Search
  • Follow NativePlanet
Share
» »సూర్య కిరణాలు ఈ విగ్రహాన్ని తాకే సమయంలో ఆ ప్రాంతం మొత్తం వైకుంఠమే సందర్శతో మీ శత్రువులను

సూర్య కిరణాలు ఈ విగ్రహాన్ని తాకే సమయంలో ఆ ప్రాంతం మొత్తం వైకుంఠమే సందర్శతో మీ శత్రువులను

యాగం చేసే సమయంలో బ్రహ్మ చేసిన తప్పుకు జన్మించిన ఇద్దరు రాక్షసులను జయించిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఇక్కడ ఆదికేశవుడి రూపంలో కొలువై ఉన్నాడు. మిగిలిన విగ్రమాల కంటే ఈ ఆదికేశవ పెరుమాల్ విగ్రహం చాలా విభిన్నమైనది.

మొత్తం 16,008 సాలగ్రామాలతో చేయబడిన ఈ విగ్రహానికి నిత్యం అభిషేకాలు ఉండవు. ఇక గర్భగుడిలో ఎటువంటి లైటింగ్ వ్యవస్థ ఉండదు. కేవలం నేతి దీపంతో మాత్రమే విగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది. సూర్యకిరణాలు ఈ విగ్రహాన్ని తాకే సమయంలో ఆ ప్రాంతం మొత్తం వైకుంఠంగా మారుతుందని పురాణ కథనం వివరిస్తుంది.

అ సమయంలో ఆ విగ్రహాన్ని సందర్శించడం వల్ల శత్రవులను జయించే శక్తి లభిస్తుందని స్థానికులు నమ్ముతారు. అందువల్లే చాలా మంది లాయర్లు, రాజకీయ నాయకులు ఇక్కడకు తరుచుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెలుతుంటారు. ఈ విగ్రహాన్ని ఒకే సారి మొత్తం చూడలేము. మూడు ద్వారాల గుండా వెళ్లి మూడు భాగాలుగా విగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది.

కన్యాకుమారి జిల్లాలో

కన్యాకుమారి జిల్లాలో

P.C: You Tube

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తిరువత్తర్ అన్న చిన్నపట్టణంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నాగర్ కోయిల్ పట్టణం నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

108 విశిష్ట వైష్ణవాలయాలు

108 విశిష్ట వైష్ణవాలయాలు

P.C: You Tube

హిందూ పురాణాల్లో పేర్కొనబడిన 108 విశిష్ట వైష్ణవ దేవాలయాల్లో ఈ ఆదికేశవ పెరుమాల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం చుట్టూ కనుచూపు మేరలో పచ్చటి చెట్లు, జలజల పారే జలపాతాలు ఉంటాయి.

 మూడు నదులు సంగమించే

మూడు నదులు సంగమించే

P.C: You Tube

ముఖ్యంగా మూడు నదులు సంగమించే ప్రాంతంలో ఉన్న దేవాలయానికి సంబంధించిన పురాణ కథనం కూడా ఎంతో ప్రాచూర్యం చెందినది. పూర్వం బ్రహ్మ దేవుడు ఈ తిరువత్తర్ ప్రాంతంలో గొప్ప యాగాన్ని చేయాలని భావిస్తాడు.

బ్రహ్మ చేసిన తప్పుతో

బ్రహ్మ చేసిన తప్పుతో

P.C: You Tube

యాగం జరుగుతున్న సమయంలో బ్రహ్మ దేవుడు తెలియక చేసిన పనికి కేశ, కేశి అనే ఇద్దరు రాక్షసులు ఆ యాగ కుండం నుంచి జన్మిస్తారు. వీరు రోజురోజుకు బలాన్ని పెంచుకొంటూ పోతారు. స్థానికంగా ఉంటున్న ప్రజలతోపాటు బుుషులనున కూడా భాదించడం మొదలు పెడుతారు.

విష్ణువును వేడుకొంటారు

విష్ణువును వేడుకొంటారు

P.C: You Tube

వీరి చర్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న బుుషులు, దేవతలు విసిగిపోయి తమను రక్షించాల్సిందిగా శ్రీహరి వద్దకు వెళ్లి వేడుకొంటారు. వారికి అభయమిచ్చిన శ్రీ మహావిష్ణువు కేశతో తీవ్రంగా పోరాడి అతడిని సంహరిస్తాడు.

కేశిని తలగడగా

కేశిని తలగడగా

P.C: You Tube

అటు పై అతనితో పాటు జన్మించిన కేశి అనే రాక్షసిని మహిళ అన్న ఒకే ఒక్కకారణంతో చంపకుండా వదిలిపెడుతాడు. అయితే ఆమె ప్రజలను తిరిగి బాధపెడుతుందన్న ఆలోచనతో ఆమెను తలగడగా చేస్తాడు. పడుకొనే ఆదిశేషుడి మీద ఆ తలగడను ఉంచి ఆ తలగడ పై విష్ణువు పడుకొంటాడు.

మహావిష్ణవును మునిగి పోవాలని

మహావిష్ణవును మునిగి పోవాలని

P.C: You Tube

దీంతో కోపగించుకొన్న కేశి తన శక్తితో కోదై, పరలి, తామిరబరణి అనే మూడు నదులను స`ష్టిస్తుంది. ఆ నదీ ప్రవాహాలను ఒకచోటకు తెచ్చి ఆ నీటిలో శ్రీ మహావిష్ణువు మునిగిపోయేలా చేయడం ఆ కేశి లక్ష్యం.

