Search
  • Follow NativePlanet
Share
» »రంగులు మారే మిస్టరీ శివాలయాలు !

రంగులు మారే మిస్టరీ శివాలయాలు !

By Mohammad

ఇప్పటివరకు శివలింగాలను నల్లని రూపంలో, తెల్లని మంచు రూపంలో (అమర్నాథ్ లో మాత్రమే) చూసివుంటాం. మరి రంగురంగుల శివలింగం గురించి మాటేమిటి ? ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సందేహపడకుండా చెప్పవచ్చు .. ఇది ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయం అని. ఇంకెందుకు ఆలస్యం, రోజులో మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకోవటానికి రాజస్థాన్ వెళదాం పదండి !

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఉదయంవేళ ఎర్రగా, మధ్యాహ్నం వేళ కాషాయంలో మరియు సాయంత్రం వేళ చామర ఛాయ గా కనిపిస్తుంది. కొన్ని పరిశోధనల వల్ల తెలిసిందేమిటంటే సూర్యుని కాంతి శివలింగం మీద పడటం వల్ల ఇలా జరుగుతుందట. కానీ ఇప్పటి వరకు సైన్టిఫిక్ గా ఎవరూ నిరూపించలేదు.

shivaling

చిత్ర కృప : Jean-Pierre Dalbéra

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జరుగుతున్న ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి భక్తులు, యాత్రికులు రాష్ట్రం నలుమూలల నుండి వస్తుంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని శివలింగాన్ని చూస్తూ తరించిపోతారు. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ లో ప్రసిద్ధి చెందిన ఆలయం.

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం గా చెబుతారు అక్కడి స్థానికులు. ఇక్కడి మరొక ఆకర్షణ నంది విగ్రహం. ఈ నంది విగ్రహాన్ని పంచ లోహాలతో తయారుచేశారు. ఇక్కడి పురాణ కధనం మేరకు, ముస్లీమ్ ఆక్రమణదారులు ఈ ఆలయం మీద దండెత్తినప్పుడు ఈ విగ్రహం తేనెటీగలతో దాడి చేసిందట.

ఆలయం లోని శివలింగం స్వయంభూ లింగాలలో ఒకటి. కొంత మంది ప్రజలు శివలింగం స్వయం భూ కదా ? మరి అది ఎంత లోతు ఉందొ చూడాలని లింగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. శివలింగం లోతు తవ్వేకొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటం తో వారు ఆ పనిని నిష్క్రమించారు.

colorful shivaling

చిత్ర కృప : Nagarjun Kandukuru

ఇండియాలో చాలా మందికి ఇటువంటి ఆలయం ఉన్నట్లు అస్సలు తెలీదు. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమలు కలది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎన్నో కోరికలు నెరవేరతాయి. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడ పూజలు వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట !

ఈ శివలింగం ప్రపంచములో దాగున్న ఎన్నో రహస్యాలు ఉదాహరణ మాత్రమే!

ఆగండి .. ఆగండి .. ఇంకా అయిపోలేదు. ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ లో కూడా ఇటువంటి రంగులు మారే శివలింగం ఉందంట. రోజుకు మూడుసార్లు రంగులు మారుతుందట. ఇక్కడి శివలింగం కూడా స్వయం భూ లింగాలలో ఒకటి మరియు దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. హాపూర్ గ్రామం దేశ రాజధాని ఢిల్లీ నుండి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో కలదు. గంటన్నర లో చేరుకోవచ్చు.

ధోల్పూర్ ఎలా చేరుకోవాలి ?

అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ధోల్పూర్ యొక్క చంబల్ పరివాహ ప్రాంతంలో కలదు. ధోల్పూర్ పట్టణం, రాజస్థాన్ లోని అన్ని ప్రాంతాల నుండి చక్కగా కనెక్ట్ చేయబడినది. ధోల్పూర్ జైపూర్ కు 280 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రా నుండి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో కలదు.

బస్సు ద్వారా : రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలనుండి ధోల్పూర్ కు బస్సులు కలవు.

రైలు ద్వారా : ధోల్పూర్ రైల్వే జుంక్షన్ మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు వెళుతుంటాయి

విమానం ద్వారా : ఆగ్రా ఎయిర్ పోర్ట్ ధోల్పూర్ కు సమీపాన ఉన్న ఎయిర్ పోర్ట్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X