Search
  • Follow NativePlanet
Share
» »ముస్లీం రాజు చేత నామకరణం చేయించుకొన్న ‘నీలకంఠుడి’ క్షేత్రం

ముస్లీం రాజు చేత నామకరణం చేయించుకొన్న ‘నీలకంఠుడి’ క్షేత్రం

By Kishore

కులం, మతం అన్నవి మనం కల్పించుకొన్న కొన్ని పనికి రాని కట్టుబాట్లు మాత్రమే. ఆ దైవానికి ఈ కులం మతం పట్టింపు లేదు. ఎవరైనా సరే తాము ఆపదలో ఉన్నామని వేదనతో వేడుకుంటే వెంటనే ఆ దైవం వారికి సహాయం చేస్తాడు. ఇందుకు నిదర్శనమే ఈ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆ పరమశివుడు ఓ ముస్లీం రాజు పట్టపుటేనుగుకు కూడా జబ్బును నయం చేశాడు. దీంతో ఆ ముస్లీ రాజు ఇక్కడి దేవుడికి ఓ నూతన పేరు పెట్టాడు. ఇక ఈ క్షేత్రం పరశరామ క్షేత్రం కూడా. ఇక్కడ అరుదైన రాఘవేంద్రస్వామి రాతి విగ్రహాన్ని కూడా సందర్శించవచ్చు. కబిని, కౌండన్య నదుల సంగమ ప్రాంతమైన ఈ క్షేత్రం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

కాశీ సందర్శనం కంటే ఇక్కడ గురివిందంత పుణ్యం ఎక్కువ...నిదర్శనం ఇదిగో

1. సాగర మధనం

1. సాగర మధనం

P.C: You Tube

అమరత్వం కోసం దేవ దానవులు సాగర మధనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అటు దేవతలు కాని, ఇటు రాక్షసులు కాని విఘ్నరాజాధిపతి వినాయకుడిని పూజించలేదు.

2.ఆలాహలం వచ్చింది

2.ఆలాహలం వచ్చింది

P.C: You Tube

దీంతో సాగరమధనం మొదట్లో అమ`తానికి బదులు ఆలాహలం వచ్చింది. ఆ కాలకూట విషం ప్రపంచం మొత్తాన్ని దహించివేస్తుంటే లోక రక్షణ కోసం ఆ పరమశివుడు ముందుకు వచ్చాడు.

3.ఆ విషయాన్ని

3.ఆ విషయాన్ని

P.C: You Tube

ప్రజలతోపాటు పశు, పక్షాదులు ఆ విషయం భారిన పడి ప్రాణాలు కోల్పోకుండ ఉండటానికి ఆ విషయాన్ని ఆ నాగభరణుడు మింగేస్తాడు. అయితే ఆ విషయం శరీరంలోకి పోతే అంతటి పరమశివుడు కూడా తట్టుకోలేడని భావించిన పార్వతి దేవి శివుడి కంఠాన్ని గట్టిగా పట్టేసుకుంటుంది.

4.కొద్ది సేపు విశ్రాంతి

4.కొద్ది సేపు విశ్రాంతి

P.C: You Tube

దీంతో ఆ విషం పరమశివుడి కంఠంలోనే నిలిచిపోతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత పరమశివుడు ప్రస్తుత నంజనగూడులో కొద్ది సేపు విశ్రాంతి తీసుకొన్నాడని దీంతో ఆ ప్రాంతం పరమ పవిత్రంగా మారిపోయిందని చెబుతారు.

5.తన కంఠంలో నిలుపుకోవడంతో

5.తన కంఠంలో నిలుపుకోవడంతో

P.C: You Tube

ఇక విషాన్ని తన కంఠంలో నిలుపుకోవడంతో ఆ ప్రాంతమంతా నీలంగా మరిపోతుంది. దీంతో అప్పటి నుంచి పరమశివుడిని నీలకంఠుడిగా పిలవడం జరిగింది.