భూదేవి

భూదేవి

P.C: You Tube

అయితే ఈ విషయం తెలుసుకొన్న భూ దేవి ఆ విష్ణువు ఉంటున్న ప్రాంతాన్ని మరికొంచెం ఎత్తుగా చేరుస్తుంది. దీంతో విష్ణువు మునిగి పోకుండా ఉంటాడు. దీంతో ఆ మూడు నదులు సముద్రంలో కలిసిపోతాయి.

రుద్రాక్షలను

రుద్రాక్షలను

P.C: You Tube

అప్పటికీ శాంతించని కేశి తనకు ఉన్న 12 చేతులతో విష్ణువు తల కింద నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సమయంలో విష్ణువు మంత్రించిన రుద్రాక్షలను చేతికి ఒకటి చొప్పున మొత్తం 12 రుద్రాక్షలు కేసి చేతిలో పెట్టి కదలకుండా నియత్రిస్తాడు.

ఆది కేశవుడు

ఆది కేశవుడు

P.C: You Tube

అందువల్లే ఇక్కడ ఉన్న మహావిష్ణువును ఆదికేశవుడు అని పిలుస్తారు. సాధారణంగా ఆదిశేషుడి పై పడుకున్న విష్ణువు మనకు ఎడమవైపున ముఖం ఉండగా, కుడి వైపునకు కాళ్లు ఉంటాయి.

అయితే ఇక్కడి ఆదికేశవ పెరుమాల్ విగ్రహం ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది.

పూర్తిగా వ్యతిరేకం

పూర్తిగా వ్యతిరేకం

P.C: You Tube

అంటే మనకు కుడివైపున స్వామివారి ముఖం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ విష్ణువు విగ్రహం బ`హదాకారంలో ఉంటుంది. ముఖ్యంగా 16,008 సాలిగ్రమాలతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. అందువల్లే విగ్రహానికి నిత్య అభిషేకం ఉండదు.

మూడు ద్వారాల ద్వారా

మూడు ద్వారాల ద్వారా

P.C: You Tube

ఒకే ద్వారం ద్వారా ఈ బ`హదాకార మూలవిరాట్టును చూడటానికి వీలుకాదు. మొత్తం మూడు ద్వారాల గుండా వెళ్లి మూడు భాగాలుగా ఈ మూలవిరాట్టును చూడవచ్చు. ఇక్కడ విష్ణువు నాభి వద్ద బ్రహ్మ ఉండడు. శ్రీ దేవి, భూ దేవి ఉంటారు. అంతేకాకుండా ఈ విగ్రహం చెంతనే శివలింగం కూడా ఉంటుంది.

నేతి దీపం

నేతి దీపం

P.C: You Tube

గర్భగుడిలో ఎటువంటి క`త్రిమ వెలుగు ఉండదు. అంటే లైటింగ్ వ్యవస్థ ఉండదు. కేవలం స్వచ్ఛమైన నేతితో వెలిగించిన దీపం ద్వారా మాత్రమే మనం గర్భగుడిలోని విగ్రహాన్ని చూడవచ్చు. ఈ దీప వెలుగులో స్వామి వారి విగ్రహాన్ని చూడటం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

సూర్య భగవానుడి కిరణాలతో

సూర్య భగవానుడి కిరణాలతో

P.C: You Tube

ఇదిలా ఉండగా కొన్ని నిర్థిష్టమైన రోజుల్లో సూర్యభగవానుడి కాంతి గర్భగుడిలో ఉన్న విగ్రహం మొత్తాన్ని తాకుతూ అనిర్వచనీయమైన అందాన్ని కలుగజేస్తాయి. ఆ సమయంలో ఈ దేవాలయ ఆవరణం మొత్తం వైకుంఠంగా మారిపోతుందని స్థానికులు చెబుతారు. ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

కేరళ శైలి

కేరళ శైలి

P.C: You Tube

ఈ దేవాలయం తమిళనాడు భూభాగంలో ఉన్నా కూడా కేరళ శైలి నిర్మాణం కనిపిస్తుంది. దేవాలయం నిర్మాణంలో ఎక్కువ భాగం చెక్కను కూడా వినియోగించడం విశేషం. అదే విధంగా రాతి స్తంభాల పై అద్భుతమైన శిల్ప సంపదను చూడవచ్చు.

పశ్చిమ దిక్కునకు

పశ్చిమ దిక్కునకు

P.C: You Tube

ఇక్కడి ఆది కేశవ పెరుమాల్ పశ్చిమదిక్కునకు ముఖం చేసి ఉంటాడు. అందువల్ల తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని సదా దర్శంన చేసుకొంటూ ఉంటాడని భక్తులు చెబుతారు. ఆ దేవాలయానికి ఈ ఆదికేశవ పెరుమాల్ దేవాలయ నిర్మాణంలో సారుప్యత కనిపిస్తుంది.

మొదట తిరువత్తూర్ నే

మొదట తిరువత్తూర్ నే

P.C: You Tube

సాధారణంగా 108 విశిష్ట వైష్ణవాలయాల దర్శనానికి వెళ్లే భక్తులు తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వెళ్లే ముందే తిరువత్తూర్ లోని ఆది కేశవ దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలన్న నిబంధన ఉన్నట్లు చెబుతారు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

తిరువనంతపురం కన్యాకుమారి రైలు మార్గంలో తిరువత్తూర్ పట్టణం వస్తుంది. అంతేకాకుండా తిరువనంతపురం నుంచి నాగర్ కోయిల్ వెళ్లే బస్సులో మార్తాండం అనే చోట దిగి తొమ్మిది కిలోమీర్లు ప్రయాణం చేస్తే తిరువత్తూర్ వస్తుంది. ఈ మార్గంలో ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X