
శివుడికి మూడు కన్నులు ఉండటం వల్ల ఆయన్ను త్రినేత్రుడిగా ఆరాధిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో ఒకే ఒక దేవాలయంలోని విష్ణువుకు కూడా నుదురు పై మూడో నేత్రాన్ని చూడవచ్చు. ఆ దేవాలయంలో పూజలు చేయడం వల్ల క్కడ పూజలు చేస్తే గ్రహ బాధల నుంచి కాపాడుతాడని, వివాహం, సంతానం విషయంలో వరాలు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా 12 ఏళ్లకి ఒకసారి వచ్చే మహామహం ఉత్సవంతో సంబంధ మున్న వైష్ణవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ స్వామిని బిల్వ పత్రాలతో పూజిస్తారు. బిల్వ పత్రాలతో పూజించడమన్నది శైవ మతానికి సంబంధించిన ఆరాధన కావడం ఇక్కడ గమనార్హం. ఇటువంటి ప్రత్యేకతలు ఉన్న దేవాలయానికి సంబంధించిన కథనం మీ కోసం...

సుదర్శన చక్రం
P.C: You Tube
స్థితికారుడైన విష్ణువు ఆయుధం సుదర్శన చక్రం అన్న విషయం తెలిసిందే. ఈ సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను మహావిష్ణువు సంహరించాడు. ఈ నేపథ్యంలోనే ఒకసారి ప్రజలను హింసిస్తున్న జలందాసుర అనే రక్షసుడి సంహరించడానికి సుదర్శన చక్రాన్ని అతని పై విష్ణువు ప్రయోగిస్తాడు.

పాతాళంలోకి వెళ్లి
P.C: You Tube
సుదర్శనచక్రం ప్రతాపానికి భయపడిన జలందాసురుడు పాతాళంలోకి వెళ్లి దాక్కొంటాడు. అయినా సుదర్శన చక్రం పాతాళంలోకి వెళ్లి ఆ జలందాసురుడిని సంహరిస్తుంది. అటు పై కావేరీ నది ద్వారా ప్రస్తుతం చక్రపాణి ఉన్న ఆలయం చోట భూమి పైకి వస్తుంది.

చక్రతీర్థంగా
P.C: You Tube
అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడ స్నానం చేస్తూ ఉంటాడు. ఈ సుదర్శన చక్రాన్ని గుర్తించి అక్కడే ప్రతిష్టింపజేస్తాడు. ఇక ఆ సుదర్శన చక్రం భూమి పైకి వచ్చిన చోటును చక్రతీర్థంగా వ్యవహరిస్తున్నారు.

శత్రువునైనా జయించే శక్తి
P.C: You Tube
ఈ తీర్థంలో స్నానం చేస్తే ఎంతటి శత్రువునైనా జయించే శక్తి లభిస్తుందని స్థానికులు చెబుతుంటారు. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి కూడా ముఖ్యంగా ఎన్నిక సమయంలో రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఇక్కడి వస్తుంటారు.

అపర తేజోవంతంగా
P.C: You Tube
ఇదిలా ఉండగా ఈ సుదర్శన చక్రాన్ని ఇక్కడ ప్రతిష్టించిన తర్వాత ఆ చక్రం అపర తేజోవంతంగా వెలుగుతూ కళ్లు మిరుమిట్లు గొలిపేలా వెలుగులు విరిజిమ్మూతూ ఉంది.

సూర్యుడి కాంతి చిన్నబోయింది
P.C: You Tube
ఈ సుదర్శన చక్రం కాంతుల ముందు సూర్యుడి కాంతి చిన్నబోయింది. సూర్యుడి తనకన్నా సుదర్శన చక్రం తేజస్సు ఎక్కువగా ఉండటంతో అసూయతో తన తేజస్సును మరింతగా పెంచాడు.

సూర్యుడి తేజస్సునంతటిని
P.C: You Tube
ఆ వేడికి, వెలుగుకి భూ మండలం పై ఉన్న సమస్త జీవులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. దీంతో సుదర్శన చక్రం సూర్యుడి తేజస్సుని అంతా తనలోకి విలీనం చేసుకుంది.

తిరిగి ఇచ్చేస్తుంది.
P.C: You Tube
అప్పుడు బుద్ధి తెచ్చుకొన్న సూర్యుడు సుదర్శన చక్రాన్ని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తాడు. దీంతో శాంతించిన సుదర్శన చక్రం సూర్యుడికి శక్తినంతటినీ తిరిగి ఇచ్చేస్తుంది.

ఇక్కడ దేవాలయం నిర్మించాడు
P.C: You Tube
దీంతో సూర్యభగవానుడు ఈ లీలలన్నీ విష్ణుభగవానుడివని తెలుసుకొని ఆయనకు ఇక్కడ దేవాలయం నిర్మించాడు. దీంతో విష్ణువు కూడా సూర్యుడి తప్పులను మన్నించి తాను ఇక్కడ ఇక పై చక్రపాణిగా కొలువుంటానని చెబుతాడు.

భాస్కర క్షేత్రంగా
P.C: You Tube
అంతేకాకుండా ఈ భూ మండలం ఉన్నంత వరకూ ఈ క్షేత్రం భాస్కర క్షేత్రంగా విలసిల్లుతుందని చెబుతాడు. ఇదిలా ఉండగా చక్రపాణి గర్భగుడి మిగతా ఆలయాలకన్నా కొంత ఎత్తులో ఉంటుంది.

ఆరు కోణాలున్న చక్రంమధ్యలో
P.C: You Tube
ఇక్క మూలవిరాట్టు అయిన చక్రపాణి విగ్రహం ఆరు కోణాలున్న చక్రంమధ్యలో ఉంటుంది. స్వామి నిలబడిన స్థితిలో ఉండి ఎనిమిది చేతులతో ఎనిమిది ఆయుధాలను కలిగి ఉంటాడు.

విష్ణువుకి మూడు కన్నులు
అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ విష్ణువు మూడు కన్నులను కలిగి ఉంటాడు. ఇలా విష్ణువు మూడు కన్నులు కలిగి ఉండటం ప్రపంచంలో మరెక్కడా చూడలేము.

రెండు ద్వారాలు
P.C: You Tube
ఈ సారంగపాణి ఆలయంలో ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం అని రెండు ద్వారాలు ఉంటాయి. ఇక్కడ ముందు అంబుజవల్లి పేరుతో కొలువై ఉన్న అమ్మవారిని పూజించి అటు పై అయ్యవారిని దర్శనం చేసుకోవాలి. తద్వార మన కోర్కెలన్నీ అమ్మవారు అయ్యవారికి చెబుతారని స్థానిక పూజారులు చెబుతారు.

గోవింద దీక్షితార్
P.C: You Tube
ఆలయాన్ని క్రీస్తుశకం 1620లో నాయక రాజుల మంత్రి గోవింద దీక్షితార్ నిర్మించాడని స్థానిక శాసనాల వల్ల తెలుస్తోంది. ఆలయం చుట్టూ గ్రానైట్ తో కట్టబడిన ప్రహరీ గోడ ఉంది. రాజగోపురం ఐదు అంతస్తులతో అలరారుతోంది.

బిల్వ పత్రాలతో
P.C: You Tube
వినాయకుడు, పంచముఖ ఆంజనేయ స్వామి వంటి ఉపాలయాలు ఇక్కడ మనం చూడవచ్చు. 12 ఏళ్లకి ఒకసారి వచ్చే మహామహం ఉత్సవంతో సంబంధ మున్న వైష్ణవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ స్వామిని బిల్వ పత్రాలతో పూజిస్తారు.

గ్రహ బాధల నుంచి
P.C: You Tube
ఈ ఆలయంలో స్వామివారికి మూడు కన్నులు ఉండటం వల్ల ఇక్కడ పూజలు చేస్తే గ్రహ బాధల నుంచి కాపాడుతాడని, వివాహం, సంతానం విషయంలో వరాలు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా సుదర్శన యాగం చేస్తే బహుముఖ ఫలితాలు పొందవచ్చునని భక్తుల నమ్మకం.