6.అందువల్లే ఈ క్షేత్రానికి

6.అందువల్లే ఈ క్షేత్రానికి

P.C: You Tube

కన్నడలో నంజుడ అనే పదం నంజ+ఉండ అనే రెండు పదాలకలయిక వల్ల ఏర్పడింది. ఇక నంజ అంటే విషయం అని అర్థం కాగా, ఉండ అంటే మింగిన అని అర్థం. అందువల్లే ఈ క్షేత్రంలోని పరమశివుడిని నంజుండేశ్వరుడు అని పిలుస్తారు.

7.ఈ ప్రాంతాన్ని నంజనగూడు

7.ఈ ప్రాంతాన్ని నంజనగూడు

P.C: You Tube

నంజుండేశ్వరుడు కొలువై ఉండటం వల్లే ఈ ప్రాంతాన్ని నంజనగూడు అని పిలుస్తున్నారు. అంతేకాకుండా శ్రీ కంఠుడిగా కూడా పరమశివుడికి పేరుంది.

8.రోగాలను నయం చేసే శక్తి

8.రోగాలను నయం చేసే శక్తి

P.C: You Tube

నంజుండేశ్వరుడికి రోగాలను నయం చేసే శక్తి ఉందని స్థానక ప్రజల విశ్వాసం. దీంతో ఆ నంజుండేశ్వరుడు కొలువైన దేవాలయం ఆవరణంలో ఉన్న మట్టి కూడా వివిధ అందుకే దేవాలయం పక్కన ఉన్న నీటితో పాటు మన్నులో కూడా వ్యాధులను నయం చేసే ఔషదాలు ఎన్నో ఉన్నయని చెబుతారు.

9.పట్టపుటేనుగుకు

9.పట్టపుటేనుగుకు

P.C: You Tube

చారిత్రాత్మక కథలను అనుసరించి ఈ ప్రాంతాన్ని పాలించే టిప్పు సుల్తాన్ పట్టపుటేనుగుకు ఒకసారి తీవ్రంగా జబ్బు చేసింది. ఆస్థాన పండితుల సూచనమేరకు టిప్పు సుల్తాన్ నంజుండేశ్వరుడిని సేవిస్తాడు.

10.హకీమ్ (వైద్యుడు) నంజుడ

10.హకీమ్ (వైద్యుడు) నంజుడ

P.C: You Tube

విచిత్రంగా వెంటనే ఆ ఏనుగు జబ్బులు పూర్తిగా నయమయింది. దీంతో టిప్పుసుల్తాన్ ఈ నంజుండేశ్వరుడిని హకీమ్ (వైద్యుడు) నంజుడ అని పిలుస్తూ ఆలయ అభివ`ద్ధి కోసం వేలాది ఎకరాలను దానంగా అందజేశాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి వివిధ రోగాలతో బాధపడుతున్న వారు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఉప్పు, బెల్లం అమ్ముతుంటారు.

11.ఉప్పు, బెల్లంను

11.ఉప్పు, బెల్లంను

P.C: You Tube

భక్తులు తమ రోగాలను త్వరగా నయం చేయాలని కోరుతూ ఈ ఉప్పు, బెల్లంను ఆలయం చెంతనున్న నదిలో వేస్తుంటారు. తద్వారా తమ జబ్బులు త్వరగా నయమవుతాయని భక్తుల నమ్మకం.

12.నంజనగూడు పరశరామ క్షేత్రం

12.నంజనగూడు పరశరామ క్షేత్రం

P.C: You Tube

పురాణాలను అనుసరించి ఈ నంజనగూడు పరశరామ క్షేత్రం. తండ్రి ఆదేశాలను అనుసరించి తల్లిని పరశరాముడు సంహరించిన అటు పై బతికించిన విషయం తెలిసిందే.

