Search
  • Follow NativePlanet
Share
» »పర్యాటకుల స్వర్గధామం జున్నూర్ ను సందర్శించారా?

పర్యాటకుల స్వర్గధామం జున్నూర్ ను సందర్శించారా?

By Gayatri Devupalli

భారతదేశంలో మూడవ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో , చాలా విశేషాలకు పుట్టినిల్లు. ఈ రాష్ట్రంలోనే ముంబై మరియు పూణే వంటి మహా నగరాలకు, గోదావరి మరియు కృష్ణ వంటి జీవనదుల జన్మస్థలాలు ఉన్నాయి. అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను దేశానికి ఇచ్చిన రాష్ట్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రంలో గొప్ప చారిత్రక వారసత్వం కలిగి ఉన్న కోటలు మరియు రాజభవనాలు ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని నగరమైన ముంబైలో కూడా అనేక సందర్శనీయ స్థలాలు, ప్రత్యేకించి అక్కడ చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. కానీ అదే నగరంలో చాలాకాలంగా నివసిస్తున్న వారు కొత్త సందర్శనీయ ప్రదేశాల కొరకు అన్వేషిస్తుంటారు. అటువంటి వారి కోసం జున్నార్ ఆహ్వానం పలుకుతోంది. ఇది పూణే నగరానికి దగ్గరలో ఉన్న ఒక ముఖ్యమైన వాణిజ్య మరియు రాజకీయ ప్రాంతం.

1. జున్నార్ సందర్శనకు ఉత్తమ సమయం:

1. జున్నార్ సందర్శనకు ఉత్తమ సమయం:

P.C: You Tube

పూణే వాతావరణం వలే, జున్నార్ లో కూడా ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణ పరిస్థితి ఉంటుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పర్యాటకుల సందర్శనకు జున్నార్ చాలా బాగుంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా, పిల్లగాలులతో కూడుకుని ఉంటుంది. వర్షాకాలం అధికంగా వర్షాలు కురవడం వలన ఈ సమయంలో సందర్శిస్తే, ఇబ్బందిగా ఉండవచ్చు.

2. ముంబై నుండి జున్నార్ వెళ్లే మార్గాలు:

2. ముంబై నుండి జున్నార్ వెళ్లే మార్గాలు:

P.C: You Tube

రూట్ 1: చద్దా నగర్ - ఈస్టర్న్ ఎక్స్ప్రస్ హైవే - ఎన్.హెచ్. 61 - జున్నార్-కల్యాణ్ రోడ్- గణేష్ కింద్ (155 కి.మీ - 3 గం. 30 ని.)

రూట్ 2: చెద్దా నగర్ - ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే - ఎన్.హెచ్ 160 - గోతేఘర్ - వడ్వాలీలో ఎన్.హెచ్ 61 రోడ్డు మార్గం - ఎన్. హెచ్ 61 పై ఎడమకు- జున్నార్ (175 కి.మీ -- 3 గం. 45 ని.)

రూట్ 3: చద్దా నగర్ - బెంగళూరు-ముంబై హైవే - తలేగావ్-చాకన్ రోడ్. ఎన్. హెచ్ 60 - నారాయణగావ్-జున్నార్ రోడ్. - జున్నార్ (201 కి.మీ - 4 h 15 min)

జున్నార్ కు వెళ్లే మార్గంలో చూడదగిన ప్రదేశాలు:

3. థానే:

3. థానే:

P.C: You Tube

ముంబై కి 23కి.మీ దూరంలో ఉండే థానే జనసామర్ధ్యం అధికంగా ఉన్న నగరం. ఈ నగరంలో ఎన్నో ఎమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నందున కుటుంబ సమేతంగా సరదాగా సమయం గడపడానికి ఇది సరైన గమ్యస్థానం. సంజయ్ వాటర్ పార్క్ మరియు టికూజి ని వాడి ముఖ్యంగా మీరు చూడవలసిన పార్కులు. ఈ రెండు పార్కులలో జెయింట్ వీల్, జల క్రీడలైన వేవ్ పూల్ మరియు రెయిన్ డిస్కో ఉన్నాయి. అంతేకాకుండా, థానే ఉపవన్ లేక్ స్థానికులకు మరియు పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధమైన ఆకర్షణ. థానే నగరానికి ముఖ్య జలవనరు ఇదే! ప్రస్తుతం దీనిని వినోద ప్రదేశంగా మార్చారు.

4. భివండి వద్ద వజ్రేశ్వరి ఆలయం:

4. భివండి వద్ద వజ్రేశ్వరి ఆలయం:

P.C: You Tube

ప్రసిద్ధ యోగిని అయిన వజ్రేశ్వరి దేవికి భివండిలో ఒక ఆలయం అంకితం చేయబడింది. భివండి, థానే కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశం వడ్వాలి అని పిలవబడినప్పటికి, తదనంతరం ఆమె గౌరవార్ధం వజ్రేశ్వరి అని పేరు మార్చారు. ఈ పట్టణంలో 21 వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. స్థానికులు, ఈ వేడి నీటి బుగ్గలు వజ్రేశ్వరి దేవి సంహరించిన, అసురుల యొక్క మరుగుతున్న రక్తం అని నమ్ముతారు.

