• Follow NativePlanet
Share
» »మకర జ్యోతి వెనుక ఆశ్చర్యకరమైన రహస్యం !

మకర జ్యోతి వెనుక ఆశ్చర్యకరమైన రహస్యం !

శబరిమలై ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మకర జ్యోతి. మకర సంక్రాంతి నాడే అయ్యప్ప జ్యోతిని చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

అయితే అది మూఢనమ్మకమని భక్తులను మోసం చేసేదానికి మనుషులే చేసేదని చాలామంది వాదించేవారున్నారు.

గుండాలకోన - తిరుపతి కి 77 km ల దూరంలో ఉన్న ఒక అద్భుత ప్రదేశం !

శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.

మీరు చూడని మదురై ... పురాతన చిత్రాలలో !

ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

శబరిమలై యాత్ర

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. అయ్యప్ప భక్తులు

1. అయ్యప్ప భక్తులు

దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏట నవంబరు నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు. ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది.

pc:Challiyan

2. 41 రోజులు

2. 41 రోజులు

మండల పూజకు హాజరయ్యే వారు తప్పని సరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. సాధారణంగా ఈయాత్రలు స్వాములు ఒక గురుస్వామి (5 సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వాళ్ళు) నాయకత్వంలో ఒక బృందంగా బయలు దేరి వెళతారు. ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కెట్టు (గుడ్డతో చుట్టిన పూజా సామాగ్రి) ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది..

pc:Sailesh

3. మహిషి

3. మహిషి

ఒకప్పుడు మహిషి అనే రాక్షసి తన సోదరుడైన మహిషాసురుని చావుకు దేవతలే కారణమని తెలుసుకుని దేవతలపై పగ సాధించడానికి ఘోర తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుండి చాలా వరాలు పొందింది. ఆ వరాలతో మనుషులను, దేవతలను హింసించేది.

pc:Praveenp

4. మకర సంక్రాంతి

4. మకర సంక్రాంతి

అయితే అయ్యప్పస్వామి చాలా చిన్నవయస్సులోనే మకర సంక్రాంతి రోజున ఆ రాక్షసిని చంపాడట. ఆ తరువాత శబరిమలై కొండలలో దేవుడుగా వెలిసాడని, పురాణాలలో చెప్పబడినది. అప్పటినుండి ఆయన భక్తులచే పూజలందుకుంటున్నాడు.

pc:Sailesh

5. మకర విళక్కు

5. మకర విళక్కు

మన మకరసంక్రాంతినే మకర విళక్కు అని కేరళలో అంటారు. ఈరోజునే అయ్యప్ప జ్యోతిలో కనపడతాడని భక్తులు లక్షల్లో వస్తూవుంటారు. 1999లో మరియు 2011లో జరిగిన తొక్కిసలాటల్లో చాలామంది చనిపోయారు చాలామంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి:శబరిమల గురించి మనకు తెలియని నిజాలు !

pc:Sailesh

6. మకరజ్యోతి

6. మకరజ్యోతి

ఈ ఘటనల తర్వాత హేతువాదులు మకరజ్యోతిని కొందరు స్వార్థం కోసం సృష్టించిన మూఢనమ్మకమని గట్టిగా వాదించారు. దీనితో కేరళ హైకోర్టు ఈ వివాధం పైన 2002 లో ఆలయ కమిటీని వివరణ అడిగింది. ది హిందూ పేపర్, ఆలయ కమిటీ ఇచ్చిన వివరాలను అదే సంవత్సరం జనవరిలో ఒక వ్యాసంగా ప్రకటించింది.

pc:Harhar2008

7. పందలరాజ వంశస్తులు

7. పందలరాజ వంశస్తులు

దాంట్లో ఏముందంటే మకర సంక్రాంతి నాడు గుడికి తూర్పుగా వున్న పొన్నాంబల మేడు కొండ మీద గిరిజనులు సంబరాలు చేసుకుంటారని, అయ్యప్పస్వామి మహిషను చంపి ఆ గిరిజనులను కాపాడినందుకు ఆ కొండపైనే పెద్ద జ్యోతిని వెలిగించి హారతి ఇచ్చేవారని ఆ హారతిని చూశాకే పందలరాజ వంశస్తులు బంగారునగలను పంపేవారని ఇది ఒక సాంప్రదాయంగా సాగేదట.

pc:Sailesh

8. ట్రావెన్కోర్ దేవస్థానం

8. ట్రావెన్కోర్ దేవస్థానం

ఆ సంప్రదాయాన్నే ఇప్పుడు ఆలయ కమిటీ మరియు కేరళ ప్రభుత్వం ఆలయ హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆలయానికి చెందిన ప్రధానపూజారి చెప్పారట. ఈ హారతినే మకరజ్యోతి అంటారట.

pc:Aruna

9. ట్రావెన్కోర్ దేవస్థానం

9. ట్రావెన్కోర్ దేవస్థానం

కొంతమంది దీనిని అయ్యప్పస్వామి జ్యోతిగా ప్రచారం చేసారని ఆయన చెప్పారట. ఇదే విషయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారు మరియు పందల రాజభవన్ వారు కూడా సమర్ధించారట.

pc:Aruna

10. శబరిమల యాత్ర

10. శబరిమల యాత్ర

పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.

ఇది కూడా చదవండి:శబరిమల గురించి మనకు తెలియని నిజాలు !

pc:Tonynirappathu

11. అయ్యప్ప జననం

11. అయ్యప్ప జననం

చైత్రమాసము, ఉత్తరా నక్షత్రం, చతుర్ధశి - సోమవారము నాడు జన్మింఛినారు . జ్యోతి రూపంగా అంర్ధానమయిన రోజు - మఖర సంక్రాంతి . క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు.

pc:Chitra sivakumar

12. అయ్యప్ప

12. అయ్యప్ప

తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త (అయ్యప్ప) జన్మించాడు.

pc:Praveenp

13. ఆరాధ్య దైవం

13. ఆరాధ్య దైవం

ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు. అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు.

pc:AnjanaMenon

14. అంతఃపురము

14. అంతఃపురము

సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది.

pc:AnjanaMenon

15. మణికంఠుడు

15. మణికంఠుడు

అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు.

pc:Aruna

16. అవతారపురుషుడు

16. అవతారపురుషుడు

తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు.

pc:Aruna

17. పులిపాలు

17. పులిపాలు

గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

pc:AnjanaMenon

18. నియమం

18. నియమం

రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.

pc:Chitra sivakumar

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి