Search
  • Follow NativePlanet
Share
» »మోక్షానికి మార్గదర్శి ... సంక్రాంతి !!

మోక్షానికి మార్గదర్శి ... సంక్రాంతి !!

By Mohammad

సంక్రాంతి తెలుగు వారి పండుగలలో ప్రధానమైనది మరియు పెద్దది. కేవలం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలే కాదు తమిళనాడు, కర్నాటక మరియు ఇతర రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలలో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు కూడా సంక్రాంతి జరుపుకోవడం విశేషం. సంక్రాంతి పండుగలో ముఖ్యమైనవి మూడు - భోగి, మకర సంక్రాంతి, కనుమ.

భోగి

భోగి పండగ మకర సంక్రాంతికి ముందొచ్చే రోజు. సాధారణంగా ఇది జనవరి 13 లేదా 14 లో వస్తుంది. ఆ రోజున భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఏదైనా పాత సామాన్లు (మంటల్లో కాలేవి) ఉంటే వాటిని తీసుకొచ్చి ఆ మంటలో వేస్తుంటారు. చలి కాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. భోగి మంటలకు ఎక్కువగా తాటాకులను ఉపయోగిస్తారు. ఉదయం 3 నుండి 5 గంటల మధ్య భోగి మంటలను వేసుకుంటారు.

భోగి మంటలు

భోగి మంటలు

చిత్రకృప : YVSREDDY

కొత్త బట్టలు ధరించడం, గాలి పటాలు ఎగరేయడం, కోళ్ళ పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

భోగి పళ్ళు

భోగి పండుగ నాడు చేసే మరో సంప్రదాయం రేగు పండ్లు పోసి ఆశీర్వదించడం. భోగి నాడు పోస్తారు కనుక వీటికి ఆ పేరు వచ్చింది. భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం గా భావిస్తారు.

మకర సంక్రాంతి

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన కాలమే మకర సంక్రాంతి. ఇది హిందువుల పెద్ద పండగ. తెల్లవారుజామునే లేచి స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరిస్తారు. మకర సంక్రాంతిని తమిళులు 'పొంగల్' గా వ్యవహరిస్తారు.

గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు

గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

సంక్రాంతి లో మరో స్పెషల్ - ముగ్గులు. నాకు తెలిసి (చిన్నప్పుడు చూసిన దాని ప్రకారం) భోగి, మకర సంక్రాంతి రోజులలో రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెడతారు. చివరి రోజు కనుమ నాడు డైలీ వేసుకొనేటట్లే తెల్ల ముగ్గు వేస్తారు.

మకర సంక్రాంతి రోజున డూ డూ బసవన్నలు, పిండి వంటలు తయారు చేస్తారు. హరిదాసు గమనించవచ్చు. భోగి తరువాత వచ్చే సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగించి, నేతి మిఠాయిలు,పిండి వంటలు తయారుచేస్తారు.

పిండి వంటలు : అరిసెలు, గారెలు, బొబ్బట్లు, జంతికలు, పరమాన్నం, పులిహోరా వంటివి.

గాలిపటాల దుకాణం

గాలిపటాల దుకాణం

చిత్రకృప : Jainrajat11

ఇంటిల్లిపాది కూర్చోని సకుటుంబ సపరివారంగా భోజనాలు ఆరగిస్తారు. సాయంత్రం గాలిపటాలు ఎగరేస్తారు. సంక్రాంతి రోజున గాలి పాఠాలు పైకి ఎగరేయటం ఆనవాయితీగా వస్తోంది. సమీపంలోని అంగళ్ళలో గాలిపటాలు అమ్ముతుంటారు.

కోళ్ళ పందేలు

కోళ్ళ పందేలు సంక్రాంతి పండగ నాడు నిర్వహించే ఒక క్రీడ. ఈ క్రీడలో పాల్గొనటానికి రాష్ట్రం నలుమూల నుంచే కాక కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి కూడా వస్తారు. కోళ్ళ మీద పందేలు కాస్తారు. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్ళు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి. ఈ పందేలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తికి కనబరుస్తారు.

కోళ్ళ పందేలు

కోళ్ళ పందేలు

చిత్రకృప : Amshudhagar

కోళ్ళ పందేలు ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా లతో పాటు ఇతర కోస్తా జిల్లాలలో జరుగుతాయి.

కనుమ

పండుగ మూడవ రోజు కనుమ. సాధారణంగా ప్రజలు వ్యవసాయంలో తమకు సహాయపడిన పశువులకు శుభాకాంక్షలు తెలపటానికి ఈ రోజును జరుపుకుంటారు. కనుమ నాడు మినుములు తినాలనేది సామెత. అందుకే ఆ రోజున ప్రత్యేకంగా ఆవడలు, గారెలు చేసుకోవడం ఆనవాయితీ. వనభోజనాలు కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు.

కోళ్ళ పందేలు కనుమ నాడు కూడా స్థానికంగా నిర్వహిస్తుంటారు. కోర్ట్ లో కేసుపడినా, రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా కోళ్ళ పందేలు అనాదిగా వస్తున్న ఆచారం.

పండగ మిఠాయిలు

పండగ మిఠాయిలు

చిత్రకృప : Saloni Desai

కనుమ నాడు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాంసాహారం తినటం ఆనవాయితీ. మాంసం తినలేనివారు మినుములతో తయారుచేసిన గారెలను తిని తృప్తి పడతారు.

ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి బాగా జరిగే ప్రదేశాలు :

శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలు.

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్య దేవాలయాలు : అహోబిలం, అన్నవరం, సింహాచలం, మహానంది, శ్రీశైలం, కాణిపాకం, లేపాక్షి, మంత్రాలయం, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుపతి, బెజవాడ కానక దుర్గమ్మ, కదిరి నరసింహ స్వామి దేవాలయం, యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం, ద్రాక్షారామం, పిఠాపురం కుక్కుటేశ్వర దేవాలయం, సామర్లకోట, అంతర్వేది, భీమవరం, ద్వారకా తిరుమల, పాలకొల్లు మొదలగునవి.

తిరుమల దేవస్థానం

తిరుమల దేవస్థానం

చిత్రకృప : Nikhilb239

తెలంగాణ లో సంక్రాంతి బాగా జరిగే ప్రదేశాలు : తెలంగాణ లోని 31 జిల్లాలలో సంక్రాంతి ఘనంగా జరుగుతుంది.

తెలంగాణ లో ముఖ్య దేవాలయాలు : భద్రకాళి ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, భద్రాచలం దేవాలయం, వేయిస్తంభాల గుడి, కీసరగుట్ట, రామప్ప దేవాలయం, సంగమేశ్వర్ దేవాలయం, జ్ఞాన సరస్వతి దేవాలయం, కర్మాన్ఘాట్ హనుమాన్ ఆలయం, హైదరాబాద్ బిర్లా మందిర్, కొండగట్టు ఆలయం, మీనాక్షి అగస్తీశ్వరస్వామి ఆలయం, రాజరాజేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర ద్వమి ఆలయం, నరసింహ ఆలయం నాంపల్లిగుట్ట, చిలుకూరు బాలాజీ దేవాలయం మొదలగునవి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X