» »ధైర్యం వుంటే ఈ దేవాలయానికి వెళ్ళండి

ధైర్యం వుంటే ఈ దేవాలయానికి వెళ్ళండి

Written By: Venkatakarunasri

LATEST: కర్ణాటకలో చనిపోయిన యువకుడు మరలా లేచి కూర్చున్నాడు

 కేరళ రక్తపు వర్షం నిజమా?

భారతదేశంలో ఒకేఒక భూతాలను వదలగొట్టే దేవాలయం ఏదంటే పవిత్రమైన శ్రీ మెహందిపుర్ బాలాజీ దేవాలయం. ఈ ఆలయం బాలాజీ అని కూడా పిలువబడే హనుమంతుడికి అంకితం చేయబడింది.

ఈ దేవస్థానం రాజస్థాన్ లో దౌసా జిల్లాలో వున్నది. ధైర్యముండేవాళ్ళు ఈ దేవాలయాన్ని ఒక్కసారి వెళ్లి చూసిరావచ్చును. స్వామి దర్శనం మరియు దుష్ట శక్తులను వదలుగొట్టుకునే దానికి వందలాది మంది భక్తులు ప్రతిరోజూ ఈ ఆలయానికి వస్తారు.

ఇక్కడ గల ఆంజనేయస్వామి మహా మహిమ గలిగిన దేవుడు. ఇక్కడ బాలాజీ స్వామే స్వయంగా భూతవైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు చూడవచ్చును. ఈ దేవాలయం గురించి దేశ, విదేశీ శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసారు.

ప్రస్తుత వ్యాసంలో బాలాజీ స్వామి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. దేవాలయం ఎక్కడ వుంది?

1. దేవాలయం ఎక్కడ వుంది?

ఈ మహిమాన్విత దేవాలయం పవిత్రమైన హిందు దేవాలయం. రాజస్థాన్ లో దౌసా జిల్లా నందు బాలాజీ దేవాలయం నందు హనుమంతుడు దివ్యంగా వెలుగొందుతున్నాడు.హనుమంతుని దేవాలయాలు భారతదేశంలో చాలా చోట్ల మనం చూడవచ్చు.కానీ ఈ దేవాలయంలో వున్న స్వామి భూతాలను తరిమికొట్టే శక్తి కలిగిన దేవతామూర్తి.

PC:Seoduniya,pramod kumar gupta

2. భూతాలను తరిమికొట్టడం

2. భూతాలను తరిమికొట్టడం

ఈ దేవాలయానికి వచ్చే చాలామంది దుష్టశక్తుల వల్ల బాధపడుతుంటారు. ఈ స్వామి దుష్టశక్తులను పారద్రోలుతారు.

3. భక్తులు

3. భక్తులు

ఈ దేవాలయానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. రాజస్థాన్ లో వుండే వారే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవస్థానానికి వస్తారు.జాతి,మత భేదాలు లేకుండా అందరూ ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు.

PC:YOUTUBE

4. పర్వతం

4. పర్వతం

ఈ దేవాలయం ఒక సామాన్య గ్రామంలో ఒక పర్వతం మీద స్వామి కొలువైవున్నాడు. ఈ గ్రామం అంత బాగా అభివృద్ది చెందకపోయిన బాలాజీ దేవాలయం మాత్రం ప్రఖ్యాతి గాంచినది. ఈ పర్వతం మీద వేలాది భక్తులు దర్శించుకొనుట చూడవచ్చును.

PC:YOUTUBE

5. ధైర్యం వుంటే మాత్రం

5. ధైర్యం వుంటే మాత్రం

ఈ దేవాలయంలో కొంతమంది భూతాలను వదలగొట్టించుకొనేందుకు వస్తారు గనక అనేక విధాలైన అరుపులు మనకు వినపడతాయి. అందుకని కొంతమంది భక్తులు భయభ్రాంతులకు గురి అవుతారు.
ధైర్యంగలవారు మాత్రమే ఈ స్థలాన్ని సందర్శించవచ్చు.