5. కళ్యాణ్:

5. కళ్యాణ్:

P.C: You Tube

భివండి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ్, మహారాష్ట్రలోని మరొక నగరం. ఇక్కడ ఉండే కాలా తలావ్ లేక్ మరియు దుర్గాది ఆలయం అనే ప్రసిద్ధి చెందిన రెండు ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మీరు ప్రశాంతంగా ఉండే కాలా తలావ్ ను ఉదయం పూట సందర్శిస్తే, ఆ సరస్సు చుట్టూ వ్యాయామం కొరకు పరుగులుతీసే జాగర్స్ ను చూడవచ్చు. స్థానికులు మరియు పర్యాటకులు, హడావిడిగా ఉండే పట్టణ ఘోషను తప్పించుకునేందుకు ఈ సరస్సును సందర్శిస్తారు. ఛత్రపతి శివాజీ, ఆదిల్ షా పై గెలుపు సాధించి, కళ్యాణ్ మరియు భివండిని సొంతం చేసుకుని, ఆ విజయానికి చిహ్నంగా దుర్గాదీ ఆలయాన్ని నిర్మించారు. ఇది దుర్గామాతకు అంకితం ఇచ్చిన ఆలయం.

6. మల్షేజ్ ఘాట్:

6. మల్షేజ్ ఘాట్:

P.C: You Tube

ప్రశాంతతకు సింహద్వారం వంటి మల్షేజ్ ఘాట్ పర్వత శిఖరం, పడమటి కనుమల శ్రేణిలో కలదు. ఈ ప్రదేశం అందమైన పక్షులకు మరియు పచ్చని ప్రకృతి దృశ్యాలకు ఆలవాలం. మల్షేజ్ ఘాట్ ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించవలసిన ఒక ప్రదేశం. ఈ హిల్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు, హరిశ్చంద్రఘడ్ ఫోర్ట్ లో ట్రెక్కింగ్ మరియు పింపల్ గావ్ జోగ డ్యామ్ వద్ద పక్షుల వీక్షణ తప్పక చేసి తీరవలసిన పనులు.

7. లెన్యాద్రి గుహలు:

7. లెన్యాద్రి గుహలు:

P.C: You Tube

ఈ గుహలు, మల్షేజ్ ఘాట్ నుండి 29 కిలోమీటర్ల దూరంలో మరియు పూణే నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. పశ్చిమ కనుమలలో, పర్వాతాలను తొలచి నిర్మించిన ముప్ఫై బౌద్ధ గుహల సముదాయం ఇక్కడే ఉంది. లెన్యాద్రి అనే పదానికి "పర్వత గుహ"అని అర్ధం. ఇది జున్నార్ నుండి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహలలో 7 వ గుహలో, వినాయకునికి అంకితం చేసిన ఆలయం ఉంది. అష్టవినాయక ఆలయాలలో ఇది ఒకటి.

8. శివనేరి కోట:

8. శివనేరి కోట:

P.C: You Tube

మరాఠా రాజవంశ స్థాపకుడైన ఛత్రపతి శివాజీ మహరాజ్ జన్మించిన గ్రామం శివనేరి.17 వ శతాబ్దానికి చెందిన ఈ కోట, మరాఠా సామ్రాజ్యంలోని వివిధ కోటలలో ఒకటి. ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన శివనేరి కోట, చరిత్ర మరియు సాహసాలను ఇష్టపడేవారికి స్వర్గధామం వంటిది. శివనేరి కోటలో 7 తలుపులు , శివాయ్ దేవికి అంకితమివ్వబడిన ఒక ఆలయం మరియు బాదామి తాలవ్ అనే పెద్ద అందమైన సరస్సు ఉన్నాయి. పర్వతం పై నిర్మింపబడిన ఈ కోటను, ఔత్సాహికులు గైడుల సహాయంతో పర్వతారోహణ చేసి సందర్శిస్తారు.

9. ననేఘాట్ కు ట్రెక్కింగ్:

9. ననేఘాట్ కు ట్రెక్కింగ్:

P.C: You Tube

నానేఘాట్, మహారాష్ట్రలో ట్రెక్కింగ్ కు అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. ఇది జున్నార్ దగ్గర పశ్చిమ కనుమలలో ఉన్న ఒక పర్వత మార్గం. నానేఘాట్ గుహల శిధిలాలలో కనిపించే శిలాశాసనాలు, ఈ ప్రదేశాన్ని సత్వహర మరియు మౌర్య రాజవంశాలు పాలించినట్లు తెలియజేస్తున్నాయి. నానేఘాట్ " అనగా నాణాల పర్వత మార్గం" అని అర్ధం. ఎందుకంటే, పురాతన సమయంలో, ఈ పర్వతం గుండా ప్రయాణం చేసేవారి వద్ద నుండి నాణాలు సేకరించేవారు. దీనికి సమీపంలోనే హడ్సర్ ఫోర్ట్ అనే మరొక ప్రదేశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more