» »భీమవరంలో మరియు చుట్టుప్రక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు !!

భీమవరంలో మరియు చుట్టుప్రక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు !!

Posted By: Staff

LATEST: తేలు దర్గా గురించి వింటే షాక్ !

భీమవరం పశ్చిమ గోదావరిజిల్లా లో రెండవ పెద్ద పట్టణం (మొదటిది - జిల్లా కేంద్రం ఏలూరు). తూర్పు చాళుక్య రాజైన భీమ పేరుమీదుగా ఈ పట్టణానికి భీమవరం అన్న పేరువచ్చింది. భీమవరంలో ఈయన సోమేశ్వర ఆలయాన్ని క్రీ.శ. 890 - 918 మధ్యకాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పూజ్య బాపూజీ భీమవరం నగరానికి 'రెండవ బార్డోలీ' అనే బిరుదును ఇచ్చాడు.

భీమవరం లో ప్రధాన ఆదాయవనరు వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. చేపలు/రొయ్యల చెరువులు ఈ పట్టణం పరిసరాలలో కానవస్తాయి. ఇవే ఈ పట్టణానికి ప్రధాన ఆదాయవనరు కూడా. దాదాపు చుట్టుప్రక్కల 150 -200 గ్రామాలకు భీమవరం ప్రధాన వాణిజ్య రాజధాని. పట్టణంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, గుళ్ళు - గోపురాలు, పార్కులు ... ఎలా ఎన్నో సదుపాయాలూ ఉండి, నివాసానికి అనుకూలంగా ఉన్నది.

ఇది కూడా చదవండి : ప్రపంచంలో ఇలాంటి శివాలయం వుందని తెలుసా ?

అల్లూరి సీతారామరాజు, శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు ఈ ప్రాంతానికి చెందిన వారే! భీమవరం నుండి సినిమా రంగంలోకి వెళ్ళినవారు కూడా ఉన్నారండి! వారిలో కృష్ణంరాజు, సునీల్, త్రివిక్రమ్, శివాజీ రాజా, రాశి మొదలగినవారు ఉన్నారు. రాష్ట్రంలో ఇతర పట్టణాలకు భిన్నంగా భీమవరంలో అత్యంత విలాసవంతమైన జీవనవిధానం కనిపిస్తుంది. సంక్రాంతి నాడు కోళ్ళ పందెలూ నిర్వహిస్తారు.

భీమవరం చుట్టుప్రక్కల చూడవలసిన ప్రధాన ఆకర్షణల విషయానికి వస్తే ...

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

సోమేశ్వరాలయం

సోమేశ్వరాలయం

భీమవరంలో మొదట చూడవలసిన ప్రధాన దర్శనీయ ప్రదేశం/ గుడి సోమేశ్వరాలయం. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. సోమేశ్వర స్వామి ఆలయాన్నే భీమారామము అని అంటారు.

చిత్రకృప : Jai Kishan Chadalawada

భీమారామము

భీమారామము

భీమారామము, భీమవరం పట్టణం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గునుపూడి లో కలదు. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని స్థలపురాణం చెబుతుంది.

చిత్రకృప : PV Bhaskar

లింగ మహత్యం

లింగ మహత్యం

పౌర్ణమి రోజున తెల్ల రంగులో, అమావాస్య రోజున గోధుమ రంగులో శివలింగం కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. కార్తీయమాసంలో గుడిలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఏలూరు, భీమవరం ప్రజలే కాక విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ నుండి భక్తులు వస్తుంటారు.

కోనేరు

కోనేరు

ఆలయం ముందు ఒక కోనేరు ఉన్నది. కోనేరు గట్టున రాతి స్తంభంపై ఉన్న నందీశ్వరుడు విగ్రహం నుండి శివాలయంలోని లింగాకారమును దర్శించవచ్చు. అదే దేవాలయం రాతి గట్టుపై నుండి చూస్తే శివలింగం బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

చిత్రకృప : PV Bhaskar

రెండస్తులలో ఆలయం

రెండస్తులలో ఆలయం

సోమేశ్వరాలయం ప్రధాన ఆలయం రెండు అంతస్తులలో కానవస్తుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో, పై అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నారు.

సందర్శించు వేళలు : ఉదయం 5 నుండి 11 వరకు మరియు తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు భక్తులు ఆలయాన్ని దర్శించవచ్చు.

చిత్రకృప : Balajijagadesh

మావుళ్ళమ్మ దేవస్థానము

మావుళ్ళమ్మ దేవస్థానము

భీమవరం పట్టణానికే తలమానికం మావుళ్ళమ్మ దేవస్థానం. పశ్చిమగోదావరి జిల్లాలో మరే ఇతర గ్రామదేవత ఆలయానికి లేనంత విశిష్టత ఈ దేవాలయానికి ఉంటుంది. దేవాలయం నగరం నడిబొడ్డున ఉంటూ ప్రజలను ఎల్లవేళలా కన్నబిడ్డల్లా చల్లగా చూసుకుంటూ, రక్షిస్తూ ఉంటుంది.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

బీమవరం మావుళ్ళమ్మ

బీమవరం మావుళ్ళమ్మ

బీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణి గా విలసిల్లుతూ ఉన్నది. గర్భాలయానికి ఇరువైపులా గౌతమబుద్ధుడు, రామకృష పరమహంస విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారికి చీరలు, బంగారం, వెండి వస్తువులను కానుకలుగా ఇస్తుంటారు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

ప్రసాదం, ఉత్సవాలు

ప్రసాదం, ఉత్సవాలు

జ్యేష్ఠ మాసంలో నెలరోజులపాటు గ్రామ జాతర నిర్వహిస్తారు. ప్రతిఏడు సంక్రాంతి మొదలు (జనవరి 13) 40 రోజుల వరకు ఉత్సవాలు జరుపుతారు. చివరి రోజున వేలాది మంది భక్తులకు అన్నదానం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం భక్తులకు ఉచితంగా పులిహోరను ప్రసాదంగా అందిస్తారు.

టెంపుల్ టైమింగ్స్ : ఉదయం 5 నుండి రాత్రి 9 గంటల వరకు తెరుస్తారు.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

భీమవరం లో మరియు చుట్టుప్రక్కల చూడవలసిన మరికొన్ని పర్యాటక స్థలాలు/దర్శనీయ ప్రదేశాలు

భీమవరం లో మరియు చుట్టుప్రక్కల చూడవలసిన మరికొన్ని పర్యాటక స్థలాలు/దర్శనీయ ప్రదేశాలు

సాయిబాబా ఆలయం, సూర్యభగవాన్ ఆలయం, క్యాథలిక్ చర్చ్, వీరభద్ర ఆలయం, బాల సుబ్రమణ్య టెంపుల్, ఆదుర్రు - చారిత్రక స్థలం, పారుపల్లి అమ్మవారి ఆలయం, దిరుసుమర్రు ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, యనమదుర్రు శక్తీశ్వరస్వామి దేవాలయం మొదలగునవి.

చిత్రకృప : విశ్వనాధ్.బి.కె.

భీమవరం ఎలా చేరుకోవాలి ?

భీమవరం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : భీమవరానికి 90 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కలదు.

రైలు మార్గం : బీమవరంలో సొంతంగా రైల్వే స్టేషన్ కలదు.

రోడ్డు మార్గం : భీమవరానికి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కాకినాడ మొదలగు పట్టణాల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : indianrailinfo

Please Wait while comments are loading...