PC:YOUTUBE

6. గర్భగుడిలోని ప్రధాన అర్చకులు

6. గర్భగుడిలోని ప్రధాన అర్చకులు

ఈ బాలాజీ దేవాలయంలో ఇద్దరు ప్రముఖ అర్చకులు వున్నారు. ఇంతకు ముందు ముఖ్య అర్చకులు గణేష్ పుర్జీ మహారాజ్ వుండేవారు. ప్రస్తుతం ప్రధాన అర్చకులు శ్రీ కిషోర్ పుర్జీ మహారాజ్ వున్నారు. ఈ ఇద్దరు పూజారులు బ్రాహ్మణులు.అత్యంత భక్తితో,నిష్ఠతో మాంసాహారం ముట్టని పవిత్రమైన గ్రంథాలు చదివే బ్రాహ్మణులు అయివున్నారు.

PC:YOUTUBE

7. శ్రీరాముని దేవాలయం

7. శ్రీరాముని దేవాలయం

బాలాజీ దేవాలయం ముందు భాగంలో హనుమంతుని ప్రియమైన శ్రీరాముని దేవాలయం వుంది. ఈ దేవాలయంలో అత్యంత సుందరమైన శ్రీరాముని దర్శించుకోవచ్చు.

PC:YOUTUBE

8. కానుకలు

8. కానుకలు

భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ, స్వామణి, ధరకష్ట్, బుంది అను కానుకలు అర్పిస్తారు. ఆలయం లోపలి భాగంలో భైరవ బాబాను దర్శించుకోవచ్చును. ఇతనికి అన్నాన్ని కానుకగా సమర్పిస్తారు.

PC:YOUTUBE

9 .ముఖ్యమైన రోజులు

9 .ముఖ్యమైన రోజులు

ఈ బాలాజీ దేవాలయంలో దెయ్యాలను వదలగొట్టే రోజులు శనివారం మరియు మంగళవారం. ఈ రెండు రోజులలో తండోపతండాలుగా జనం తరలివస్తారు.

PC:YOUTUBE

10. ఇక్కడికి సమీపంలో వున్న దేవాలయాలు

10. ఇక్కడికి సమీపంలో వున్న దేవాలయాలు

బాలాజీ దేవాలయానికి దగ్గరలో అనేక దేవాలయాలను చూడొచ్చు.అవి అంజనామాతా దేవాలయం,కాళీ మఠం, పంచముఖి హనుమాన్ జీ దేవాలయం, సమాదివాలే బాబా.ఈ పవిత్రమైన దేవాలయాలన్నీ మెహందిపుర్ లో చూడవచ్చును.

PC:YOUTUBE

11. పరిశోధనలు

11. పరిశోధనలు

ఈ దేవాలయం మెహందిపుర్ లో అత్యంత పురాతనమైన దేవాలయం. ఇక్కడ జరిగే భోతోద్ఘటన గురించి 2013లో జర్మన్, నెదర్లాండ్స్, న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం పరిశోధించారు.

PC:YOUTUBE

12. భక్తుల యొక్క మడి ఆచారాలు

12. భక్తుల యొక్క మడి ఆచారాలు

ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మరియు మద్యం సేవించకూడదు.

PC:YOUTUBE

13.భూతవైద్యం

13.భూతవైద్యం

భూతవైద్యం సమయంలో దుష్టశక్తులతో బాధపడేవారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలివేయాలి.

PC:YOUTUBE

14. ప్రసాదం

14. ప్రసాదం

ఇక్కడ తీసుకున్న ప్రసాదాన్ని ఇక్కడే తినేయాలి. ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు. ఒకవేళ అలా తీసుకువెళ్తే కీడు సంభవిస్తుందని భక్తుల అభిప్రాయం.

PC:YOUTUBE

15. దేవాలయం తెరచువేళలు

15. దేవాలయం తెరచువేళలు

ఈ దేవాలయం వారంలో అన్ని రోజులు తెరచి వుంటుంది. ఉదయం 6 గంల నుంచి రాత్రి 9 గంల వరకు దర్శనం చేసుకోవచ్చును.

PC:YOUTUBE

Please Wait while comments are loading...