13.మాతృహత్య వల్ల

13.మాతృహత్య వల్ల

P.C: You Tube

మాతృహత్య వల్ల పరశరాముడి మనస్సు అల్లకల్లోలమవుతుంది. దీంతో ప్రశాంతత కోసం దేశంలోని చాలా చోట్ల తిరుగుతూ ప్రస్తుతం నంజనగూడు ఉన్న ప్రాంతానికి వస్తాడు. అక్కడ కపిల, కౌండిన్య నదుల సంగమాన్ని చూసి మైమరచి పోతాడు. తన మనస్సులోని ఆందోళనలు తగ్గేవరకూ అక్కడే తపస్సు చేయాలని భావిస్తాడు.

14.శివలింగం పై నుంచి రక్తం

14.శివలింగం పై నుంచి రక్తం

P.C: You Tube

ఇందుకు అవనువైన స్థలం కోసం వెదుకుతూ ఉంటే పరశరాముడి గండ్ర గొడ్డలి తగిలి ఓ శివలింగం పై నుంచి రక్తం వస్తుంది. దీంతో పరశరాముడు తీవ్రంగా చింతిస్తాడు.

15.ఆత్మార్పనకు

15.ఆత్మార్పనకు

P.C: You Tube

తల్లిని చంపిన పాపాల నుంచి నివ`త్తి కోసం తిరుగుతూ ఉంటే తన నిర్లక్ష్యం వల్ల మరో అపరాధం జరిగిందని భాదపడుతాడు. చివరికి ఆత్మార్పనకు సిద్దపడుతాడు.

16.పరమశివుడు ప్రత్యక్షమయ్యి

16.పరమశివుడు ప్రత్యక్షమయ్యి

P.C: You Tube

ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యి అతన్ని ఊరడిస్తాడు. ఇక్కడ తనకు దేవాలయం కట్టించాలని సూచిస్తాడు. అంతేకాకుండా నీకు కూడా ఒక దేవాలయం ఇక్కడ వెలుస్తుందని చెబుతాడు.

17.పరశరామ దేవాలయాన్ని

17.పరశరామ దేవాలయాన్ని

P.C: You Tube

తనను దర్శించిన వారు తప్పక పరశరాముడి దేవాలయాన్ని సందర్శించాలని లేదంటే తీర్థయాత్ర ఫలితం వస్తుందని చెబుతారు. అందువల్లే నంజనగూడు వెళ్లిన వారు తప్పక పరశరామ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.

18.రాఘవేంద్రస్వామి రాతి విగ్రహం

18.రాఘవేంద్రస్వామి రాతి విగ్రహం

P.C: You Tube

సాధారణంగా రాఘవేంద్రుడు మనకు బ`ందావనం రూపంలో కనిపిస్తాడు. అయితే నంజనగూడులోని ప్రధాన ఆలయానికి 500 మీటర్ల దూరంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆయన రాతి విగ్రహం ఉంది. రాఘవేంద్రుడి రాతి విగ్రహం దేశంలో ఇక్కడ మాత్రమే ఉంది.

19.రైల్ కం రోడ్ వంతెన

19.రైల్ కం రోడ్ వంతెన

P.C: You Tube

నంజనగూడు వద్ద కబిని నది పై 1735లో నిర్మించిన రైల్ కం రోడ్ వంతెన కూడా చూడదగినది. దీనిని హెరిటేజ్ మాన్యుమెంట్గా ప్రకటించారు.

20.గిరిజా కళ్యాణానికి

20.గిరిజా కళ్యాణానికి

P.C: You Tube

ఈ ఆలయంలో జులైలో జరిగే గిరిజా కళ్యాణానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. అంతే కాకుండా ఏప్రిల్ లో జరిగే పంచ మహారథోత్సవానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

21ఎక్కడ ఉంది

21ఎక్కడ ఉంది

P.C: You Tube

బెంగళూరు నుంచి 175 కిలోమీటర్ల దూరంలో నంజనగూడు దేవాలయం ఉంటుంది. మైసూరు నుంచి ఈ క్షేత్రం కేవలం 23 కిలోమీటర్ల దూరం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 1 గంట వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more