది. అనేక ముఖ్యమైన సినిమా పండుగలు ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తారు. భారతదేశం నుండి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తీసిన ప్రత్యేక సినిమాలు ప్రదర్శిస్టారు. జెమిని స్టూడియోస్, AVM స్టూడియోస్ మరియు విజయా వాహిని స్టూడియోస్ వంటి పలు ముఖ్యమైన చలనఛిత్ర స్టూడియోస్ చెన్నైలో ఉన్నాయి.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

AVM స్టూడియో, భారతదేశంలోకల్లా పురాతన స్టూడియో. అది ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నది. చెన్నైలో 120 పైగా సినిమా హాళ్ళు ఉన్నాయి. వీటిలో ఇంగ్లీష్, హిందీ మరియు తమిళ సినిమాలు ఆడుతూ ఉంటాయి.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుపతి వాతావరణం

సరైన సమయం సంవత్సరంలో వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో తిరుపతిని సందర్శించడం ఉత్తమం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు తిరుపతి సందర్శనకు అనువైన పరిస్థితులను అందిస్తాయి. అయితే, జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో జరిగే ప్రధాన పండుగ బ్రహ్మోత్సవ సమయంలో యాత్రికులు తిరుపతిని సందర్శించడం ఉత్తమం.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుపతి ప్రయాణం చాలా తేలిక.

తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది. డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది. చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అద్దె కార్లు, బస్సులు అందుబాటులో వుండడం వల్ల నగరంలో తిరగడం కూడా తేలికే. నామమాత్రపు ధరల్లో రోజంతటికీ కార్లు అద్దెకు తీసుకోవచ్చు.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

తిరుమలలో మహాద్భుతం... కళ్లు తెరిచిన స్వామివారి

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X